ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
పౌర కార్మికులతో కలిసి అంబేడ్కర్ జయంతిని జరుపుకున్న మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కాశీ విశ్వనాథ్, వెల్లరియమ్మన్ ఆలయానని సందర్శించిన మంత్రి
జాతీయ నైపుణ్య మహిళా శిక్షణా సంస్థ విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం, విధాన నిర్ణయాలలో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ పై ప్రధానంగా దృష్టిపెట్టడంతో సమానత్వానికి సంబంధించి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ దార్శనికత వాస్తవ రూపం దాలుస్తున్నది : రాజీవ్ చంద్రశేఖర్
Posted On:
14 APR 2022 5:14PM by PIB Hyderabad
మన ప్రజాస్వామిక రాజ్యాంగ ప్రాథమిక లక్షణం సమానత్వం. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌గారి దార్శనికత అయిన సమానత్వం, సమాన అవకాశాలను శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం సబ్ కా సాథ్ , సబ్ కా వికాస్ పై ప్రధానంగా దృష్టిపెట్టడం ద్వారా సాకారం చేస్తున్నది.
అట్టడుగున ఉన్న వ్యక్తిపట్ల కూడా శ్రద్ధ చూపుతూ,-అంత్యోదయ తాత్వికత విధాన నిర్ణయాలకు, లబ్ధిదారులకు వర్తించే అన్ని పథకాలకు మార్గనిర్దేశం వహిస్తున్నది. ప్రతి ప్రభుత్వ పథకంలో సబ్ కా సాథ్ ,సబ్ కా వికాస్ అమలు వంటివి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రభుత్వ పాలన, రుజువర్తనలో , దాని ప్రభావంలో నూతన ప్రమాణాలను నెలకొల్పుతున్నదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యుయర్ షిప్ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.బెంగళూరులో మహిళల జాతీయ నైపుణ్యశిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించున్న అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన ఈ మాటలన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, టీచర్లు, సంబంధిత అధికారులతో ముచ్చటిస్తూ మంత్రి, భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి.ఆర్ అంబేడ్కర్, దేశ నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారన్నారు. భారత రాజ్యాంగంలో ప్రముఖంగా ప్రస్తావించిన సమానత్వ ప్రాథమిక హక్కు , మతం, కులం, రంగు, వర్గం, స్త్రీ పురుష తేడా లేకుండా సమానత్వానికి అందరికీ అవకాశం కల్పిస్తున్నదని చెప్పారు. వైవిధ్యత కలిగిన భారతదేశంలో , మనం భౌగోళికంగా వివిధ ప్రాంతాలలో నివశించవచ్చు గాని, మనమందరం ఒక సామాన్య గుర్తింపును, అదే భారతీయులమనే గుర్తింపును కలిగి ఉన్నామన్నారు. అంబేడ్కర్ జయంతి, మహావీర జయంతి సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (ఎన్ ఎస్ టిఐ) విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను మంత్రి సందర్శించారు.పోటీని ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగు పెట్టుకుంటుండాలని మంత్రి సూచించారు. ప్రస్తుత కాలంలో డిజిటల్ నైపుణ్యాలను నేర్చుకోవలసి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. నైపుణ్యాలకు సంబంధించి మరిన్ని అవకాశాలు కల్పించడం ద్వారా మహిళలకు సాధికారత కల్పించడం అనేది నరేంద్ర మోదీ ప్రభుత్వ గట్టి విశ్వాసమని ఆయన అన్నారు.
(Release ID: 1816974)
Visitor Counter : 156