వ్యవసాయ మంత్రిత్వ శాఖ
భారతీయ అరటి & బేబీ కార్న్‌లకు కెనడా మార్కెట్‌లలోకి అనుమతి
प्रविष्टि तिथि:
09 APR 2022 11:29AM by PIB Hyderabad
భారతీయ అరటి, బేబీ కార్న్‌లను మార్కెట్లలోకి అనుమతించే విషయమై 'నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా', కెనడా మధ్య జరిగిన చర్చలు ఫల ప్రదమయ్యాయి. ఫలితంగా ఈ ఉత్పత్తులు కెనడా మార్కెట్‌లలోకి విక్రయించేందుకు గాను తగు మార్గం సుగమమైంది. 07.04.22న డీఏ&ఎఫ్‌డబ్ల్యుకార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా, కెనడా హైకమిషనర్ హెచ్.ఈ, కామెరాన్ మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతర కెనడా D-95-28: ప్లాంట్ ప్రొటెక్షన్ ఇంపోర్ట్ అండ్ డొమెస్టిక్ మూవ్‌మెంట్ రిక్వైర్‌మెంట్స్ ఫర్ కార్న్ అండ్ ఆటోమేటెడ్ ఇంపోర్ట్ రిఫరెన్స్ సిస్టమ్ (ఏఐఆర్ఎస్) ఆదేశాన్ని నవీకరించింది. దీని ఫలితంగా భారతదేశం నుండి కెనడాకు తాజా బేబీ కార్న్ ఎగుమతులు ఏప్రిల్ 2022 నుండి ప్రారంభమవుతాయి. దీనికి తోడు భారతదేశం నుంచి ఉత్పత్తి అయ్యే తాజా అరటిపండ్లకు సంబంధించిన సాంకేతిక సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో భారత సమాచారం
ఆధారంగా భారత అరటి పండ్లు కెనడా మార్కెట్ల ప్రవేశానికి తక్షణమే అనుమతులు అమలులోకి వచ్చాయి. కెనడా ప్రభుత్వం యొక్క ఈ నిర్ణయం ఈ పంటలను పండించే భారతీయ రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది మరియు భారతదేశ ఎగుమతి ఆదాయాలను కూడా పెంచుతుంది.
***
(रिलीज़ आईडी: 1815213)
आगंतुक पटल : 222