ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
క్యాన్సర్, డయాబెటిస్, కార్డియోవాస్కులర్ వ్యాధులు మరియు స్ట్రోక్ నివారణ మరియు నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం
నాడు పోస్టు చేయడమైనది:
05 APR 2022 3:43PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా క్యాన్సర్, డయాబెటిస్, కార్డియోవాస్కులర్ వ్యాధులు మరియు స్ట్రోక్ (ఎన్‌పిసిడిసిఎస్) నివారణ మరియు నియంత్రణ కోసం జాతీయ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కార్యక్రమం కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సాంకేతిక మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. రాష్ట్రాలు/యూటీల నుండి స్వీకరించిన ప్రతిపాదనల ఆధారంగా మరియు వనరుల ఎన్వలప్‌కు లోబడి ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, పరికరాలు, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య ప్రమోషన్ & నివారణ కోసం అవగాహన కల్పించడం, ముందస్తు రోగ నిర్ధారణ, నిర్వహణ మరియు నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్‌సిడిలు) చికిత్స కోసం తగిన స్థాయి ఆరోగ్య సంరక్షణ సదుపాయాన్ని సూచించడంపై దృష్టి పెడుతుంది. ఎన్‌పిసిడిసిఎస్ 682 జిల్లా ఎన్‌సిడి క్లినిక్‌లు, 191 జిల్లా కార్డియాక్ కేర్ యూనిట్లు మరియు 5408 కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లు ఏర్పాటు చేయబడ్డాయి.
సాధారణ ఎన్‌సిడిల నివారణ, నియంత్రణ మరియు స్క్రీనింగ్ కోసం జనాభా ఆధారిత కార్యక్రమం అంటే మధుమేహం, రక్తపోటు మరియు సాధారణ క్యాన్సర్‌లు (నోటి, రొమ్ము మరియు గర్భాశయం) దేశంలో ఎన్‌హెచ్‌ఎం క్రింద మరియు సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో భాగంగా రూపొందించబడింది. ఇందులో భాగంగా 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు వారి స్క్రీనింగ్ కోసం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సాధారణ ఎన్‌సిడీల స్క్రీనింగ్ అనేది ఆయుష్మాన్ భారత్ - హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల క్రింద సర్వీస్ డెలివరీలో అంతర్భాగం. మొత్తం 7,04,631 మంది గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త (ఆశాలు), 2,19,113 సహాయక నర్స్ మిడ్‌వైఫ్ (ఏఎన్‌ఎం)/మల్టీపర్పస్ వర్కర్లు (ఎంపిడబ్ల్యూ), 28,912 స్టాఫ్ నర్సులు, 76,567 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సిహెచ్‌ఓలు) మరియు 29,648 మంది వైద్యాధికారులు సాధారణ ఎన్‌సిడిల యూనివర్సల్ స్క్రీనింగ్‌పై శిక్షణ పొందారు.
ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ పథకం ద్వారా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కింద వెల్నెస్ కార్యకలాపాలను ప్రోత్సహించడం మరియు సమాజ స్థాయిలో లక్ష్య కమ్యూనికేషన్ ద్వారా ఎన్‌సిడిల నివారణ అంశం బలోపేతం చేయబడింది. ఎన్‌సిడీల గురించి ప్రజలకు అవగాహన పెంచడానికి మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి జాతీయ మరియు అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవాన్ని పాటించడం మరియు సమాజ అవగాహన కోసం ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాను ఉపయోగించడం వంటి ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా ఎప్‌ఎస్‌ఎస్‌ఏఐ ద్వారా ఆరోగ్యకరమైన ఆహారంపై కూడా ప్రచారం చేయబడుతుంది. ఫిట్ ఇండియా ఉద్యమాన్ని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది మరియు వివిధ యోగా సంబంధిత కార్యకలాపాలను ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. వీటికి అదనంగా ఎన్‌పిసిడిసిఎస్ వారి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్ (పిఐపిలు) ప్రకారం రాష్ట్రాలు/యూటీలతో ఎన్‌సిడిల కోసం అవగాహన ఉత్పత్తి (ఐఈసీ) కార్యకలాపాలకు ఎన్‌హెచ్‌ఎం కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
ఇంకా, పదిహేనవ ఆర్థిక సంఘం (ఎఫ్‌సి-XV) రాష్ట్రాలకు గ్రామీణ ఉప ఆరోగ్య కేంద్రాలు & గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సి) మరియు కమ్యూనిటీకి దగ్గరగా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందించే దృక్పథంతో రూ. 16,377 కోట్ల నిధులకు రికమెండ్ చేసింది. అలాగే రోగనిర్ధారణ మౌలిక సదుపాయాలకు మద్దతునిచ్చేందుకు అర్బన్ పిహెచ్‌సీలలో రూ.2,095 కోట్లు కేటాయించాలని తెలిపింది.
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు.
****
(రిలీజ్ ఐడి: 1814007)
సందర్శకుల సూచీ సంఖ్య : : 200