రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఇండియా ఫార్మా, ఇండియా మెడికల్ డివైసెస్ అవార్డ్స్ 2022 ప్రదానం చేస్తున్న కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా
"మనమందరం కలిసి పని చేస్తే గౌరవనీయులైన ప్రధాన మంత్రి ఊహించిన విధంగా మనం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారతాము": శ్రీ భగవంత్ ఖూబా
"ఫార్మా, వైద్య పరికరాల రంగానికి భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా మార్చడానికి మనం కట్టుబడి ఉన్నాము": శ్రీ. అమితాబ్ కాంత్, నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి
"భారత వైద్య పరికరాల రంగం అపారమైన వృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉంది సూర్యోదయ రంగంగా సరిగ్గా గుర్తింపు పొందింది": శ్రీమతి. ఎస్. అపర్ణ
Posted On:
27 APR 2022 5:15PM by PIB Hyderabad
"భారతీయ వైద్య పరికరాల రంగం భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది, నూతన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి ద్వారా భారతదేశంలో అత్యాధునిక సాంకేతిక పరికరాలు, యంత్రాలను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టాలి" అని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖూబా ఈ సందర్భంగా చెప్పారు. శ్రీమతి ఎస్ అపర్ణ, సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ సమక్షంలో ఫార్మా అండ్ మెడికల్ డివైసెస్ సెక్టార్ 2022పై అంతర్జాతీయ సదస్సు 7వ ఎడిషన్ సందర్భంగా ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శితో పాటు కేంద్ర సహాయ మంత్రి ఇండియా ఫార్మా అండ్ ఇండియా మెడికల్ డివైసెస్ అవార్డులు 2022ని కూడా ప్రదానం చేశారు.
ఇన్నోవేషన్, ఇంటిగ్రేటెడ్ సేవల ద్వారా ఆరోగ్య పరిరక్షణ మార్చడం, విలువ ఆధారిత సేకరణ ప్రోత్సహించడం, వాటి డిమాండ్ అనుగుణ తయారీ, ప్రపంచ వైద్యోపకరణాల సప్లయ్ చైన్, పరిశోధన అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించడం కోసం ఈరోజు నాలుగు సెషన్‌లు వేర్వేరు ఇతివృత్తాలపై నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖూబా ప్రసంగిస్తూ, గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో మనం అన్ని రంగాలలో పురోగమిస్తున్నామని, అందరికీ సత్వర అభివృద్ధిని అందించడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైజెస్ రంగం ప్రపంచ, భారతీయ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన రంగం. మనమందరం కలిసి పనిచేయగలిగితే, గౌరవ ప్రధానమంత్రి ఊహించిన విధంగా మనం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారతామని ఆయన అన్నారు.
భారతీయ ఫార్మా, వైద్య పరికరాల రంగం భారీ వృద్ధికి అవకాశం ఉందని కేంద్ర సహాయ మంత్రి అన్నారు. మనం దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడమే కాకుండా ప్రపంచానికి తయారు చేయగలము. ''తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారత్‌కు ఉంది. మనం ప్రస్తుతం భారతదేశంలో ఈ పరికరాల్లో 20 శాతం మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాము, దిగుమతిపై ఆధారపడి ఉన్నాము. ఈ రంగంలో దేశం ఆత్మనిర్భర్‌గా మారేలా పరిశ్రమకు అన్ని సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత ఎనిమిదేళ్లలో, ఈ రంగంలో వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. భారతదేశం తన పరిశోధన, అభివృద్ధి మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడం ద్వారా మాత్రమే ఔషధాలు, వైద్య పరికరాలలో స్వావలంబనను సాధించగలదు, ఇది ప్రాణాలను రక్షించే ఔషధాల విస్తరణకు దారి తీస్తుంది, భారతదేశాన్ని గ్లోబల్ ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల ఎగుమతి కేంద్రంగా నిలుపుతుంది.
సదస్సులో ప్రసంగించిన నీతి ఆయోగ్ సీఈవో శ్రీ అమితాబ్ కాంత్. 2016 నుంచి భారతీయ ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోందని, ఈ ఏడాది 380 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు. భారతదేశంలో వైద్య పరికరాలను ఉత్పత్తి చేయడానికి విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ, శ్రీ. అమితాబ్ కాంత్ ఇలా అన్నారు, “మీరు ఇక్కడ వైద్య పరికరాలను అభివృద్ధి చేసి, తయారు చేస్తే, మీరు భారతదేశం కోసం మాత్రమే కాకుండా ప్రపంచం కోసం ఉత్పత్తి చేస్తున్నారు, మార్కెట్ పరిమాణం, స్థాయిలో భారీగా ఉంది. ఔషధ, వైద్య విభాగాలతో పాటు హెల్త్ కేర్ భారతదేశం, అతిపెద్ద ఉద్యోగ సృష్టికర్తలు. భారతదేశం, సాపేక్ష వ్యయ పోటీతత్వం, నైపుణ్యం కలిగిన కార్మికుల లభ్యత రాబోయే సంవత్సరాల్లో వైద్య విలువ పర్యాటక రంగానికి కూడా అనుకూలమైన గమ్యస్థానంగా మారుస్తుంది.
