పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
1 మే 2022న ఉజ్వల దివస్ సందర్భంగా 5000 'ఎల్‌పీజీ పంచాయితీలు'
Posted On:
30 APR 2022 10:46AM by PIB Hyderabad
దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుంటుంబాల వారికి ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్లను అందించడం ద్వారా వారిని నవ సామాజిక స్రవంతిలో చేర్చేందుకు గాను 1 మే 2016న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (పీఎంయువై) పథకాన్ని ప్రారంభించారు. పేద వారికి నవ సామాజిక స్రవంతిలో చర్చే దిశగా ఇది ఒక ప్రధాన ముందడుగు. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన పథకం సాధించిన విజయానిక సంకేతంగా ఉత్సవం జరుపుకోవడానికి, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ (ఎంఓపీఎన్‌జీ) మే 1, 2022ని ఉజ్వల దివస్‌గా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు 1 మే 2022వ తేదీన ఉజ్వల దివాస్ పురస్కరించుకొని దాదాపు 5000 కంటే ఎక్కువగా పంచాయితీలను నిర్వహించనున్నాయి. ఎల్‌పీజీ సురక్షితమైన మరియు నిరంతర వినియోగాన్ని లక్ష్యంగా చేసుకుని దేశంలో గ్యాస్ వినియోగదారుల నమోదును పెంచడానికి ప్రయత్నాలు చేయబడతాయి. ఎల్‌పీజీ పంచాయతీలతో పాటు, ఉజ్వల 2.0 కింద కొత్త కనెక్షన్ల పంపిణీ; కొత్త పీఎంయువై కేటగిరీల వివరాలను వివరిస్తూ, కొనసాగుతున్న ఉజ్వల 2.0 పథకం కేవైసీ ఫారాల సేకరణ, ఉచిత హాట్ ప్లేట్ సర్వీస్ క్యాంపులను నిర్వహించడం, సేఫ్టీ క్లినిక్‌ల నిర్వహణ, ఉజ్వల లబ్ధిదారులకు తగిన సౌకర్యాలు కల్పించడం మొదలైన కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. పూరిరికార్డు సమయంలో దేశంలోని పేద లబ్దిదారులకు ఎల్‌పీజీని చేరువచేసేందుకు ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు చేసిన కృషిని పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ ప్రశంసించారు. లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఉజ్వల దివస్ సందర్భంగా, అసోంలోని దిబ్రూఘర్ జరిగే ఉజ్వల దివస్ వేడుక కార్యక్రమానికి పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి అధ్యక్షత వహించనున్నారు . కొత్త ఉజ్వల లబ్ధిదారులకు కనెక్షన్లు అందజేయనున్నారు.
***
(Release ID: 1821627)
Visitor Counter : 245