ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన తాజా స‌మాచారం

Posted On: 05 APR 2022 3:40PM by PIB Hyderabad

ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) కింద 31 మార్చి, 2022 నాటికి
మొత్తం 17.9 కోట్ల మందికి ఆయుష్మాన్ కార్డ్‌లు అందించబడ్డాయి. ఇందులో రాష్ట్రాలు తమ సొంత ఐటీ వ్యవస్థలను ఉపయోగించి జారీ చేసిన 4.68 కోట్ల కార్డులు కూడా ఉన్నాయి. ఈ పథ‌కం కింద 3.28 కోట్లకు పైగా ఆసుపత్రి చేరిక‌లు ఉన్నాయి. దాదాపు  25,800 కంటే ఎక్కువ ఎంపానెల్డ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ల నెట్‌వర్క్ ద్వారా రూ. 37,606 కోట్ల మొత్తం ఈ పథకం కింద అధీకృతం చేయబడ్డాయి.  ఆయా రాష్ట్రాలు మ‌రియు కేంద్ర‌పాలిత ప్రాంతాల  వారీగా  సంవత్సరాల‌ వారీగా వాటి వివరాలు ఈ కింది అనుబంధంలో పేర్కొన‌బ‌డినాయి.  ఒడిశా,   ఢిల్లీ రాష్ట్రం/ యూటీ ఈ పథకంలో చేరలేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్ర‌భుత్వం  జనవరి, 2019లో ఈ పథకం నుండి ఉపసంహరించుకుంది. ఈ ఆరోగ్య సంరక్షణ సేవలను లబ్ధిదారులు సొంతంగా పొందినట్లయితే, దాని వల్ల ఖర్చు చేసిన ఖర్చు కంటే 1.5 నుండి 2 రెట్లు ఎక్కువ మొత్తం ఆ వ్య‌క్తి చేతుల మీదుగా ఖర్చు అవుతుంది. ఈ  ఖర్చును తగ్గించడానికి వీలుగా ఈ పథకం విజయవంతంగా దోహదపడింది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన‌ లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలియ‌జేశారు. 

***

 


(Release ID: 1814000)
Read this release in: English , Urdu , Manipuri