వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

జాతీయ అంకుర పరిశ్రమల అవార్డు గ్రహీతలు వ్యక్తిగతంగా ఒక్కొక్క జిల్లాను దత్తత తీసుకుని వాటి సమగ్ర అభివృద్ధికి సహకరించాలని కోరిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రమోషన్ శాఖ DPIIT కార్యదర్శి,


భారతదేశంలో అంకుర పరిశ్రమల విజయానికి వ్యవస్థాగత మద్దతు కీలకం అని ప్రస్తావించి, తమ వృద్ధి ప్రయాణంలో తరువాతి తరం అంకుర పరిశ్రమలు అభివృద్ధి చేయాలని మార్గదర్శకుల్ని కోరుతున్న శ్రీ అనురాగ్ జైన్

Posted On: 25 APR 2022 8:34PM by PIB Hyderabad

డిపిఐఐటి సంస్థ  కార్యదర్శి శ్రీ అనురాగ్ జైన్ జాతీయ అంకుర పరిశ్రమల  అవార్డు గ్రహీతలను వ్యక్తిగతంగా ఒక్కో జిల్లాను దత్తత తీసుకుని దాని సమగ్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. అందుబాటులో ఉన్న  మద్దతు అవకాశాలతో   జాతీయ అంకుర పరిశ్రమల అవార్డ్ 2021 ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ జైన్ కీలకోపన్యాసం చేస్తూ, భాగస్వాములు, విజేతలు, అవార్డుల తుది పోటీదారులు  దేశాభివృద్ధి మూలాలకు అనుసంధానమవ్వాలని,  సమాజానికి, దేశానికి తిరిగి సహకరించాలని కోరారు. భారతదేశంలో అంకుర పరిశ్రమల విజయానికి సమగ్ర మద్దతు వ్యవస్థ కీలకమని పేర్కొంటూ, తమ వృద్ధి ప్రయాణంలో భావితరం  స్టార్టప్‌లను నిర్వహించాలని   ఆయన మార్గదర్శకులను కోరారు.

జాతీయ అంకుర పరిశ్రమల అవార్డ్స్ 2021 ఫలితాలు వాణిజ్యం, పరిశ్రమలు, జౌళి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం , ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ 15 జనవరి 2022న ప్రత్యక్షంగా ప్రసారమాధ్యమం లో  విడుదల చేశారు.

53 ఇంక్యుబేటర్లు, 6 యాక్సిలరేటర్ ల్ కేటగిరీల నుంచి దరఖాస్తు లతో పాటు 49 సబ్ సెక్టార్‌లలో స్టార్టప్‌ల నుంచి మొత్తం 2177 దరఖాస్తులు వచ్చాయి. ఒక ఇంక్యుబేటర్ మరియు ఒక యాక్సిలరేటర్‌తో పాటు అనేక విభాగాలు.   ప్రత్యేక విభాగాల్లో మొత్తం 46 స్టార్టప్‌లు జాతీయ అంకుర పరిశ్రమల అవార్డ్స్ 2021 విజేతలుగా గుర్తింపు పొందాయి.

గత ప్రయత్నాలను ప్రతిబింబిస్తూ, ఈ సంవత్సరం జాతీయ అంకుర పరిశ్రమల అవార్డ్స్  రెండవ ఎడిషన్ కోసం, పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రచార శాఖ మరింత సమగ్రమైన 7 మార్గదర్శకాలు ఒకచోట చేర్చింది.

ఆ 7 మూల స్తంభాలు:

   1. ఇన్వెస్టర్ అనుసంధానం : మూలస్థంభం నిధులు, పెట్టుబడిదారుల అనుసంధానాలను సులభతరం చేయడంపై దృష్టి పెడుతుంది.

    2.మెంటర్‌షిప్/గురుతర మార్గాదర్శకత్వం : ఈ వ్యవస్థ కింద, స్టార్టప్‌ల కోసం క్యూరేటెడ్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తారు. పిల్లర్‌లో వన్-టు-వన్ మెంటార్‌షిప్ సెషన్‌లు, మాస్టర్‌క్లాస్‌లు , క్లాస్‌రూమ్ సెషన్‌లు ఉంటాయి.

   3. ప్రభుత్వ అనుసంధానం : స్టార్టప్‌ల కోసం ప్రభుత్వ సేకరణను మెరుగుపరచడంపై ఈ స్తంభం దృష్టి సారిస్తుంది. "అంకుర పరిశ్రమల ఫర్ పబ్లిక్ సర్వీస్ వర్క్‌ షాప్" కింద వివిధ మంత్రిత్వ శాఖలకు తమ ఆవిష్కరణలను అందించడానికి స్టార్టప్‌లకు అవకాశం కల్పిస్తారు.

