కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
M2M సర్వీస్ ప్రొవైడర్ మరియు WLAN/WPAN కనెక్టివిటీ ప్రొవైడర్‌గా సేవలను అందించడం కోసం మొదటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేసిన టెలీకమ్యూనికేషన్ల శాఖ విజయవాడ కి చెందిన మెస్సర్స్ క్లౌడ్ 7 టెక్నాలజీస్ లిమిటెడ్ కి సర్టిఫికెట్ అందించిన ఏపీ-ఎల్ఎస్ఏ
Posted On:
28 APR 2022 5:51PM by PIB Hyderabad
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్జాన రంగంలో M2M/ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ను ఒకటిగా భారత ప్రభుత్వం గుర్తించింది. ఇది సమాజం, పరిశ్రమలు మరియు వినియోగదారులకు అపారమైన ప్రయోజనకరమైన అవకాశాలను అందిస్తుంది. కనెక్ట్ చేయబడిన పరికరాలను ఉపయోగించి ఇంధనం , ఆటోమోటివ్, భద్రత,నిఘా , రిమోట్ హెల్త్ మేనేజ్‌మెంట్,వ్యవసాయం, స్మార్ట్ గృహాలు , ఇండస్ట్రీ 4.0, స్మార్ట్ నగరాలు మొదలైన రంగాల్లో మౌలిక సదుపాయాలను రూపొందించడానికి ఇది ఉపయోగించబడుతుంది. డిజిటల్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా అభివృద్ధి చేయడం కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ ప్రధాన పాత్ర పోషించనున్నది.
M2M వ్యవస్థను మరింత పటిష్టం చేసి ఈ రంగం అభివృద్ధి చెందేలా చూసినందుకు వినూత్న కార్యక్రమాలను అమలు చేయాలని టెలీకమ్యూనికేషన్ల శాఖ నిర్ణయించింది. దీనికోసం WPAN/WLAN కనెక్టివిటీ ప్రొవైడర్ల మరియు M2M సర్వీస్ ప్రొవైడర్ల నమోదు కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. ఆన్ లైన్ విధానంలో 5,000 రూపాయల నామమాత్ర రుసుముతో M2M సర్వీస్ ప్రొవైడర్ల కోసం ఆన్-బోర్డింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను ప్రారంభించింది. సౌలభ్య పూరిత విధానంతో ప్రస్తుతం పనిచేస్తున్న టెలీకమ్యూనికేషన్ల శాఖ తన సరళ్ సంచార్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. సిమ్/ లాన్ ఆధారిత M2M సేవలను అందిస్తున్న సంస్థలు M2M సర్వీస్ ప్రొవైడర్లుగా, WPAN/WLAN కనెక్టివిటీ ప్రొవైడర్లు స్పెక్ట్రమ్ లో గా సర్వీస్ ప్రొవైడర్లుగా నమోదు చేసుకోవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ టీఎస్ పీ తో అనుసంధానం,కేవైసీ, M2M సర్వీస్ ప్రొవైడర్ల గుర్తింపు, ఎన్‌క్రిప్షన్ వంటి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తొలి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను జారీ చేసినట్టు టెలీకమ్యూనికేషన్ల శాఖ ప్రకటించింది. విజయవాడకు చెందిన మెస్సర్స్ క్లౌడ్ 7 టెక్నాలజీస్ లిమిటెడ్ కి WLAN/WPAN కనెక్టివిటీ ప్రొవైడర్ సర్టిఫికెట్ ను ఏపీ-ఎల్ఎస్ఏ ద్వారా అందించడం జరిగింది. దేశంలో లైసెన్స్ లేని బ్యాండ్‌లలో వైర్‌లెస్/ ఆర్ఎఫ్ నెట్‌వర్క్‌ల ప్రణాళిక, సంస్థాపన మరియు నిర్వహణ రంగంలో మెస్సర్స్ క్లౌడ్ 7 టెక్నాలజీస్ లిమిటెడ్ సేవలు అందిస్తుంది.
అన్ని రంగాలను డిజిటలైజ్ చేయడానికి మరియు స్వయంచాలకంగా మార్చడానికి రూపొందించిన కార్యక్రమాలు వేగంగా అమలు జరుగుతున్నాయి.నూతన తయారీ విధానాలు, పరిశ్రమ 4.0 అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా IoT మరియు M2M సేవల వినియోగంలో గణనీయంగా పెరుగుతుందని టెలీకమ్యూనికేషన్ల శాఖ అంచనా వేసింది. దీనివల్ల మారుమూల ప్రాంతాలలో కూడా పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ప్రజలకు అవసరమైన వినూత్న విధానాలు మరియు పరిష్కారాలు అభివృద్ధి చేసేందుకు వ్యవస్థాపకులు మరియు అంకుర సంస్థలకు అనేక అవకాశాలను అందిస్తుంది. ఇంధనం , ఆటోమోటివ్, భద్రత,నిఘా , రిమోట్ హెల్త్ మేనేజ్‌మెంట్,వ్యవసాయం, స్మార్ట్ గృహాలు , ఇండస్ట్రీ 4.0, స్మార్ట్ నగరాలు మొదలైన రంగాల్లో పౌర కేంద్రీకృత సేవలు అందించేందుకు సహాయ పడుతుంది. ఐఓటీ ఆధారిత సేవల్లో జరుగుతున్న అభివృద్ధి దేశంలో డిజిటల్ పర్యావరణ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తుంది.
***
(Release ID: 1821067)
Visitor Counter : 176