వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి అన్నదాత ఆదాయ సంరక్షణ అభియాన్ (పి.ఎం-ఏ.ఏ.ఎస్.హెచ్.ఏ) కోసం బడ్జెట్

Posted On: 05 APR 2022 3:54PM by PIB Hyderabad

ప్రకటించిన పప్పుధాన్యాలు, నూనెగింజలు, కొబ్బరి సాగు చేసే రైతులకు లాభసాటి ధర అందించాలనే ఉద్దేశ్యంతో,  ధర మద్దతు పథకం (పి.ఎస్.ఎస్); ధర లోపం చెల్లింపు పథకం (పి.డి.పి.ఎస్); పైలట్ ప్రైవేట్ సేకరణ, స్టాకిస్టు పధకం (పి.పి.ఎస్.ఎస్) లను కలుపుతూ, ప్రభుత్వం ప్రధానమంత్రి అన్నదాత ఆదాయ సంరక్షణ అభియాన్ ( పి.ఎం-ఏ.ఏ.ఎస్.హెచ్.ఏ ) అనే ఒక పథకాన్ని అమలు చేస్తోంది.  పి.ఎస్.ఎస్. కింద పప్పుధాన్యాలు, నూనెగింజలు, కొబ్బరి దిగుబడులను ఎం.ఎస్.పి. వద్ద కొనుగోలు చేయడం జరుగుతుంది.  కాగా, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం రాష్ట్రం కోసం, సేకరణ సీజన్లలో నిర్దిష్టంగా గుర్తించిన నూనెగింజలకు సంబంధించి పి.ఎస్.ఎస్. లేదా పి.డి.పి.ఎస్. ను ఎంపిక చేసి అమలు చేయవచ్చు.   పారదర్శక వేలం ప్రక్రియ ద్వారా గుర్తింపు పొందిన మార్కెట్ యార్డులో నిర్ణీత వ్యవధిలో సూచించిన సరసమైన సగటు నాణ్యత (ఎఫ్.ఏ.క్యూ) నిబంధనలతో కూడిన నూనె గింజలను విక్రయించే ముందుగా నమోదు చేసుకున్న రైతుల కు, పి.డి.పి.ఎస్. కింద, ఎం.ఎస్.పి. మరియు అమ్మకం / మోడల్ ధర మధ్య వ్యత్యాసాన్ని నేరుగా చెల్లించడం తప్ప భౌతిక సేకరణ జరగదు.  దీనితో పాటు, నూనెగింజల కోసం జిల్లా / జిల్లాలో ఎంపిక చేసిన ఏ.పి.ఎం.సి.(లు) లో పైలట్ ప్రాతిపదికన ప్రైవేట్ ప్రొక్యూర్‌మెంట్ మరియు స్టాకిస్ట్ స్కీమ్ (పి.పి.ఎస్.ఎస్) ని అమలు చేసే అవకాశం రాష్ట్రాలకు ఉంది.

ఇక, వార్షిక బడ్జెట్ కేటాయింపుల విషయానికొస్తే, పథకాల అమలులో సంభవించే నష్టాలను భర్తీ చేయడం దీని ఉద్దేశ్యం. అదేవిధంగా వాస్తవ అవసరాల ఆధారంగా దీన్ని సవరించడం జరుగుతుంది. 

కనీస మద్దతు ధర (ఎం.ఎస్.పి) వద్ద పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కొబ్బరి కొనుగోలు కోసం ఎన్.ఏ.ఎఫ్.ఈ.డి., ఎఫ్.సి.ఐ. వంటి కేంద్ర ప్రభుత్వ నోడల్ సంస్థలకు ప్రభుత్వం, పి.ఎస్.ఎస్. కింద, ప్రభుత్వ హామీ మొత్తాన్ని 40,500 కోట్ల రూపాయల మేర నగదు ఋణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది.   రైతులకు ఎం.ఎస్.పి. మొత్తాన్ని చెల్లించడానికి, పి.ఎస్.ఎస్. కార్యకలాపాలకు సంబంధించిన ఇతర యాదృచ్ఛిక ఖర్చుల కోసం ప్రభుత్వ హామీ మేరకు అవసరమైన నిధులను కేంద్ర నోడల్ సంస్థలు  వినియోగించుకుంటాయి. 

 

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈరోజు లోక్‌సభకు సమ్పరించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు. 

*****

 


(Release ID: 1814005)
Read this release in: English , Urdu , Gujarati