వ్యవసాయ మంత్రిత్వ శాఖ
డిజిటలైజ్ వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ
Posted On:
05 APR 2022 4:07PM by PIB Hyderabad
"ఇండియా డిజిటల్ ఎకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐడిఈఏ)" నివేదికను ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా డిపార్ట్‌మెంట్ ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. టాస్క్ ఫోర్స్ సబ్జెక్ట్ నిపుణులు, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సామాన్య ప్రజల నుండి సలహాలను ఆహ్వానించింది. వాటిని పరిగణలోకి తీసుకుని డిపార్ట్‌మెంట్ దేశంలో అగ్రిస్టాక్‌ను రూపొందించడానికి ఒక విధాన చట్రాన్ని ఖరారు చేసే ప్రక్రియలో ఉంది, ఇది రైతుల ఆదాయాన్ని పెంచడానికి మరియు వ్యవసాయ రంగం సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి డిజిటల్ టెక్నాలజీల ద్వారా వినూత్న వ్యవసాయ-కేంద్రీకృత పరిష్కారాలను రూపొందించడానికి పునాదిగా ఉంటుంది. ఖరారు చేసిన తర్వాత, రైతుల ఆదాయాన్ని పెంచడానికి మరియు దేశంలో వ్యవసాయ రంగం యొక్క వ్యవసాయ సామర్థ్యం/సమర్థతను మెరుగుపరచడానికి ప్రభావవంతంగా దోహదపడేలా ఉపయోగపడుతుంది.
ఈ విషయంలో, ప్రముఖ సాంకేతికత/అగ్రి-టెక్/స్టార్ట్-అప్‌ల కంపెనీలు కొన్నిటిని గుర్తించారు. వాటి ద్వారా జిల్లాలు/గ్రామాల డేటా ఆధారంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరించడానికి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్‌లను (పిఓసి) అభివృద్ధి చేయడానికి ఆహ్వానించారు. డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ ద్వారా అవగాహన ఒప్పనడం (ఎంఓయూ)కి ప్రకటన ఇవ్వడం జరిగింది. పూర్తిగా ప్రో బోనో ప్రాతిపదికన అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి మరియు పిఓసిలను అభివృద్ధి చేయడానికి కంపెనీలను ఆహ్వానించారు. అందుబాటులో ఉన్న డేటాను ఉపయోగించి నిర్మించగల అగ్రిస్టాక్ మరియు సర్వీస్ & సొల్యూషన్‌ల ఉపయోగాలను అర్థం చేసుకోవడంలో ఈ పిఓసిలు సహాయపడతాయి. వాటిలో రైతులకు ప్రయోజనకరంగా ఉంటే అటువంటి సంస్థలను జాతీయ స్థాయిలో వరకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో, ఎంపిక చేసిన జిల్లాలు/గ్రామాలలో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ (పిఓసిల)పై పని చేయడానికి ప్రభుత్వం ప్రముఖ టెక్నాలజీ/అగ్రి-టెక్ ప్లేయర్స్ & స్టార్ట్-అప్‌లతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
(Release ID: 1814002)