ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

186.22 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 2.36 కోట్లకు పైగా టీకా డోసులు నిర్వహణ

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 11,058

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,007

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

వారపు పాజిటివిటీ రేటు 0.25%

Posted On: 14 APR 2022 9:25AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 186.22 కోట్ల ( 1,86,22,76,304 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,26,31,632 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2.36 కోట్లకు పైగా ( 2,36,92,551 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు. వీరికి ఇప్పటివరకు 62,683 ముందు జాగ్రత్త టీకాలు అందించారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,04,276

రెండో డోసు

1,00,07,284

ముందు జాగ్రత్త డోసు

45,74,859

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,14,188

రెండో డోసు

1,75,24,263

ముందు జాగ్రత్త డోసు

70,90,622

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

2,36,92,551

రెండో డోసు

30,964

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,78,02,182

రెండో డోసు

4,01,10,045

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,51,80,802

రెండో డోసు

47,17,06,600

ముందు జాగ్రత్త డోసు

13,630

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,28,40,086

రెండో డోసు

18,65,87,681

ముందు జాగ్రత్త డోసు

49,053

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,68,06,150

రెండో డోసు

11,62,28,014

ముందు జాగ్రత్త డోసు

1,32,13,054

ముందు జాగ్రత్త డోసులు

2,49,41,218

మొత్తం డోసులు

1,86,22,76,304

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇవాళ 11,058 గా కేసుల సంఖ్య నమోదైంది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.03 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 818 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,06,228 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 1,007 కొత్త కేసులు నమోదయ్యాయి. 

గత 24 గంటల్లో మొత్తం 4,34,877 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.08 కోట్లకు పైగా ( 83,08,10,157 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివ్‌ రేట్లలో తగ్గుదల కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ రేటు 0.25 శాతం వద్ద, రోజువారీ పాజిటివిటీ రేటు 0.23 శాతం వద్ద ఉంది.

 

****


(Release ID: 1816857) Visitor Counter : 177