ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఏప్రిల్ 2022లో జీఎస్టీ రెవిన్యూ వసూళ్లు ఎన్నడూ లేనంతగా రూ. 1.68 లక్షల కోట్లకు చేరిక
ఏప్రిల్ 2022లో స్థూల జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ హై, తదుపరి అత్యధిక కలెక్షన్ 1,42,095 కోట్లు కన్నా రూ. 25,000 కోట్లు ఎక్కువ.
Posted On:
01 MAY 2022 12:31PM by PIB Hyderabad
ఏప్రిల్, 2022 నెలలో సేకరించిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ. 1,67,540 కోట్లు. అందులో సిజీఎస్టీ రూ. 33,159 కోట్లు, ఎస్జీఎస్టీ, రూ. 41,793 కోట్లు ఐజీఎస్టీ రూ.81,939 కోట్లు.
ప్రభుత్వం ఐజీఎస్టీ నుండి రూ. 33,423 కోట్లను సిజీఎస్టీకి, రూ. 26962 కోట్లను ఎస్జీఎస్టీకి సెటిల్ చేసింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత ఏప్రిల్ 2022 నెలలో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సి జీఎస్టీ కి రూ. 66,582 కోట్లు, ఎస్జీఎస్టీకి రూ. 68,755 కోట్లు. ఏప్రిల్ 2022 నెలలో వచ్చే ఆదాయం జీఎస్టీ రాబడి కంటే 20% ఎక్కువ. ఈ నెలలో, వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 30% ఎక్కువగా ఉన్నాయి, దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) ద్వారా వచ్చే ఆదాయాలు గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయాల కంటే 17% ఎక్కువగా ఉన్నాయి.
ఏప్రిల్ 2022 నెలలో 20 ఏప్రిల్ 2022న ఒకే రోజులో అత్యధిక పన్ను వసూళ్లు నమోదయ్యాయి ఆ రోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఒక గంట సమయంలో అత్యధిక వసూళ్లు జరిగాయి. 20 ఏప్రిల్ 2022న 9.58 లక్షల లావాదేవీల ద్వారా రూ. 57,847 కోట్లు చెల్లింపులు జరిగాయి. సాయంత్రం 4-5 గంటల సమయంలో 88,000 లావాదేవీల ద్వారా దాదాపు రూ. 8,000 కోట్లు చెల్లింపులు నమోదయ్యాయి. గత సంవత్సరం (అదే తేదీన) అత్యధికంగా 7.22 లక్షల లావాదేవీల ద్వారా రూ. 48,000 కోట్లు, అత్యధికంగా ఒక గంట వసూళ్లు (గత సంవత్సరం ఇదే తేదీన మధ్యాహ్నం 2-3) 65,000 లావాదేవీల ద్వారా రూ. 6,400 కోట్లు వసూలయింది.
ఏప్రిల్ 2022లో రాష్ట్రాల వారీగా జీఎస్టీ రాబడి వృద్ధి
రాష్ట్రం
|
ఏప్రిల్ -21
|
ఏప్రిల్ -22
|
వృద్ధి
|
జమ్మూ కాశ్మీర్
|
509
|
560
|
10%
|
హిమాచల్ ప్రదేశ్
|
764
|
817
|
7%
|
పంజాబ్
|
1,924
|
1,994
|
4%
|
చండీగఢ్
|
203
|
249
|
22%
|
ఉత్తరాఖండ్
|
1,422
|
1,887
|
33%
|
హర్యానా
|
6,658
|
8,197
|
23%
|
ఢిల్లీ
|
5,053
|
5,871
|
16%
|
రాజస్థాన్
|
3,820
|
4,547
|
19%
|
ఉత్తరప్రదేశ్
|
7,355
|
8,534
|
16%
|
బీహార్
|
1,508
|
1,471
|
-2%
|
సిక్కిం
|
258
|
264
|
2%
|
అరుణాచల్ ప్రదేశ్
|
103
|
196
|
90%
|
నాగాలాండ్
|
52
|
68
|
32%
|
మణిపూర్
|
103
|
69
|
-33%
|
మిజోరాం
|
57
|
46
|
-19%
|
త్రిపుర
|
110
|
107
|
-3%
|
మేఘాలయ
|
206
|
227
|
10%
|
అస్సోం
|
1,151
|
1,313
|
14%
|
పశ్చిమ బెంగాల్
|
5,236
|
5,644
|
8%
|
ఝార్ఖండ్
|
2,956
|
3,100
|
5%
|
ఒడిశా
|
3,849
|
4,910
|
28%
|
ఛత్తీస్గఢ్
|
2,673
|
2,977
|
11%
|
మధ్యప్రదేశ్
|
3,050
|
3,339
|
9%
|
గుజరాత్
|
9,632
|
11,264
|
17%
|
డామన్ డయ్యు
|
1
|
0
|
-78%
|
దాద్రా నగర్ హవేలీ
|
292
|
381
|
30%
|
మహారాష్ట్ర
|
22,013
|
27,495
|
25%
|
కర్ణాటక
|
9,955
|
11,820
|
19%
|
గోవా
|
401
|
470
|
17%
|
లక్షద్వీప్
|
4
|
3
|
-18%
|
కేరళ
|
2,466
|
2,689
|
9%
|
తమిళనాడు
|
8,849
|
9,724
|
10%
|
పుదుచ్చేరి
|
169
|
206
|
21%
|
అండమాన్ నికోబర్ దీవులు
|
61
|
87
|
44%
|
తెలంగాణ
|
4,262
|
4,955
|
16%
|
ఆంధ్ర ప్రదేశ్
|
3,345
|
4,067
|
22%
|
లడఖ్
|
31
|
47
|
53%
|
ఇతర ప్రాంతాలు
|
159
|
216
|
36%
|
కేంద్ర పరిధి
|
|
(Release ID: 1822250)
|