ఆయుష్

మూడు రోజుల గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ & ఇన్నోవేషన్ సమ్మిట్ గాంధీనగర్‌లో ఈరోజు విజయవంతంగా ముగిసింది.


పెట్టుబడులను ఆకర్షించడానికి, విధానాలకు వ్యూహాత్మక మద్దతును అందించడానికి వీలు కల్పించే ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో ఈ సమ్మిట్ కీలక పాత్ర పోషించింది - శ్రీ సర్బానంద సోనోవాల్

Posted On: 22 APR 2022 8:22PM by PIB Hyderabad

గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ (జీఏఐఐఎస్) ఘనంగా ముగిసింది. ఆయుష్ రంగం కేవలం మూడు రోజుల్లోనే రూ. 9,000 కోట్లకు పైగా లెటర్ ఆఫ్ ఇంటెంట్స్ (ఎల్‌ఓఎల్‌ఎస్‌)ను సాధించింది. ఎఫ్‌ఎంసీజీ, మెడికల్ వాల్యూ ట్రావెల్ (ఎంవీటీ) మరియు సేవలు, ఫార్మాస్యూటికల్స్, టెక్నాలజీ & డయాగ్నస్టిక్స్ మరియు రైతులు & వ్యవసాయం వంటి ప్రధాన రంగాల్లో పెట్టుబడులు రానున్నాయి.

సమ్మిట్ సందర్భంగా పలు దేశాలు, ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థలు, రైతు సంఘాలు మరియు పరిశ్రమల మధ్య 70కి పైగా అవగాహన ఒప్పందాలు (ఎంఓయులు) కుదిరాయి. అమూల్, డాబర్, కామ ఆయుర్వేద, అకార్డ్, ఆయుర్వైడ్, నేచురల్ రెమెడీస్, అంబ్రో ఫార్మా మరియు పతంజలితో సహా 30 కంటే ఎక్కువ ఎఫ్‌ఎంసీజీ కంపెనీల నుండి మొదటి జీఏఐఐఎస్ భాగస్వామ్యాన్ని చూసింది. ఇది దాదాపు 5.5 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా. అలాగే 76 లక్షల మందికి పైగా ప్రజల జీవితాలపై ఇది సానుకూల ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా  దేశవ్యాప్తంగా ఆయుష్ ఉత్పత్తుల ప్రమోషన్, పరిశోధన మరియు తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఆయుష్ పార్కుల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తుంది.

గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ ఈ శిఖరాగ్ర సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, కేంద్ర సమాచార & ప్రసారాలు మరియు యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ యెస్సో నాయక్ మరియు ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేంద్ర ముంజపర పాల్గొన్నారు.

కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ “గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ మార్గదర్శకత్వంలో ఆయుష్ రంగం అభివృద్ధి చెందుతోంది మరియు అపూర్వమైన మైలురాళ్లను సాధిస్తోంది, ఇది మానవాళికి ఒక వరం అవుతుంది. ఆయుష్ రంగంలో పెట్టుబడులు మరియు ఆవిష్కరణల అవకాశాలు అపరిమితంగా ఉన్నాయి" అని తెలిపారు.

అలాగే పెట్టుబడులను ఆకర్షించేందుకు, విధానాలకు వ్యూహాత్మక మద్దతును అందించడానికి వీలు కల్పించే ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో సమ్మిట్ కీలకపాత్ర పోషించిందని కూడా ఆయన అన్నారు. మొత్తం ప్రపంచంలోని పెట్టుబడిదారులు మరియు పారిశ్రామికవేత్తలు ఆయుష్ అందిస్తున్న తులనాత్మక ప్రయోజనాలను మరియు ఆరోగ్య సంరక్షణ & వెల్నెస్ సేవల్లో ఆయుష్ యొక్క పటిష్టత, విశ్వసనీయతతో పాటు భారీ యువశక్తి, నైపుణ్యం కలిగిన కార్మికుల రూపంలో దాని బలాలను గ్రహించారు. నేడు, ఆయుష్ రంగం అపూర్వమైన రీతిలో ప్రపంచవ్యాప్తంగా యూఎస్ $18 బిలియన్లకు పైగా పెరిగిందని చెప్పారు.

కేంద్ర సమాచార & ప్రసారాలు మరియు యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ "ఆయుష్ రంగంలో యునికార్న్ స్టార్టప్‌ల ఆవిర్భావానికి భారతదేశం త్వరలో సాక్ష్యమిస్తుందని నాకు నమ్మకం ఉంది. అలాగే మనం ఔషధ మొక్కల పెంపకంపై పెట్టుబడి పెట్టాలి. భారతదేశం సాంప్రదాయ వైద్యంలో విశ్వ గురువుగా మారే సమయం ఆసన్నమైంది. మనం ఒకరికొకరం స్ఫూర్తితో పని చేయాలి. ఎర్త్, వన్ హెల్త్ మరియు భారతదేశంలో హీల్‌ని ప్రోత్సహిస్తుంది, మన దేశాన్ని మెడికల్ టూరిజం హబ్‌గా మారుస్తుంది." అని చెప్పారు.

ఆయుష్‌ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ మహేంద్ర ముంజపర మాట్లాడుతూ.. “సమ్మిట్‌లో వివిధ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనడం హర్షణీయమన్నారు. ఆయుష్ ఇప్పటికే అనేక ప్రపంచ గమ్యస్థానాలకు తన రెక్కలను విస్తరించింది మరియు దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఆయుష్ జీవనశైలి సూత్రాలను స్వీకరించే రేటుపై ప్రభావం చూపుతోందని వివరించారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పద్మశ్రీ వైద్య రాజేష్ కోటేచా మాట్లాడుతూ “గ్లోబల్ ఆయుష్ సమ్మిట్ పట్ల యువతలో ఉన్న ఉత్సాహం నా విశ్వాసాన్ని పెంచింది. ఆయుష్ స్టార్టప్ ఛాలెంజ్‌లో యువత విభిన్న రంగాలలో పాల్గొన్నారు మరియు ఇది అందరి నుండి అద్భుతమైన స్పందనను చూసింది" అని పేర్కొన్నారు.

సమ్మిట్‌లో మొత్తం ఐదు ప్లీనరీ సెషన్‌లు, ఎనిమిది రౌండ్‌టేబుల్‌లు, ఆరు వర్క్‌షాప్‌లు మరియు రెండు సింపోజియంలు జరిగాయి. ఇవన్నీ కూడా మూడు రోజుల స్వల్ప కాల వ్యవధిలో నిర్వహించబడ్డాయి. 90 మంది ప్రముఖ వక్తలు మరియు 100 మంది ఎగ్జిబిటర్ల సమక్షంలో ఈ శిఖరాగ్ర సదస్సు జరిగింది. గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్, 2022 అనేది భారతదేశపు ప్రాచీన జ్ఞానం మరియు సాంప్రదాయ జ్ఞానం వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి మరియు స్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేయడానికి దానిని ఉపయోగించుకోవడానికి భారత ప్రభుత్వం చేసిన విలక్షణమైన ప్రయత్నం. "మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు"ని ప్రోత్సహించే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ నంబర్ 3కి అనుగుణంగా సమ్మిట్ నిర్వహించబడింది.

 

***



(Release ID: 1819182) Visitor Counter : 141


Read this release in: English , Urdu , Hindi