పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంతంలో హైడ్రోజన్ మొబిలిటి పరిష్కరాలను ప్రోత్సహించేందుకు హైడ్రోజన్ ఇంధన సంబంధిత స్టార్టప్ లతో ఇంక్యుబేషన్ ఒప్పందంపై సంతకాలు చేసిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఒఐఎల్)
Posted On:
08 APR 2022 3:42PM by PIB Hyderabad
ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఒఐఎల్) నిన్న ఒమ్ క్లీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ తో కలిసి ఇంక్యుబేషన్ ఒప్పందంపై సంతకం చేసింది. 9-ఎం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత ఈ బస్ డిజైన్, ఇంటిగ్రేషన్ , డవలప్‌మెంట్,ద్రవరూప ఆర్గానిక్ హైడ్రోజన్ కారియర్ (ఎల్.ఒ.హెచ్.సి) సొల్యూషన్ కు సంబంధించి ఒప్పందం కుందిరింది. ఈ స్టార్టప్‌కు ప్రతిష్ఠాత్మక ఐఐటి గౌహతి మెంటార్‌గా వ్యవహరించి దీనిని ముందుకు తీసుకుపోతుంది.
ఆయిల్ ఇండియా లిమిటెడ్ సిఎండి, శ్రీ సుశీల్ సిహెచ్. మిశ్ర, మాట్లాడుతూ, ఒఐఎల్ పరిశుభ్ర ఇంధన రంగంలో వినూత్న , మున్నెన్నడూ లేని సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసేందుకు కట్టుబడి ఉందన్నారు. ఒఐఎల్ ఇప్పటికే హైడ్రోజన్ ఉత్పత్తి, బ్లెండింగ్ కు సంబంధించిన పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. ఇది ప్రస్తుతం ఈ స్టార్టప్ వెంచర్‌ను హైడ్రోజన్ స్టోరేజ్, రవాణా, మొబిలిటీ సొల్యూషన్స్‌కు సంబంధించి స్పాన్సర్ చేస్తోంది.ఇది భారతప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్‌కు సహాయపడగలదని ఆయన అన్నారు. అలాగే ఇది ఈశాన్య ప్రాంతంలో హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థకు ద్వారాలు తెరుస్తుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఫైనాన్స్ డైరక్టర్ శ్రీహరీష్ మాధవ్,ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఎస్.ఎన్.ఇ.హెచ్ (స్టార్ట్ అప్ నర్చరింగ్,ఎనేబ్లింగ్ హాండ్లింగ్ ) స్నేహ్ పథకం కింద అర్హత గలిగిన స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఒఐఎల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా గల ఆరు స్టార్టప్‌లకు మద్దతునిస్తున్నట్టు చెప్పారు. రోబోటిక్స్, ఇన్ స్ట్రుమెంటేషన్, బయోటెక్, ఇంధన సరఫరా సొల్యూషన్లు వంటి వాటికి సంబంధించి మద్దతునిస్తున్నట్టు తెలిపారు.
హైడ్రోజన్ ఇంధన రంగంలో ఈ రెండు కొత్త కొలాబరేషన్లను విజయవంతంగా పూర్తి చేయడంతో, ఆయిల్ ఇండియా లిమిటెడ్, స్టార్టప్ లతోకలిసి తక్కువ సమయంలో ఈశాన్య భారతదేశంలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత ఇ-బస్‌ను నడపడంలో విజయవంతం కాగలదని ఆయన అన్నారు.
ఒహెచ్ ఎం క్లీన్ టెక్ డైరక్టర్ భావనా ఎస్.మయూర్ మాట్లాడుతూ, పరిశుభ్ర ఇంధన రంగంలో ఈశాన్య ప్రాంతలో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. హైడ్రోజన్ ఆధారిత సాంకేతికత అయిన ఎల్.ఒ.హెచ్.సి, హైడ్రోజన్ బస్ ను మార్కెట్‌కు తీసుకురావడానికి అరుదైన అవకాశం దక్కుతోందని అన్నారు. ఒఐఎల్ తమ పై ఉంచిన విశ్వాసంతో తాము దేశానికి ఆత్మనిర్భర్ అభివృద్ధిని సాధిస్తామన్నారు.
***
(Release ID: 1814868)
Visitor Counter : 208