శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌ను నేడు దిల్లీలో కలిసిన స్విట్జర్లాండ్ పార్లమెంటు సభ్యులు శ్రీ నిక్లాస్ శామ్యూల్ గగ్గర్
ఆరోగ్య సంరక్షణ, టెలిమెడిసిన్ మరియు సాంకేతిక పురోగతి వంటి రంగాలలో విస్తృత సహకారం కోసం అవకాశాలను చర్చించిన ఇరు నేతలు
భారత్- స్విట్జర్లాండ్ మధ్య సంప్రదాయబద్ధంగా పరస్పర విశ్వసనీయమైన బంధాలను ఉన్నయి కాబట్టి, ఇప్పటికే ఉన్న సౌలభ్యత ఆధారంగా పరస్పరం నిమగ్నమవ్వడం సులభమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన వివిధ రంగాలు 25 టెక్నాలజీ హబ్‌లలో సాంకేతిక సహకారంపై గగ్గర్ ఆసక్తిని వ్యక్తం చేశారు.
డా. జితేంద్ర సింగ్ 2018లో దావోస్ పర్యటనలో ఉన్న సమయంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రపంచ సదస్సు ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. స్విట్జర్లాండ్ ప్రజలు అందించిన సాదరమైన ఆతిథ్యాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు.
అనంతరం జరిగిన వివరణాత్మక సమావేశంలో, హిమానీనదాల రంగంలో ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం చేస్తున్న విస్తృతమైన పనుల గురించి భారత్ తెలియజేసింది, ఈ విషయం పరస్పర ప్రాముఖ్యత ఉన్నందున స్విస్ ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు.
Posted On:
10 APR 2022 5:17PM by PIB Hyderabad
నిక్లాస్ శామ్యూల్ గగ్గర్, స్విట్జర్లాండ్ పార్లమెంట్ సభ్యులు, డాక్టర్ జితేంద్ర సింగ్, సైన్స్& టెక్నాలజి సహాయ మంత్రి (స్వతంత్ర ఛార్జ్); ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి; ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ సహాయ మంత్రిని నేడు దిల్లీలో కలుసుకున్నారు. ఆరోగ్య రంగం, టెలిమెడిసిన్ మరియు సాంకేతిక పురోగతి వంటి రంగాలలో విస్తృత సహకారం కోసం అవకాశాలపై ఇద్దరు నేతలు చర్చించారు.
భారత్‌ను సందర్శనలో భాగంగా భారతదేశ నూతన విద్యా విధానంపై గొప్ప ఆసక్తిని కనబరిచారు. విధానాలలోని మరిన్ని అంశాల గురించి తెలుసుకోవడానికి సుముఖతను వ్యక్తం చేశారు. వివిధ రంగాలలో సాంకేతిక సహకారం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం రూపొందించిన 25 టెక్నాలజీ హబ్‌లపై కూడా ఆసక్తిని వ్యక్తం చేశారు.
భారతదేశం- స్విట్జర్లాండ్ దేశాల మధ్య సాంప్రదాయకంగా పరస్పరం విశ్వసనీయమైన సంబంధాలు ఇప్పటికే ఉన్నందున, సౌలభ్యం ఆధారంగా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవడం సులభం అని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
ఈ ఏడాది అక్టోబరులో స్విట్జర్లాండ్‌కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం భారత్‌ను సందర్శిస్తుందని, పరస్పర ప్రయోజనకరమైన ఇరుపక్షాలకు సంబంధించిన సమస్యలపై ద్వైపాక్షిక సంబంధాలు నూతన శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతాయని భావిస్తున్నారు.
డా. జితేంద్ర సింగ్ 2018లో దావోస్ పర్యటనలో ప్రపంచ ఆర్థిక వేదిక ప్రపంచ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. స్విట్జర్లాండ్ ప్రజలు అందించిన ఆత్మీయ ఆతిథ్యాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు.
ఇరు నేతల మధ్య పరస్పర చర్చల అనంతరం ఇరుపక్షాలు తమ ప్రతినిధులతో సమావేశమయ్యారు. చర్చల సమయంలో, హిమానీనదాల రంగంలో ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం చేస్తున్న విస్తృతమైన పనుల గురించి సందర్శకులకు అధికారులు తెలియజేశారు. స్విట్జర్లాండ్ ప్రతినిధులకు కూడా ఈ విషయం ముఖ్యమైనందున ఆసక్తిని కనబరిచారు.
*****
(Release ID: 1815607)
Visitor Counter : 149