వ్యవసాయ మంత్రిత్వ శాఖ

అనంతపురం బనానా క్లస్టర్ మరియు హార్టికల్చర్ క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమంపై సమీక్ష


అనంతపురంలోని బనానా క్లస్టర్ సుమారు 14,000 మంది అరటి రైతులు మరియు విలువ గొలుసు సంబంధిత వాటాదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు సుమారు 7.5 లక్షల ఎంటీ అరటిని నిర్వహిస్తుంది.

Posted On: 08 APR 2022 5:28PM by PIB Hyderabad

నేషనల్ హార్టికల్చర్ బోర్డ్‌కు చెందిన హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (హెచ్‌సిడీపీ)ని సమీక్షించేందుకు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష్ లిఖి, ఐఏస్‌..అనంతపురం జిల్లాలోని నార్పల మండలం కర్ణపూడి గ్రామాన్ని సందర్శించారు. హెచ్‌సిడిపి కింద పైలట్ క్లస్టర్‌గా బనానా కోసం అనంతపురం ఎంపికైంది. సందర్శన సమయంలో డాక్టర్ లిఖి క్లస్టర్ నుండి అరటిపండు విలువ గొలుసు వాటాదారులతో సంభాషించారు. అరటి పెంపకందారులతో సంభాషిణ సందర్భంగా.. ఈ కార్యక్రమం ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్-హార్వెస్ట్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, మార్కెటింగ్ మరియు బ్రాండింగ్‌తో సహా మొత్తం విలువ గొలుసు యొక్క సవాళ్లను పరిష్కరిస్తుంది అని చెప్పారు.


image.png


హెచ్‌సిడీపీ అనేది భౌగోళిక స్పెషలైజేషన్‌ను ప్రభావితం చేయడానికి మరియు హార్టికల్చర్ క్లస్టర్‌ల సమగ్ర మరియు మార్కెట్-నేతృత్వ అభివృద్ధిని ప్రోత్సహించడానికి రూపొందించబడింది. అరటి పండించేవారికి మంచి వ్యవసాయ పద్ధతుల యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించాడు. ఫలితంగా నాణ్యమైన ఉత్పత్తులను పొందడం వల్ల అధిక ఆదాయం అందుతుంది. క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌పై రైతులతో వర్క్‌షాప్ నిర్వహించి, ప్రోగ్రామ్ యొక్క అంశాలు మరియు లక్ష్యాలపై వారికి అవగాహన కల్పించాలని బ్లాక్ స్థాయి ఉద్యానవన అధికారులను ఆయన కోరారు.

వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ 55 హార్టికల్చర్ క్లస్టర్‌లను గుర్తించింది. వాటిలో 12 ప్రోగ్రాం యొక్క పైలట్ లాంచ్ కోసం ఎంపిక చేయబడ్డాయి. పైలట్ దశలోని క్లస్టర్‌లలో ఆపిల్‌కు షోపియాన్ (జే అండ్ కే) మరియు కిన్నౌర్ (H.P.) ఉన్నాయి. అలాగే మామిడికి లక్నో (యూపీ)  కచ్ (గుజరాత్) మరియు మహబూబ్ నగర్ (తెలంగాణ), అరటి కోసం అనంతపురం (ఎపి) మరియు తేని (టి.ఎన్.) ద్రాక్ష కోసం నాసిక్ (మహారాష్ట్ర), పైనాపిల్ కోసం సిఫాహిజాల (త్రిపుర), దానిమ్మకోసం షోలాపూర్ (మహారాష్ట్ర) మరియు చిత్రదుర్గ (కర్ణాటక) మరియు పసుపు కోసం వెస్ట్ జైంతియా హిల్స్ (మేఘాలయ) ఉన్నాయి.

కార్యక్రమం యొక్క విస్తృతి మరియు ప్రభావం గురించి డాక్టర్ లిఖి మాట్లాడుతూ “అనంతపూర్‌లోని బనానా క్లస్టర్ సుమారు 14,000 మంది అరటి రైతులు మరియు విలువ గొలుసు సంబంధిత వాటాదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు సుమారు 7.5 లక్షల ఎంటీ అరటిని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంతో మేము లక్ష్యంగా చేసుకున్న పంటల ఎగుమతులను 20-25% మెరుగుపరచడం మరియు క్లస్టర్ పంటల పోటీతత్వాన్ని పెంపొందించడానికి క్లస్టర్-నిర్దిష్ట బ్రాండ్‌లను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాము" అని వివరించారు.

క్లస్టర్‌లో ప్రోగ్రామ్‌ను అమలు చేయడానికి క్లస్టర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీగా నియమించబడిన ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ అధికారులతో ఇంటరాక్షన్ సందర్భంగా ప్రోగ్రామ్ యొక్క  పురోగతిని డాక్టర్ లిఖి సమీక్షించారు. కార్యక్రమం సకాలంలో అమలయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు.  కార్యక్రమం కింద జరుగుతున్న కార్యక్రమాలను సమీక్షించడానికి ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహించాలని చెప్పారు. ఈ పర్యటనలో డాక్టర్ లిఖితో పాటు కమిషనర్ హార్టికల్చర్, ఆంధ్రప్రదేశ్; డైరెక్టర్ హార్టికల్చర్, ఆంధ్రప్రదేశ్; డైరెక్టర్, హార్టికల్చర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, మరియు ఇతర అధికారులు, ఆంధ్రప్రదేశ్‌ ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.


 

*****



(Release ID: 1815125) Visitor Counter : 155


Read this release in: English , Urdu , Hindi