వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీలోని ద్వారకలో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్, ఎక్స్‌ పో సెంటర్ (IICC) పురోగతిని సమీక్షించిన శ్రీ పీయూష్ గోయల్; ప్రాజెక్టు ఫేజ్-1 పూర్తి చేసేందుకు పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం


" ప్రపంచ స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు , ప్రోత్సాహకాలు పొందేందుకు దోహదకారిగా, సమావేశాలు, ఎగ్జిబిషన్ల మార్కెట్‌లో భారత్‌కు ఎక్కువ వాటాను అందించడంలో సహాయపడే ప్రధాన ఆర్థిక చోదక శక్తిగా ఈ కేంద్రం ఉపయోగపడుతుంది": శ్రీ గోయల్


2024 నాటికి ప్రధాన అంతర్జాతీయ సంఘటనలు నిర్వహించడంలో భారతదేశ వాటాను 13%కి పెంచడానికి ఎగ్జిబిషన్ మార్కెట్ రంగంలో న్యూఢిల్లీని షాంఘై, హాంకాంగ్ సింగపూర్‌ల వరుసలోకి తీసుకురావడానికి IICC సహాయం చేస్తుందన్న భరోసా


ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత, IICC ఏటా 100 కంటే ఎక్కువ జాతీయ అంతర్జాతీయ సంఘటనలను నిర్వహిస్తుందని భావన

Posted On: 20 APR 2022 6:53PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు  ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈరోజు ఢిల్లీలో ద్వారక ప్రాంతంలో జరగబోయే ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్, ఎక్స్-పో కేంద్రాన్ని  (IICC)ని సందర్శించారు. ప్రాజెక్టు దశ-1 పనులు సకాలంలో పూర్తి చేసేట్టు అధికారులు, అమలు చేసే ఏజెన్సీలను ఆయన ఆదేశించారు.

"ఇది ప్రపంచ సమావేశాల నిర్వహణకు, ప్రోత్సాహకాలను అందుకోవడానికి, సమావేశ ప్రదర్శనల మార్కెట్‌లో భారత్‌కు ఎక్కువ వాటాను అందించడంలో సహాయపడే ప్రధాన ఆర్థిక చోదకంగా ఉపయోగపడుతుంది" అని శ్రీ గోయల్ అన్నారు.

ఐఐసిసి అభివృద్ధి, అనుబంధ సదుపాయాలూ ప్రధాన అంతర్జాతీయ ఈవెంట్‌లు, ఎగ్జిబిషన్‌లను హోస్ట్ చేయడంలో ప్రపంచ మార్కెట్ వాటాలో పెద్ద భాగాన్ని సాధించడంలో భారతదేశానికి సహాయపడతాయి. 2024 నాటికి భారతదేశ వాటాను 13%కి పెంచడానికి, ఎగ్జిబిషన్ మార్కెట్‌లో షాంఘై, హాంకాంగ్, సింగపూర్‌ల సరసన న్యూఢిల్లీని తీసుకురావడానికి IICC సహాయపడుతుందని భావిస్తున్నారు.

ఆసియా, ఎగ్జిబిషన్ సౌకర్యాల కోసం అందుబాటులో ఉన్న మొత్తం స్థలంలో చైనా 68% (4.1 మిలియన్ చ.మీ) కంటే ఎక్కువగా ఉంది. భారతదేశం, ప్రస్తుతం 0.3 మిలియన్ చదరపు మీటర్ల ఎగ్జిబిషన్ స్థలాన్ని కలిగి ఉంది, ఇది ఆసియా వాటాలో 4.9% వాటాను కలిగి ఉంది. ఆసియా మార్కెట్లలో హోస్ట్ చేయబడిన ఈవెంట్‌ల పరంగా, చైనా వేదికలు ఏటా ఆసియాలో 515 (28%) కంటే ఎక్కువ ఈవెంట్‌లను నిర్వహించడం ద్వారా ముందంజలో ఉన్నాయి, భారతీయ వేదికలు 131 కార్యక్రమాలకు  (7.1%) ఆతిధ్యం ఇస్తున్నాయి. గొప్ప ప్రపంచ స్థాయి  ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్ సౌకర్యాలు లేనందున, ఈ అభివృద్ధి  సంభావ్య అవకాశాల నుంచి భారతదేశం ప్రయోజనం ఇప్పటివరకు  పొందలేదు.

 

IICC అనేది భారత ప్రభుత్వం ప్రధాన ప్రాజెక్టు. భారతదేశంలో మీటింగ్స్ -కలయికలు,  ఇన్సెంటివ్స్- ప్రోత్సహకాలకు, కాన్ఫరెన్స్- సమావేశాలు ఎగ్జిబిషన్స్ - ప్రదర్శనల,(MICE)  కార్యక్రమాలను అత్యాధునిక  ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్  కన్వెన్షన్ సెంటర్‌ను రూపొందించడానికి అభివృద్ధి చేస్తున్నారు. సెప్టెంబరు 20, 2018న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన  చేశారు.