కార్యక్రమంలో ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి శ్రీమతి ఎస్. అపర్ణ మాట్లాడుతూ వైద్య పరికరాల రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం, సూర్యోదయ రంగంగా సరైన గుర్తింపు పొందింది అన్నారు. మనం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ద్వారా, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని 4 వైద్య పరికరాల పార్కులు సహా అనేక కార్యక్రమాల ద్వారా ఈ రంగానికి మద్దతును అందించగలిగారు. మెడికల్ డివైజ్ పాలసీ ఆమోదం, చివరి దశలో ఉంది, ఇందులో వివిధ వాటాదారుల నుండి ఇన్‌పుట్‌లు ఉన్నాయని కూడా ఆమె తెలియజేసింది. పరిశ్రమలోని అవార్డు గ్రహీతలందరినీ ఆమె అభినందించారు, ఫార్మా, మెడికల్ డివైజ్‌ల రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను సాకారం చేయడానికి కృషి చేయాలని వారిని కోరారు.
ఈ సంవత్సరం, ఫార్మాస్యూటికల్స్ డిపార్ట్‌మెంట్ ఇండియా ఫార్మా, ఇండియా మెడికల్ డివైసెస్ అవార్డ్స్ లో ఆరు ప్రధాన విభాగాలు ప్రకటించింది: -లీడర్స్ కేటగిరీ, కంపెనీ ఆఫ్ ది ఇయర్, MSME ఆఫ్ ది ఇయర్, స్టార్టప్ ఆఫ్ ది ఇయర్, ఇన్నోవేషన్ కేటగిరీ, CSR కేటగిరి. "దేశంలో తయారు అయిన ఫార్మా, వైద్య పరికరాల పనితీరు, నాణ్యతను మెరుగు పరచడానికి ఈ అవార్డు ఉత్ప్రేరకంగా పని చేస్తుంది" అని కేంద్ర సహాయ మంత్రి విజేతలకు అభినందనలు, అవార్డు అందజేస్తూ చెప్పారు.
ఇండియా ఫార్మా & ఇండియా మెడికల్ డివైస్ 2022 అవార్డుల విజేతల వివరాలు : -
ఇండియా ఫార్మా, ఇండియా మెడికల్ డివైజ్- 2022 అవార్డులు
|
వరుస
|
వర్గం
|
అవార్డు
|
అవార్డు గ్రహీత
|
ర్యాంకు
|
1
|
లీడర్స్ కేటగిరీ అవార్డులు
|
ఇండియా ఫార్మా లీడర్ ఆఫ్ ది ఇయర్
|
సిప్లా లిమిటెడ్
|
విజేత
|
ఇండియా మెడికల్ డివైసెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్
|
పాలీ మెడిక్యూర్ లిమిటెడ్
|
విజేత
|
హెల్తియం మెడ్‌టెక్ లిమిటెడ్
|
ద్వితియ విజేత
|
ట్రాన్సాసియా బయో-మెడికల్స్ లిమిటెడ్
|
తృతీయ /2వ రన్నరప్
|
2
|
ఇయర్ అవార్డ్ కంపెనీ
|
ఇండియా ఫార్మా (ఫార్ములేషన్) కంపెనీ ఆఫ్ ది ఇయర్
|
మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్
|
విజేత
|
ఈ సంవత్సరపు ఉత్తమ భారత వైద్య పరికరాల కంపెనీ
|
ట్రివిట్రాన్ హెల్త్ కేర్
|
విజేత
|
నైస్ నియోటెక్ మెడికల్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్
|
ద్వితియ విజేత
|
కనమ్ లాటెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్
|
తృతీయ /2వ రన్నరప్
|
3
|
MSME కేటగిరీ అవార్డులు
|
భారతదేశ ఉత్తమ వైద్య పరికరాల MSME
|
నైస్ నియోటెక్ మెడికల్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్
|
విజేత
|
ప్రీమియమ్ హెల్త్ కేర్ డిస్పోజబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్
|
ద్వితియ విజేత
|
AVI హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్
|
తృతీయ /2వ రన్నరప్
|
4
|
స్టార్ట్-అప్ కేటగిరీ
|
ఇండియా మెడికల్ డివైజ్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్
|
వాన్‌గార్డ్ డయాగ్నోస్టిక్స్ (P) లిమిటెడ్
|
విజేత
|
5
|
ఇన్నోవేషన్ కేటగిరీ
|
భారతదేశ ఫార్మా ఇన్నోవేషన్ ఆఫ్ ది ఇయర్
|
గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్
|
విజేత
|
ఈ సంవత్సరంలో భారత వైద్య పరికర ఆవిష్కరణ లో వినూత్నమైనది
|
మెరిల్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్
|
విజేత
|
6
|
CSR వర్గం
వర్గం
లీడర్స్ కేటగిరీ అవార్డులు
|
ఇండియా ఫార్మా CSR కంపెనీ ఆఫ్ ది ఇయర్
అవార్డు
ఇండియా ఫార్మా లీడర్ ఆఫ్ ది ఇయర్
|
జైడస్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్
|
విజేత
|
గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్
|
ద్వితియ విజేత
|
లుపిన్ లిమిటెడ్
|
తృతీయ /2వ రన్నరప్
|
****
(Release ID: 1820982)
Visitor Counter : 188