రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేయడానికి నిరూపితమైన సాంకేతికత, ఆర్థిక సాధ్యత, ముడి సరుకు లభ్యత, సమర్థవంతమైన మార్కెటింగ్ అవసరమని నొక్కి చెప్పిన కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 09 MAY 2022 4:18PM by PIB Hyderabad

ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేయడానికి నిరూపితమైన సాంకేతికత, ఆర్థిక సాధ్యత, త‌గిన ముడిసరుకు లభ్యత మరియు సమర్థవంతమైన మార్కెటింగ్ త‌దిత‌రాలు అవసరమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఉద్ఘాటించారు. సీఎస్ఐఆర్‌-సీఆర్ఆర్ఐ ద్వారా గుంతల మరమ్మతు కోసం మొబైల్ కోల్డ్ మిక్సర్ కమ్ పేవర్ మెషిన్ & ప్యాచ్ ఫిల్ మెషీన్‌ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ నిర్మాణ వ్యయం తగ్గించి నిర్మాణ నాణ్యతను మెరుగుపరచ‌డం ర‌హ‌దారుల రంగంలో అత్యంత ముఖ్యమైన విషయమ‌ని పేర్కొన్నారు.  ఏ టెక్నాలజీకైనా పేటెంట్ నమోదు చేయడంతో అంతిమం కాదని మంత్రి అన్నారు. పేటెంట్ వాణిజ్యీకరించబడకుండా మరియు పూర్తిగా వినియోగించబడే వరకు క్రమం తప్పకుండా వాటిని త‌గిన విధంగా కొనసాగించి తుద‌వ‌ర‌కు తీసుకెళ్లడం సంస్థ బాధ్యత అని ఆయన అన్నారు. వివిధ కారణాల వల్ల నిరూపితమైన  ఆయా సాంకేతికతను అవలంబించే విష‌యమై వ్యవస్థలో సందేహం నెల‌కొనిఉందని శ్రీ గడ్కరీ అన్నారు. కొత్త వ్యవస్థలు మరియు సాంకేతికతలను అమలు చేయడానికి కమ్యూనికేషన్, సమన్వయం, సహకారంలో మొత్తం సమకాలీకరణ అవసరమని ఆయన అన్నారు. 1997లో నాగ్‌పూర్‌లో ఇప్పటి వరకు గుంతలు ప‌డ‌కుండా సిమెంట్-కాంక్రీట్ రోడ్డు నిర్మాణానికి సీఎస్‌ఐఆర్ డిజైన్ చేసింద‌ని  మంత్రి తెలుపుతూ వారిని అభినందించారు. రోడ్ల నిర్మాణంలో స్టీల్‌, సిమెంట్‌కు ప్రత్యామ్నాయాల‌పై అన్నివిధాలా కృషి చేయాలని అన్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. రోడ్డు రవాణా మరియు హైవేస్ విభాగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ వాడ‌కం పెరుగుతుండ‌డం భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి గొప్ప విలువను జోడిస్తోంద‌ని అన్నారు. ఈ రంగంలో సరసమైన, స్థిరమైన మరియు పునర్వినియోగపరచదగిన సాంకేతికతలను ఉపయోగించడం భారతదేశ ధమని నెట్‌వర్క్‌ను వేగంగా నిర్మిస్తోందని ఆయన అన్నారు. సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ల‌ ద్వారా రాబోయే దశాబ్దాలలో భారతదేశ ఆరోహణ నిర్ణయించబడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. బిటుమెన్ ఎమల్షన్‌ను ఉపయోగించి బ్లాక్ టాప్ లేయర్‌ను నిర్మించడానికి 'మొబైల్ కోల్డ్ మిక్సర్ కమ్ పేవర్' మరియు గుంతల మరమ్మత్తు కోసం 'ప్యాచ్ ఫిల్ మెషిన్' అనే రెండు పరికరాలను దేశానికి అంకితం చేయడం గురించి డాక్టర్ సింగ్ ప్రస్తావిస్తూ, ఇవి ఆత్మనిర్భర్ భారతదేశానికి సరైన ఉదాహరణల‌ని అన్నారు. పరికరాలు పూర్తిగా దేశీయంగా నిర్మించబడ్డాయ‌ని అన్నారు. భారత దేశంలోని ప‌ర్వ‌త‌శ్రేణులు క‌లిగిన‌.. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలో రోడ్లు మరియు హైవేలను నిర్మించడంలో కోల్డ్ మిక్సర్ మరియు ప్యాచ్ ఫిల్ మెషిన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మంత్రి చెప్పారు.
                                                                                 

********


(Release ID: 1824032) Visitor Counter : 164