ఈ ప్రాజెక్ట్ న్యూఢిల్లీలోని సెక్టార్ 25, ద్వారక ప్రాంతంలో 89.72 హెక్టార్ల విస్తీర్ణంలో 10.70 లక్షల చదరపు మీటర్ల  విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్ (11,000 మంది వ్యక్తులకు వసతి కల్పించడానికి), 5 ప్రదర్శన మందిరాలు , ఒక కిలోమీటరు పొడవు గల ప్రధాన ప్రవేశ ప్రదేశం, ముడుచుకునే పైకప్పు (20,000 మంది వ్యక్తులకు వసతి కల్పించడానికి అనువైనది), 3/4/5 స్టార్ హోటల్‌లు, కార్యాలయాల నిర్వహణకు,  కమర్షియల్/రిటైల్ స్పేస్‌తో వ్యాపార లావాదేవీలకు  బహుళ-ప్రయోజనకారిగా ఉంది.

ఈ ప్రాజెక్టును రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. ఫేజ్-1 కన్వెన్షన్ సెంటర్ (60,000 చ.మీ.) కింద, రెండు ఎగ్జిబిషన్ హాల్స్ (61,000 చ.మీ.)తో ప్రక్కనే ఉన్న ఫోయర్‌తో   ప్రాజెక్ట్ మొత్తం మౌలిక రూపు రేఖలతో అభివృద్ధి చెందుతోంది. ఫేజ్-II మరో 3 ఎగ్జిబిషన్ హాల్స్, అరీనా, హోటల్స్, రిటైల్, ఆఫీస్ స్పేస్‌ల నిర్మాణంతో అభివృద్ధి చేయడానికి ఫేజ్-I పూర్తయిన తర్వాత ప్రణాళిక చేశారు. 

విమానాశ్రయ  ఎక్స్‌ప్రెస్ మెట్రో పొడిగింపు అయిన ఒక ప్రత్యేకమైన భూగర్భ మెట్రో స్టేషన్‌ను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) నిర్మిస్తోంది. దీనికి IICC Ltd ద్వారా నిధులు సమకూరుస్తోంది. ప్రాజెక్ట్ స్థలం- ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II, ఢిల్లీలో విస్తరించిన రింగ్ రోడ్డు ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వెంట అంకితమైన ఇంటర్‌ఛేంజ్‌లతో అద్భుతమైన రహదారి అనుసంధానాన్ని కలిగి ఉంది.

కైనెక్సిన్  కన్వెన్షన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కొరియా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (KINTEX)  ఈసాంగ్ నెట్‌వర్క్స్ కంపెనీ లిమిటెడ్  కన్సార్టియం, పోస్ట్ కమర్షియల్ ఆపరేషన్స్ డేట్ (COD) కోసం వేదికను 20 సంవత్సరాలు నిర్వహించడం కోసం ఎగ్జిబిషన్  కన్వెన్షన్ సెంటర్‌కు  నిర్వాహకులుగా నియమించారు. ఈ సంస్థ ప్రస్తుతం IICC ప్రాజెక్ట్‌ లో నిర్మిస్తున్న ప్రస్తుత సౌకర్యాలను సమీక్షిస్తూ మంచి పరిశ్రమ పద్ధతుల ప్రకారం అవసరమైన సహాయాన్ని అందజేస్తున్నారు. ఇప్పటివరకు  ప్రపంచవ్యాప్తంగా సమావేశ, ప్రదర్శనల కోసం అనుసరించిన సాధారణ అనుభవం, అభ్యాసం ఆధారంగా వివిధ మెరుగుదలలు సూచించారు.

పర్యటన సందర్భంగా, శ్రీ గోయల్ బాహ్య అనుసంధాన  పనులు  గడువులోగా పూర్తి చేయాలని DMRC  నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులను కోరారు. EPC గుత్తేదారు గత ఆరు నెలల నుండి ప్రాజెక్ట్ వనరుల విస్తరణ మెరుగుపరచారని   గడువులోపు పూర్తి చేసేందుకు వీలుగా  ప్రాజెక్ట్ వేగం గణనీయంగా పెరిగిందని తెలియజేసింది. మంత్రితో పాటు పరిశ్రమల ప్రోత్సాహక శాఖ (DPIIT), IICC లిమిటెడ్, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NICDC Ltd.), ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ (PMC)  L&T Ltd. (EPC కాంట్రాక్టర్) సీనియర్ అధికారులు ఈ పర్యటన లో వెంట ఉన్నారు)
ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత, IICC లో  ప్రతి సంవత్సరం 100 కంటే ఎక్కువ జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు నిర్వహించాలని భావిస్తున్నారు.

 

****


(Release ID: 1818649) Visitor Counter : 185


Read this release in: English , Urdu , Hindi