ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

అంతరాష్ట్ర ట్రక్ టెర్మినస్ ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి

Posted On: 03 MAY 2022 9:17AM by PIB Hyderabad

సెక్మాయి వద్ద కొత్తగా నిర్మించిన అంతరాష్ట్ర ట్రక్ టెర్మినస్ ను కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఖుమాన్ లంపాక్‌లోని నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీ కాంప్లెక్స్ నుంచి వర్చువల్ విధానంలో శ్రీ కిషన్ రెడ్డి అంతరాష్ట్ర ట్రక్ టెర్మినస్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ బీరేన్ సింగ్, రాష్ట్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ కే.గోవింద్ సింగ్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈశాన్య ప్రాంత క్రీడా వారోత్సవాల్లో భాగంగా అంతరాష్ట్ర ట్రక్ టెర్మినస్   ప్రారంభ కార్యక్రమం ఏర్పాటు అయ్యింది.

క్రీడా వారోత్సవాలు సందర్భంగా ఇంఫాల్‌లోని ఖుమాన్ లంపాక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని మెయిన్ స్టేడియంలో ఆతిథ్య జట్టు మణిపూర్ మరియు త్రిపుర మధ్య జరిగిన  ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌కు కేంద్ర మంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా హాజరయ్యారు.

 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మణిపూర్ లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ బీరేన్ సింగ్ నాయకత్వంలో మణిపూర్ మరింత అభివృద్ధి చెందుతుందన్న ధీమాను శ్రీ కిషన్ రెడ్డి వ్యక్తం చేశారు. 

క్రీడా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం, ఈశాన్య ప్రాంత మండలి, నిర్వాహకులను శ్రీ కిషన్ రెడ్డి అభినందించారు. క్రీడల పోటీలు ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాయని మంత్రి అన్నారు. జనాభాలో యువత ఎక్కువగా ఉన్నారని పేర్కొన్న మంత్రి పతకాలు సాధించేందుకు వీరు కృషి చేయాలని అన్నారు. 

  క్రీడల్లో పిల్లలు పాల్గొనే విధంగా తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రోత్సహించాలని శ్రీ కిషన్ రెడ్డి సూచించారు.     క్రీడలు, ఆటలు పిల్లల్లో క్రమశిక్షణ  ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. దీనిని గుర్తించి  ఏదైనా క్రీడ ఆడనివ్వాలని ఆయన కోరారు.

బాక్సింగ్‌, బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, విలువిద్య తదితర వివిధ క్రీడా విభాగాల్లో ఈశాన్య   ప్రాంతంలో ఉన్న  ఎనిమిది రాష్ట్రాలు పతకాలు సాధించాయని  కేంద్ర మంత్రి అన్నారు. క్రీడా ప్రపంచంలో ఈ ప్రాంత యువత అపారమైన ప్రతిభ కనబరిచి  దేశానికి ఎన్నో అవార్డులు సాధించారని మంత్రి అన్నారు.  

మణిపూర్ నేడు దేశానికి  ఆదర్శంగా నిలుస్తోందని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. మణిపూర్ ఇప్పటి వరకు అనేక మంది ఒలింపియన్ లు, పతక విజేతలను తయారు చేసిందని అన్నారు.

ప్రస్తుతం దేశం అన్ని ప్రాంతాలలో ఆడుతున్న  సాగోల్ కాంగ్జెయ్ అని పిలవబడే పోలో ఆట మణిపూర్‌లో పుట్టిందని శ్రీ కిషన్ రెడ్డి వివరించారు.   సాగోల్ కాంగ్జెయ్ క్రీడ పుట్టినిల్లు మణిపూర్ అని ప్రతి ఒక్కరికి తెలుసునని అన్నారు. 

మణిపూర్ దేశ క్రీడా కేంద్రంగా గుర్తింపు పొంది  అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా రాణిస్తుందని ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ విశ్వసిస్తున్నారని కేంద్ర మంత్రి అన్నారు.

క్రీడా రంగంలో మణిపూర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రధానమంత్రి జాతీయ క్రీడల విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ నెలకొల్పాలని నిర్ణయించారని శ్రీ కిషన్ రెడ్డి వివరించారు. దేశంలో తొలిసారిగా ఏర్పాటు కానున్న క్రీడా విశ్వవిద్యాలయాన్ని లక్ష్యం మేరకు రెండు సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేస్తామని శ్రీ కిషన్ రెడ్డి వెల్లడించారు. 

అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటయ్యే క్రీడల విశ్వవిద్యాలయం దేశానికి ఒలింపిక్ పతకాలను సాధించే విధంగా క్రీడాకారులను తీర్చిదిద్దుతుందని  శ్రీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం ద్వారా దేశానికి మణిపూర్ రాష్ట్రానికి గుర్తింపు వస్తుందని అన్నారు. క్రీడా రంగానికి మణిపూర్ సందేశం విశ్వవిద్యాలయం ద్వారా వినిపిస్తుందని మంత్రి అన్నారు. విశ్వవిద్యాలయ నిర్మాణం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని శ్రీ కిషన్ రెడ్డి కోరారు. 

ఈశాన్య  ప్రాంతం  సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రధానమంత్రి   అంకితభావంతో పని చేస్తున్నారని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు.  

సమావేశానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరేన్ సింగ్ రాష్ట్రాన్ని క్రీడల కేంద్రంగా అభివృద్ధి చేయాలని  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించారని తెలిపారు. దీనిలో భాగంగా  మణిపూర్‌కు జాతీయ క్రీడల విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసారని అన్నారు. విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం వల్ల లభిస్తున్న ఫలాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.విశ్వవిద్యాలయంలో దేశవ్యాప్తంగా 250 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని ఆయన తెలిపారు.

విశ్వవిద్యాలయ నిర్మాణ అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి నిర్మాణం పూర్తి చేసేందుకు 30 నెలల సమయం కావాలని నిర్మాణ సంస్థ కోరిందని అన్నారు. అయితే, ఇది ఎక్కువని గుర్తించిన తమ ప్రభుత్వం నిర్మాణాన్ని 2024 సాధారణ ఎన్నికలకు ముందు పూర్తి చేయాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి వివరించారు. 

 ఇంతకు ముందు తాము నిర్లక్ష్యానికి గురయ్యామని ఈశాన్య ప్రాంత ప్రజలు భావించే వారు.అయితే 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత శ్రీ నరేంద్ర మోదీ ఈ ప్రాంతానికి రహదారి  కనెక్టివిటీ మరియు రైలు సౌకర్యాలతో పాటు అనేక అభివృద్ధి ప్రాజెక్టులు అందించారు.  

భవిష్యత్తులో కూడా ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించి ఐక్య భారతావనిని నిర్మించడంలో మణిపూర్ తన వంతు పాత్రను పోషిస్తుందని మణిపూర్ ముఖ్యమంత్రి తెలిపారు. దీనివల్ల ఈశాన్య ప్రాంతాలతో పాటు దేశ సమైక్యత సాధ్యమవుతుందని  ముఖ్యమంత్రి అన్నారు. 

రాష్ట్ర  మంత్రులు శ్రీ కె. గోవిందాస్‌ సింగ్‌, శ్రీ లెత్‌పావో హౌకిప్‌, హేఖమ్‌ డింగో సింగ్‌, శ్రీ కాశీం వషుమ్‌, శ్రీ ఎల్‌. సుసింద్రో, శాసనసభ్యులు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రాజేష్‌ కుమార్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కార్యక్రమంలో భాగంగా  ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రి మరియు ఇతర అధికారులు జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం  విద్యార్థులతో సంభాషించారు.   తాత్కాలిక క్యాంపస్‌లో కల్పించిన  సౌకర్యాలను పరిశీలించారు.

2021-22లో అంతరాష్ట్ర ట్రక్ టెర్మినస్ నిర్మాణం పూర్తయింది. ఇది రాష్ట్రంలో మొదటి మరియు ఏకైక ట్రక్ టెర్మినస్ గా గుర్తింపు పొందింది.   18.34 ఎకరాల  విస్తీర్ణంలో ఖుర్ఖుల్ అవాంగ్ సెక్మై రోడ్‌లో జాతీయ రహదారి-02 కి రెండున్నర కిలోమీటర్ల  దూరంలో ఉంది.   రాష్ట్రాన్ని వచ్చే  ట్రక్కులు మరియు రవాణా వాహనాలు, రాష్ట్రం నుంచి వెళ్లే ట్రక్కులు మరియు రవాణా వాహనాలు  కోసం అధికారిక రవాణా కేంద్రంగా  ఎన్ఈసీ నిధులతో అంతరాష్ట్ర ట్రక్ టెర్మినస్ ను నిర్మించారు. 

***



(Release ID: 1822445) Visitor Counter : 122


Read this release in: English , Urdu , Hindi , Manipuri