పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
మెరుగైన సేవల్ని అందించేలా తిరుచ్చి విమానాశ్రయం ఆదునికీకరణ
- స్థిరమైన లక్షణాలతో శక్తి సామర్థ్య భవనంగా నిలువనున్నవిమానాశ్రయ టెర్మినల్
- ఏప్రిల్ 2023 నాటికి సిద్ధం కానున్న తిరుచ్చి విమానాశ్రయ టెర్మినల్
Posted On:
02 MAY 2022 3:27PM by PIB Hyderabad
భారత విమానాశ్రయ ప్రాధికారిక సంస్థ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-ఏఏఐ) తిరుచ్చి ఎయిర్‌పోర్ట్ విస్తరణ పనులను చేపట్టింది, ఇందులో కొత్తగా సమీకృత ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, కొత్త ఆప్రాన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్ మరియు పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని తీర్చడానికి వీలుగా మరియు విమానాశ్రయంలో ఎక్కువ ప్రయాణికుల తాకిడి ఉన్న వేళలలో
రద్దీ తగ్గించడానికి ఎయిర్ సైడ్ సౌకర్యాలను ఆదునికీకరిచడం వంటి పనులు ఉన్నాయి. రూ.951.28 కోట్లతో నిర్మిస్తున్న ఈ కొత్త టెర్మినల్ భవనం రద్దీ సమయాల్లో 2900 మంది ప్రయాణికుల అవసరాలను తీర్చేలా చేసేలా డిజైన్ చేయబడింది. 48 చెక్-ఇన్ కౌంటర్లు మరియు 10 బోర్డింగ్ బ్రిడ్జిలతో అమర్చబడి, ఈ టెర్మినల్ మేటి స్థిర లక్షణాలతో శక్తి సామర్థ్య భవనంగా నిలువనుంది.
75000 చదరపు మీటర్ల విస్తీర్ణంతో కొత్త టెర్మినల్ భవనం గంభీరమైన పైకప్పుతో డైనమిక్ మరియు నాటకీయ భవన రూపానికి ఐకానిక్ నిర్మాణంగా రూపొందించబడింది. భవనం లోపలి భాగాలు సమకాలీన పద్ధతిలో వివిధ పదార్థాలు మరియు అల్లికల ద్వారా నగరం యొక్క రంగులు మరియు సంస్కృతిని ప్రతిబింబించేలా తీర్చిదిద్దబడుతోంది. కొత్త టెర్మినల్ సహజమైన రూపం దక్షిణ రీజియన్‌కు ఒక ప్రత్యేకమైన నిర్మాణ గుర్తింపును తేనుంది. టెర్మినల్ డిజైన్లకు కొత్త కోణాన్ని జోడించనుంది. ఇక్కడి స్థానిక సంస్కృతి, సాంప్రదాయ వాస్తు శిల్పం గురించి బలమైన సూచనలు భవనం యొక్క నిర్మాణంలో వ్యక్తీకరించబడతాయి. వచ్చే మరియు బయలుదేరే ప్రయాణీకులు ఈ గుర్తింపును ప్రదేశానికి సంబంధించిన సూచనను గ్రహించేలా ఇక్కడ సౌకర్యాల్ని రూపకల్పన చేయనున్నారు. విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్ట్‌లో కొత్త ఆప్రాన్ ఏర్పాటు చేయబడుతోంది. మల్టిపుల్ ఆప్రాన్ ర్యాంప్ సిస్టమ్‌కు అనువుగా ఉండేలా చేయడానికి అనుబంధ టాక్సీవేలు, ఐసోలేషన్ బే కూడా ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవస్థ విమానాశ్రయాన్ని మల్టిపుల్ ఆప్రాన్ ర్యాంప్ సిస్టమ్‌కు అనువుగా ఉండేలా చేస్తుంది, అంటే ఐదు వైడ్-బాడీ (కోడ్ E) లేదా 10 నారో బాడీ ఎయిర్‌క్రాఫ్ట్ (కోడ్ సి) ఆప్రాన్ ర్యాంప్ విధానానికి అనువుగా ఉండేలా చేస్తుంది. అంతే కాకుండా, కంట్రోల్ రూమ్, సపోర్టింగ్ ఎక్విప్‌మెంట్ రూమ్‌లు, టెర్మినల్ రాడార్, రాడార్ సిమ్యులేషన్, ఆటోమేషన్ సౌకర్యాలు, వీహెచ్ఎఫ్, ఏఏఐ కార్యాలయాలు మరియు వాతావరణ శాఖ కార్యాలయాల నిర్మాణం కూడా విస్తరణ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉంది. టెర్మినల్ బిల్డింగ్‌ను నగరానికి కలిపే నాలుగు లేన్ల ఎలివేటెడ్ యాక్సెస్ రోడ్డు కూడా ప్రాజెక్ట్‌లో భాగంగా ఉంది. ఈ టెర్మినల్ బిల్డింగ్‌కు సంబంఇంచి ఇప్పటికే 75% కంటే ఎక్కువ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఏప్రిల్ 2023 నాటికి ప్రాజెక్ట్ సిద్ధం కానుంది. చెన్నై & కోయంబత్తూర్ తర్వాత అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీలో తిరుచ్చి రెండవ అతిపెద్ద విమానాశ్రయం. వైమానిక మౌలిక వసతుల
అభివృద్ధి కారణంగా తమిళనాడులోని తిరుచ్చి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన విమాన కనెక్టివిటీని నిర్ధారిస్తుంది.
ఫొటో రైటప్ః
కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్, కొత్త ఆప్రాన్ & కొత్త సమాంతర టాక్సీవే యొక్క ఏరియల్ వ్యూ
నిర్మాణంలో ఉన్న నిర్మాణాత్మక ఉక్కు పనులు
కొనసాగుతున్న సర్వీస్ యార్డు పనులు
కొనసాగుతున్న ఎంఈపీ పనులు
పురోగతిలో ఉన్న సమాంతర టాక్సీవే పనులు
టెర్మినల్ భవనం యొక్క దృక్కోణ వీక్షణం
***
(Release ID: 1822247)
Visitor Counter : 170