   4.దిగ్గజ సంస్థల నిమగ్నత : ఇది ఈ సంవత్సరం కోహార్ట్ కోసం పరిచయం చేసిన కొత్త మూలం . ఈ వ్యవస్థ కింద స్టార్టప్‌లు యునికార్న్స్‌ తో కలిసి పని చేసే అవకాశాన్ని పొందుతాయి. పరివర్తన వర్క్‌ షాప్‌లు, పిచ్-టు-యునికార్న్స్ మరియు వ్యూహాత్మక పొత్తులు వంటి వ్యాయామాలు నిర్వహిస్తారు

   5. సామర్థ్య అభివృద్ధి, దేశ అంకుర పరిశ్రమల ప్రయోజనాలు : ఈ మూలంలో అంకుర పరిశ్రమల ఇండియా లాభాలు  రెగ్యులేటరీ మాస్టర్ క్లాస్‌లపై సెన్సిటైజేషన్ వర్క్‌ షాప్‌లు ఉంటాయి.

    6. మార్కెట్ అందుబాటు: మార్కెట్ యాక్సెస్ మూలం  కింద, స్టార్టప్‌లు తమ స్టార్టప్‌లను స్కేల్ అప్ చేయడానికి విదేశాల్లోని వివిధ పరిశ్రమలు, భారతీయ మిషన్లతో కలిసి పని చేసే అవకాశాన్ని పొందుతాయి.

   7.బ్రాండ్ ప్రచారం : ఈ విధానం స్టార్టప్‌లకు ఆనుపానులు మార్కెటింగ్‌పై వర్క్‌ షాప్‌లను నిర్వహించడం ద్వారా తమ బ్రాండ్‌లను నిర్మించడంలో సహాయపడుతుంది. ఈ స్తంభం బ్లాగ్‌లు మరియు సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా స్టార్టప్‌ల దృశ్యమానతను పెంపొందించడంలో సహాయపడుతుంది   ఫోకస్డ్ ఎపిసోడ్‌లు జాతీయ అంకుర పరిశ్రమల అవార్డ్స్ 2021 విజేతలను 'దూరదర్శన్ అంకుర పరిశ్రమల ఛాంపియన్స్ 2.0'లో పరిధిలోకి తీసుకువస్తాయి (ఒక టీవీ షో దూరదర్శన్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో హిందీ,ఇంగ్లీష్ రెండింటిలో ప్రసారం ఆవుతుంది).

నేటి ఆవిష్కరణ కార్యక్రమంలో అనేక మంది సి - సూట్ పరిశ్రమ, తదనుగుణ పర్యావరణ వ్యవస్థ కోరుకునేవారు, అంకుర పరిశ్రమల యునికార్న్‌ లు, చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు -SIDBI, గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మానిటర్,  GeM, దూరదర్శన్ నుంచి సీనియర్ ప్రభుత్వ అధికారులు, JETRO, లేదా జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్, జపాన్ ప్రపంచంలోని ఇతర దేశాల మధ్య పరస్పర వాణిజ్యం మరియు పెట్టుబడిని ప్రోత్సహించడానికి పనిచేసే ప్రభుత్వ-సంబంధిత సంస్థ, జపాన్ రాయబార కార్యాలయం వంటి అంతర్జాతీయ మిషన్‌లు, జాతీయ అంకుర పరిశ్రమల అవార్డు గ్రహీతలకు మద్దతుగా ప్రత్యేక అవకాశాలను అందించారు.  అదనంగా, జాతీయ అంకుర పరిశ్రమల అవార్డ్స్ 2021 విజేతలు, తుది పోటీదారులు, తమ కోసం సిద్ధం చేసిన ఎంగేజ్‌మెంట్ ప్లాన్‌ను అర్థం చేసుకోవడానికి ప్రత్యక్ష ప్రసార మాధ్యమం ద్వారా  ఆవిష్కరణ కార్యక్రమంలో చేరారు.

హ్యాండ్‌హోల్డింగ్ మద్దతు  ప్రారంభించడం జాతీయ అంకుర పరిశ్రమల అవార్డీలు- 2021 బృందంచే ఎన్నో ప్రశంసలు పొందారు

 

*******



(Release ID: 1820071) Visitor Counter : 163


This link will take you to a webpage outside this websiteinteractive page. Click OK to continue.Click Cancel to stop :  
Read this release in: English , Urdu , Hindi