వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఇటలీతో తన వాణిజ్యంలో గణనీయమైన పరివర్తన , అనుపమాన వృద్ధి కోసం భారతదేశం ఎదురుచూస్తోంది - శ్రీ పీయూష్ గోయల్
"భారతదేశం ప్రపంచంలో ఎ దేశంతోనైనా అతిపెద్ద వ్యాపార అవకాశాన్ని అందిస్తుంది": శ్రీ గోయల్
"మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రూపొందించడంలో నేటి సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగు": మిస్టర్ లుగి డి మైయో, ఇటలీ విదేశాంగ మంత్రి
ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి , ద్వైపాక్షిక వాణిజ్యం , పెట్టుబడులను ఉపయోగించుకోవడానికి రెండు దేశాల మధ్య వేగవంతమైన యంత్రాంగాన్ని శ్రీ గోయల్ సూచించారు
Posted On:
06 MAY 2022 8:52PM by PIB Hyderabad
వాణిజ్యం , పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ , జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, "ఇటలీతో తన వాణిజ్యంలో గణనీయమైన పరివర్తన , అనుపమాన వృద్ధి కోసం భారతదేశం ఎదురుచూస్తోంది" అన్నారు. ఈరోజు రిపబ్లిక్ ఆఫ్ ఇటలీలోని విదేశీ వ్యవహారాలు,అంతర్జాతీయ సహకార మంత్రి శ్రీ లుయిగి డి మైయోతో కలిసి ఇండియా-ఇటలీ బిజినెస్ రౌండ్‌టేబుల్‌కు సహాధ్యక్షునిగాగా వ్యవహరించిన శ్రీ గోయల్, పర్యాటకం, సేవలు, సరుకులు, వస్తువుల నుంచి, డిజిటల్ ప్రపంచం, విద్య , రూపకల్పన వంటి అనేక రంగాలలో అవకాశాలు ఉన్నాయని అన్నారు.
“భారత్ , ఇటలీ మధ్య మనం ప్రణాళిక చేస్తున్న సిరీస్‌లో ఈరోజు మొదటి కలయిక. 135 కోట్ల భారతీయుల మంచి భవిష్యత్తు కోసం ఎదురుచూస్తోంది. ఈరోజు 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నుండి పదేళ్లలో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు 20 దాదాపు సంవత్సరాల్లో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు , 50 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ఎదిగే లక్ష్యానికి, మనమందరం కట్టుబడి ఉన్నామని నేను నమ్ముతున్నాను కాబట్టి భారతదేశం ప్రపంచంలో ఎక్కడైనా అతిపెద్ద వ్యాపార అవకాశాన్ని అందిస్తుంది. ముఖ్యంగా మనం దేశంలో ఇంకా ఈ లక్ష్య సాకారానికి చాలా ప్రారంభ దశలోనే ఉన్నప్పుడు, - మార్కెట్ పెద్ద పరిమాణం, భారతదేశ ప్రజల లోతైన ఆకాంక్షలు , భారతదేశం అందించే ప్రతిభ , అవకాశాల ప్రపంచం, ఇరువైపులా వ్యాపారాలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటాయని నేను ఆశిస్తున్నాను” అని సమావేశంలో తన ప్రారంభ వ్యాఖ్యలలో శ్రీ గోయల్ అన్నారు.
-
ఈ సందర్భంగా లుగి డి మైయో మాట్లాడుతూ ఇటలీ, భారత్‌లు క్రియాశీల ఆర్థిక సహకారాన్ని అనుభవిస్తున్నాయన్నారు. ఇటలీ ప్రభుత్వం రెండు దేశాల మధ్య పరిశ్రమ స్థాయిలో , పారిశ్రామికవేత్తల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుందని ఆయన అన్నారు.
"మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రూపొందించడంలో నేటి సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగు" అని మిస్టర్. లుగి డి మైయో అన్నారు, "చాలా ఇటాలియన్ కంపెనీలు, వారి దీర్ఘకాలిక వ్యూహంలో, భారతదేశాన్ని ఒక కీలక దేశంగా పరిగణించాయి, దీని మార్కెట్ ప్రపంచ స్థాయిలో వృద్ధి చెందుతుంది. ."
భారతదేశం , ఇటలీ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2020-21లో రికార్డు స్థాయిలో 10 బిలియన్ యూరోలకు చేరుకుందని మిస్టర్ లుగి డి మైయో చెప్పారు.
"600 పైగా ఇటాలియన్ కంపెనీలు, ప్రధానంగా ఢిల్లీ , ముంబై చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి, 5 బిలియన్ యూరోల ప్రపంచ టర్నోవర్‌తో సుమారు 50,000 మంది స్థానిక సిబ్బందిని నియమించామని" ఆయన చెప్పారు.
అంతకుముందు, శ్రీ గోయల్ శ్రీ లుగి డి మైయోతో వారి ప్రత్యక్ష ముఖాముఖి సమావేశంలో వాణిజ్యం , పెట్టుబడి అవకాశాలు పెంపొందించడం, భారతదేశం-యురోపియన్ యూనియన్ ఎఫ్‌టిఎ చర్చలు, ప్రపంచ వాణిజ్య సంస్థ అధీకృత పరిధిలో సహకారం వంటి ద్వైపాక్షిక ప్రయోజనాలకు సంబంధించిన బహుళ అంశాలపై; శక్తి పరివర్తనపై సాంకేతిక గోష్టి, ప్రత్యక్ష వాణిజ్య విమానాల పునఃప్రారంభం , చిన్న, మధ్యస్త సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం మొదలైన వాటిపై చాలా నిర్మాణాత్మకంగా చర్చించారు.
భారతదేశం , ఇటలీ మధ్య సక్రియాత్మక సంబంధం , సమస్యల క్రమమైన పరిష్కారం కారణంగా, ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం , ద్వైపాక్షిక వాణిజ్యం , పెట్టుబడి సంభావ్యతఉన్న రంగాలలో పరిపూరకాలను నెలకొల్పడం పై దృష్టి సారించడానికి భారతదేశం , ఇటలీల మధ్య ఏర్పాటు చేసిన వేగవంతమైన వాణిజ్య లావాదేవీలు అభివృద్ధి చేయాలని , వ్యాపార పరిధిని విస్తరించాలని శ్రీ గోయల్ సూచించారు. .
రైల్వేలు, రక్షణ , విమానయానం, ఆటోమోటివ్‌లు, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఫుడ్ ప్రాసెసింగ్, లెదర్, టెక్స్ టైల్స్ , ఫ్యాషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్, ఆర్ధిక సాంకేతికత వంటి ప్రాధాన్యతా రంగాలలో పారిశ్రామిక సహకారాలు , , సామర్థ్యాన్ని భాగస్వామ్యాలను మరింత విస్తరించడం , గ్రీన్ ఎనర్జీ, టెలికాం, ఎనర్జీ ట్రాన్సిషన్ , స్పేస్ అండ్ టెక్నాలజీ సహకారం, వాణిజ్యం , పెట్టుబడి సంబంధాలను నెలకొల్పడం అవసరం అన్న వాస్తవాన్ని రెండు మంత్రిత్వ శాఖలు పునరుద్ఘాటించాయి.
******
(Release ID: 1823491)
Visitor Counter : 148