ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
భారతదేశంలో చిప్ డిజైనింగ్‌ను అందరికీ అందుబాటులోకి తేవడం
మినిస్ట్రీ ఆఫ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ (మైటీ) డిజైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఇండ్ల వద్దకే తీసుకువస్తున్నందున ఇప్పుడు ఎక్కడి నుండైనా ఎవరైనా చిప్‌లను డిజైన్ చేయవచ్చు & ఆవిష్కరించవచ్చు
సి–డాక్కు చెందిన ఇండియా చిప్ సెంటర్ డిజైన్ లైసెన్స్‌లను కేంద్రీకృతంగా సమీకరించడం ద్వారా చిప్‌ల రూపకల్పనను మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు అందుబాటులో ఉంచవచ్చు.
Posted On:
04 MAY 2022 5:33PM by PIB Hyderabad
కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ (మైటీ)) దశలవారీగా, దేశంలోని 120 ప్రీమియర్ విద్యాసంస్థలలో సెమీకండక్టర్ డిజైన్ విధానాన్ని క్రమబద్ధంగా మార్చే పనిలో ఉంది. ఇది సృజనాత్మక నైపుణ్యాల యుగాన్ని ప్రారంభించింది. దేశంలో ఎక్కడైనా సెమీకండక్టర్ చిప్‌లను డిజైన్ చేయవచ్చు. ఈ ప్రక్రియ వల్ల చిప్ డిజైన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి అనుగుణంగా ప్రజాస్వామ్యీకరించడం జరుగుతుంది.- మేక్ ఇన్ ఇండియా వలె డిజైన్ ఇన్ ఇండియా కూడా అంతే ముఖ్యమైనది. చిప్ డిజైన్‌ను వ్యూహాత్మక ఆవశ్యకతగా అర్థం చేసుకోవాలి. పైలట్ మోహరింపును 2021లో మినిస్ట్రీ ఆఫ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ (మైటీ) ద్వారా చిప్స్ టు సిస్టమ్ డిజైన్ (ఎస్ఎండీపీసీ2ఎస్డీ ) కోసం స్పెషల్ మ్యాన్‌పవర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద విజయవంతంగా పరీక్షించింది. ఇందులో రిమోట్ యాక్సెస్ కోసం సి–డాక్ వద్ద కేంద్రీకృత డిజైన్ సౌకర్యం ప్రారంభించడం జరిగింది. చిప్‌ల రూపకల్పన కోసం 60 విద్యా సంస్థలలో 50,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. లీఫ్ ఫ్రాగింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ (మైటీ) ఇప్పుడు సి–డాక్లోని ఇండియా చిప్ సెంటర్ సెటప్‌లో కేంద్రీకృత చిప్ డిజైన్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. దేశవ్యాప్తంగా 120 విద్యా సంస్థలలో 85000 మందికిపైగా బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ విద్యార్థులకు చిప్ డిజైనింగ్లో తదుపరి 5 సంవత్సరాల కోసం శిక్షణ ఇస్తారు.
ఇండియా చిప్ సెంటర్ (సి–డాక్)లో చిప్ డిజైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి, ఈడీఏ (ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్), ఎలక్ట్రానిక్ కంప్యూటర్-ఎయిడెడ్ డిజైన్ (ఈకాడ్), ఐపీ కోర్ డిజైన్ సొల్యూషన్స్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ పరిశ్రమ విక్రేతలు కలసి పనిచేస్తున్నారు. సినాప్సిస్, కాండెన్స్ డిజైన్ సిస్టమ్స్, సీమెన్స్ ఈడీ, సిల్వాకోతోపాటు ఇతర ప్రముఖ టూల్ విక్రేతలు, ఐపీ & డిజైన్ సొల్యూషన్ ప్రొవైడర్లు, ఫ్యాబ్ అగ్రిగేటర్‌లతో నిర్దిష్ట సహకార ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇండియా చిప్ సెంటర్ (సి–డాక్)లో హోస్ట్ అయిన కేంద్రీకృత డిజైన్ సదుపాయంలో, పూర్తి చిప్ డిజైన్ సైకిల్ 7 నానో మీటర్ మీటర్ అడ్వాన్స్‌డ్ నోడ్ (అంటే డిజిటల్, అనలాగ్, ఆర్ఎఫ్ కోసం ఫ్రంట్-ఎండ్ డిజైన్, బ్యాక్-ఎండ్ డిజైన్, పీసీబీ డిజైన్ & మిక్స్‌డ్ సిగ్నల్ డిజైన్‌ల విశ్లేషణ మొదలైనవి) కోసం అత్యంత అధునాతన సాధనాలు మాత్రమే కాక, పరిశ్రమ నిపుణులతో డిజైన్ ఫ్లోస్ బోధకుల నేతృత్వంలోని/ఆన్‌లైన్ శిక్షణలను వచ్చే 5 సంవత్సరాలకు అందుబాటులో ఉంచడం కూడా.
