రక్షణ మంత్రిత్వ శాఖ
వాషింగ్టన్‌లో ఏప్రిల్ 11న భారత్-యుస్ 2+2 మంత్రివర్గ చర్చలకు హాజరుకానున్న రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
యుఎస్‌లో తన 4 రోజుల పర్యటన సందర్భంగా ప్రత్యేకంగా యుఎస్ రక్షణ మంత్రిని కలవనున్న రాజ్‌నాథ్
Posted On:
08 APR 2022 5:35PM by PIB Hyderabad
రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ఏప్రిల్ 11-14, 2022 వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పర్యటించనున్నారు. రక్షణ మంత్రి, విదేశాంగ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్‌తో కలిసి వాషింగ్టన్ డిసిలో ఏప్రిల్ 11, 2022న జరుగనున్న 4వ భారత్- యుఎస్ఎ 2+2 మంత్రుల చర్చలో పాల్గొననున్నారు. విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ లు అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తారు. వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహాకారాన్ని 2+2 చర్చలలో సమీక్షించి, ముందుకు వెళ్ళేందుకు మార్గాన్ని రూపొందిస్తారు.
శ్రీ రాజ్‌నాథ్ సింగ్ యుఎస్ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌ను పెంటాగన్‌లో ప్రత్యేకంగా కలుసుకుని , రక్షణ పారిశ్రామిక సహకారంతో సహా, ఇరు సైన్యాల మధ్య హామీల ద్వారా సామర్ధ్య నిర్మాణం గురించి చర్చిస్తారు. వాషింగ్టన్ డిసిలో పర్యటన ముగించుకున్న అనంతరం హవాయిలోని యుఎస్ ఇండో- పసిఫిక్ కమాండ్ (INDOPACOM)ను కూడా రక్షణ మంత్రి సందర్శించనున్నారు.
(Release ID: 1815131)
Visitor Counter : 182