విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పవర్ సిస్టమ్ మోడలింగ్, సిమ్యులేషన్‌పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న POSOCO


BBINS దేశాల కోసం రెండు వారాల వర్క్‌షాప్

Posted On: 20 APR 2022 1:58PM by PIB Hyderabad

నేషనల్ గ్రిడ్ ఆపరేటర్ పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (POSOCO) 2022 ఏప్రిల్ 18 నుండి 29 వరకు 'పవర్ సిస్టమ్ మోడలింగ్ మరియు సిమ్యులేషన్పై దిల్లీలో రెండు వారాల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమానికి బంగ్లాదేశ్భూటాన్భారత్నేపాల్, శ్రీలంక నుండి పాల్గొంటున్నారు. ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ అండ్ యాక్షన్ ఫర్ డెవలప్‌మెంట్ (IRADe)తో ఈ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.

ఈ వర్క్‌షాప్‌ను శ్రీ అలోక్ కుమార్, కార్యదర్శి(పవర్) ప్రారంభించారు. పొసోకో సీఎండి శీ ఎస్ఆర్ నరసింహన్, సేజ్-ఆర్ఐఎస్ ఛైర్మన్ శ్రీ ఆర్ వి సాహి, యుఎస్ఎయిడ్ ఇండో పసిఫిక్ ఆఫీస్ డైరెక్టర్, శ్రీ జాన్ స్మిత్ సరేన్, ఐఆర్ఏడిఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జ్యోతి పరేఖ్,  ఎస్ఎఆర్ఐ/ఈఐ  టెక్నికల్ డైరెక్టర్ శ్రీ వినోద్ కుమార్ అగర్వాల్, ఎన్ఆర్ఎల్డీసి (ప్రోగ్రాం డైరెక్టర్) శ్రీ ఆర్ కే పోర్వాల్, ఐఆర్ఏడిఈ చైర్మన్ శ్రీ కిరిత్ పరేఖ్, పోసోకో ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమం పొసోకో ఇంజనీర్లు నిర్వహించనున్నారు. ఈ కోర్సులో ప్రధాన క్రియాత్మక ప్రాంతాలపై స్వీయ-అంచనా పరీక్షలను నిర్వహించనున్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, పరిశ్రమ నిపుణులతో ఇంటరాక్టివ్ సెషన్‌లు ఉంటాయి. పాల్గొనేవారు ఆగ్రాలోని ప్రపంచంలోని మొట్టమొదటి మల్టీ టెర్మినల్ హెచ్‌వీడీసి స్టేషన్‌కు క్షేత్ర సందర్శన అవకాశాన్ని పొందనున్నారు.

పవర్ సిస్టమ్ మోడలింగ్, సిమ్యులేషన్ శిక్షణ కార్యక్రమం పాల్గొనేవారికి ప్రాథమిక అంశాల నుండి అధునాతన స్థాయి పవర్ సిస్టమ్ వరకు పరిచయం చేయబడుతుంది. ఈ కోర్సులో పవర్ సిస్టమ్పర్ యూనిట్ సిస్టమ్పవర్ సిస్టమ్ ఎలిమెంట్స్ మోడలింగ్స్టెడీ స్టే లోడ్ ఫ్లో అధ్యయనాలుఫాల్ట్ అనాలసిస్డైనమిక్ మోడలింగ్, సిమ్యులేషన్‌లురియాక్టివ్ పవర్ స్టడీస్బదిలీ సామర్థ్యం అంచనా, సరైన పవర్ ఫ్లోపై థియరీలపై సెషన్లు ఉన్నాయి.

***


(Release ID: 1818417) Visitor Counter : 159