ఇండియా చిప్ సెంటర్ (సి–డాక్)లో ఈ కేంద్రీకృత సదుపాయం ప్రస్తుతం ఉన్న సౌకర్యాలలో అతిపెద్దది. ఇది డిజైన్ ఫ్లోస్ సమృద్ధిని అందిస్తోంది. చిప్ డిజైన్ మౌలిక సదుపాయాలను 120 విద్యా సంస్థలలో 85,000 మంది విద్యార్థుల ఇంటి వద్దకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రయోజనాన్ని పొందడం ద్వారా అనేక అకడమిక్ స్టార్ట్-అప్‌లు దేశవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి. ప్రారంభ ప్రవేశ అడ్డంకులను దాటుతాయి. దేశీయ ఐపీ కోర్లు, చిప్స్, సిస్టమ్ ఆన్ చిప్ (ఎస్ఓసీలు) తయారీకి దేశంలో వ్యవస్థాపకత/స్టార్టప్ల -నేతృత్వంలోని డిజైన్ & ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థకు మార్గం సుగమం చేస్తాయి. పంచంలోనేగాక భారతదేశం కోసం 5జీ/ ఐఓటీ, ఏఐ/ఎంఎల్, ఆటోమోటివ్ & మొబిలిటీ సెక్టార్ మొదలైన విభిన్న అప్లికేషన్ ప్రాంతాల కోసం సిస్టమ్‌లను తయారు చేస్తాయి.
సెమికాన్ఇండియా 2022 గత వారం విజయవంతంగా ముగిసింది. చాలా మంది గ్లోబల్ సెమీకండక్టర్ లీడర్‌లు (ఇంటెల్, మైక్రోన్, క్వాల్‌కామ్, ల్యామ్ రీసెర్చ్ మొదలైనవి) తమకు భారతీయ ఆర్&డీ కేంద్రాల సహకారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాయి. ఇప్పుడు తమ ప్రధాన కార్యాలయాల్లో అతిపెద్ద కేంద్రాలుగా నిలిచాయని వెల్లడించాయి. ఇప్పుడు ప్రపంచంలోని ఇంజనీర్లలో 20% మన దేశంలోనే ఉన్నారని, సెమీకండక్టర్ డిజైన్ బలాన్ని గుర్తించామని తెలిపాయి. కేంద్ర
ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ చిప్స్ టు స్టార్టప్ (సీ2ఎస్) ప్రోగ్రామ్ సెమీకండక్టర్ పాలసీలోని ఇతర కార్యక్రమాల ద్వారా భారతదేశాన్ని సెమీకండక్టర్ హబ్‌గా మార్చడానికి అత్యంత నైపుణ్యం కలిగిన ఇంజనీర్ల డిజైన్ టాలెంట్ పూల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. దీనివల్ల దేశంలోని ట్యాలెంట్ ఎక్స్పర్టులు బలోపేతం అవుతారు. వీళ్లు సెమీకండక్టర్ దిగ్గజాల కోసం ప్రముఖ చిప్‌ల రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తారు. సెమికాన్ఇండియా 2022 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశ ప్రజాస్వామ్యం టాలెంట్ పూల్ చిప్ సార్వభౌమాధికారం కోసం పోరాడుతున్నదని, ఇతర దేశాలతో పోలిస్తే ఇది ప్రత్యేకమైనదని అన్నారు. భారతదేశ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను ఉత్ప్రేరకపరిచే లక్ష్యంతో డిజిటల్ ఇండియా ఆర్ఐఎస్సీవీ (డీఐఆర్వీ) ప్రోగ్రామ్‌తో సహా సెమికాన్ఇండియా 2022లో అనేక సహ–-అభివృద్ధి ఒప్పందాలను రాజీవ్ చంద్రశేఖర్ గత వారం ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో భారతదేశం ఈ వారంలో యునికార్న్‌ల సెంచరీని నమోదు చేసింది. దేశవ్యాప్తంగా చిప్ డిజైన్‌ను ప్రజాస్వామ్యీకరించడానికి తీసుకున్న చర్యలు, దేశంలో సెమీకండక్టర్ డిజైన్ స్పేస్ నుండి స్టార్టప్‌లు, యునికార్న్‌లు పెరిగేలా చేస్తాయి.
***
(Release ID: 1822917)