శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

వాతావరణ మార్పు వంటి కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే అన్ని రంగాల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్టీ) పెట్టుబడులు పెట్టాలి: డీఎస్టీ కార్యదర్శి

Posted On: 09 MAY 2022 4:38PM by PIB Hyderabad

డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 52వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నిర్వహించిన వేడుకల్లో డీఎస్టీ కార్యదర్శి ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ... గడిచిన 51 సంవత్సరాల్లో ఏ మేరకు లక్ష్యాలను సాధించామో ఆత్మపరిశీలన చేసుకునేందుకు.. అలాగే ముందుకు సాగేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇదో మంచి సందర్భమన్నారు.


“దేశంలో శాస్త్రసాంకేతిక పరిశోధనలకు నిధులు సమకూర్చేలా శాస్త్రీయ వేదికను నిర్మించేందుకు డీఎస్టీ ఏర్పాటు చేయబడింది. తరువాత, పరిశోధన యొక్క అనువాదం కూడా విధివిధానాల్లో చేర్చబడింది. శాస్త్రసాంకేతికతలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు మరియు అనువాదానికి సహకరించడం ద్వారా దేశవ్యాప్తంగా శాస్త్రసాంకేతికతను సమన్వయం చేయడంలో డీఎస్టీ విజయవంతమైంది. కరోనా మహమ్మారిని అధిగమించడానికి సైన్స్ అండ్ టెక్నాలజీకి సహకారం అందించడంలో కూడా ఇది విజయవంతమైంది. అయితే, కొత్త సవాళ్లు పుట్టుకొస్తున్నాయి, ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి దేశానికి సహాయం చేయడానికి  డీఎస్టీ స్వయంగా సన్నద్ధం కావాలి” అని డిఎస్‌టి కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు.

ప్రపంచ పర్యావరణ మార్పులతో ఎదురవుతున్న సవాళ్లను ఉదాహరణగా తీసుకుని డాక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ...  గ్లోబల్ వార్మింగ్కు దోహదపడే రంగాల్లో డీఎస్‌టీ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. “మనం మరింత తెలివిగా ఉండాలి, సవాళ్ల పట్ల మరింత స్పృహతో ఉండాలి. మరియు స్థిరమైన అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలి. మన పనిని ఎలా మెరుగ్గా చేయాలనే దాని గురించి మనం  మరింతగా శ్రమించాలని’ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు.

శాస్త్రసాంకేతిక అభివృద్ధిలో విశేషంగా కృషి చేస్తున్న ఇన్‌స్పైర్ (ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్‌స్పైర్డ్ రీసెర్చ్) , వివిధ స్థాయిలలోని విద్యార్థులు, పరిశోధకులు, పండితులు మరియు అధ్యాపకులు, మహిళా కార్యక్రమాల వరకు 'స్పూర్తి' పొందిన ఇతర కార్యక్రమాలను అభినందించారు. ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసిన సెర్బ్,  ప్రజా ప్రయోజనాల కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆలోచనలను అనువదించడంలో సహాయపడిన టీడీబీ కృషిని కూడా డాక్టర్ చంద్రశేఖర్ అభినందించారు.

‘‘ప్రజల జీవితాలను అన్నిరకాలుగా ప్రభావితం చేయగలిగే రంగంలో పనిచేస్తుండడం మన అదృష్టం. ఇక్కడ ఉత్పత్తి చేయబడిన వ్యాక్సిన్, అభివృద్ధి చేయబడిన సాంకేతికతను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారు. కాబట్టి మనం మరింత ప్రభావవంతమైన మార్గాల్లో శాస్త్రసాంకేతిక ప్రయోజనాలను చేరుకోవడానికి సహాయపడే మార్గాల గురించి ఆలోచించాలి”అని డీఎస్టీ కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ నొక్కి చెప్పారు.

డీఎస్టీని మాతృ విభాగంగా అభివర్ణిస్తూ.. శాస్త్రసాంకేతిక విభాగాలు రెండు విభాగాలు మరింత సన్నిహితంగా మరియు పరస్పరం సహకరించుకుంటూ పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్ అన్నారు.

క్రికెట్ నుంచి సంగీతం, క్విజ్, కవితల వరకు వివిధ పోటీల్లో గెలుపొందిన శాఖ ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు డీఎస్టీ యొక్క స్వయంప్రతిపత్త సంస్థ నెక్టార్ అభివృద్ధి చేసిన క్రికెట్ బ్యాట్ మరియు వికెట్లను బహుకరించారు.

డీఎస్టీ సీనియర్ సలహాదారు డాక్టర్ అఖిలేశ్ గుప్తా, అదనపు కార్యదర్శి, ఆర్థిక సలహాదారు విశ్వజిత్ సహాయ్, సంయుక్త కార్యదర్శి సునీల్ కుమార్, క్లైమెట్ చేంజ్ ప్రోగామ్, వైస్ కిరణ్ డివిజన్ హెడ్ డాక్టర్ నిశా మెందిరట్లా, స్వయంప్రతిపత్తి సంస్థల డైరెక్టర్లు, డీఎస్టీ అధికారులు ఈ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు. 

 

***



(Release ID: 1824030) Visitor Counter : 127