పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఫారెస్ట్ ల్యాండ్‌స్కేప్ పునరుద్ధరణ ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసిన భారత దేశం, జర్మనీ
- అటవీ ప్రకృతి దృశ్యం పునరుద్ధరణ, పర్యావరణం, వాతావరణ మార్పుల రంగాలలో ఒకరితో ఒకరు విజయవంతంగా భాగస్వాములు కావడానికి, ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడానికి ఈ ఉమ్మడి ప్రకటన దోహదం చేస్తుంది.: శ్రీ భూపేందర్ యాదవ్
Posted On:
02 MAY 2022 8:11PM by PIB Hyderabad
భారత దేశం, జర్మనీ మధ్య ఫారెస్ట్ ల్యాండ్‌స్కేప్ పునరుద్ధరణ విషయమై జాయింట్ డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్ (జేడీఐ) జరిగింది. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ మరియు జర్మనీ దేశ పర్యావరణ మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీమతి స్టెఫీ లెమ్కే లు ఈ ఒప్పందంపై సంతకం చేశారు. వర్చువల్ విధానంలో ఈ సంతకాల కార్యక్రమం జరిగింది. జర్మనీ యొక్క అణు భద్రత మరియు వినియోగదారుల రక్షణ దిశగా ఈ ఒప్పందం జరిగింది. ఇది 6వ భారత-జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ) ఫలప్రదాలలో ఈ చొరవ ఒకటి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, పరిరక్షణ మరియు పునరుద్ధరణ, వాతావరణ పరిరక్షణ మరియు జీవవైవిధ్య పరిరక్షణ వంటి రంగాలలో మా భాగస్వామ్యాన్ని మరియు మద్దతును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ జేడీఐ ఒక వేదికను అందిస్తుందన్నారు. ఇది మా భాగస్వామ్యాన్ని మరో ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. ఫారెస్ట్ ల్యాండ్‌స్కేప్ పునరుద్ధరణపై ఉద్దేశించిన ఈ ఉమ్మడి ప్రకటన మా నాయకుల డైనమిక్ మార్గదర్శకత్వంలో ఇండో-జర్మన్ సహకారాన్ని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుందని శ్రీ యాదవ్ పేర్కొన్నారు. అటవీ భూదృశ్య పునరుద్ధరణ, పర్యావరణం మరియు వాతావరణ మార్పుల రంగాలలో మన ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరింపజేయడానికి మరియు పరస్పరం విజయవంతంగా భాగస్వాములు కావడానికి కూడా జేడీఐ వీలు కల్పిస్తుందని కేంద్ర పర్యావరణ మంత్రి పేర్కొన్నారు. జేడీఐని విజయవంతంగా అమలు చేయాలని ఇరు దేశాలు ఎదురుచూస్తున్నాయని పేర్కొన్నారు.
***
(Release ID: 1822248)
Visitor Counter : 203