ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామాల‌లో వైద్యులు ప్రాక్టీసు చేయ‌డాన్ని ప్రోత్స‌హించేందుకు తీసుకున్న చ‌ర్య‌లు

నాడు పోస్టు చేయడమైనది: 05 APR 2022 3:38PM by PIB Hyderabad

ప్ర‌జారోగ్యం, ఆసుప‌త్రులు అన్న‌ది రాష్ట్ర జాబితాలోని అంశం, క‌నుక, గ్రామీణ ప్రాంతాలు స‌హా ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌లోపేతం చేసే బాధ్య‌త ఆయా రాష్ట్ర‌/  కేంద్ర ప్ర‌భుత్వాల‌పై ఉంటుంది. అయితే, త‌మ మొత్తం వ‌న‌రుల కోశం ప‌రిధిలో   ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేష‌న్ ప్లాన్ల‌లో (కార్య‌క్ర‌మ అమ‌లు ప్ర‌ణాళిక‌లు -పిఐపిలు)ల ఆధానంగా అవ‌స‌రాన్ని బ‌ట్టి  వైద్యుల నియామ‌కం స‌హా  త‌మ ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌లోపేతం చేసుకునేందుకు కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ జాతీయ ఆరోగ్య మిష‌న్ కింద రాష్ట్రాలు/  కేంద్ర‌పాలిత‌ప్రాంతాలకు ఆర్థిక‌, సాంకేతిక తోడ్పాటును అందిస్తుంది. 
దేశంలోని గ్రామీణ‌, మారుమూల ప్రాంతాల్లో వైద్యులు త‌మ ప్రాక్టీసు చేప‌ట్ట‌డాన్ని ప్రోత్స‌హించేందుకు ఎన్‌హెచ్ఎం అందించే వివిధ ప్రోత్స‌హ‌కాలు, గౌర‌వ వేత‌నాల వివ‌రాలు దిగువ‌న ఇవ్వ‌డం జ‌రిగిందిః 
గ్రామీణ‌, మారుమూల ప్రాంతాల‌లో ప‌ని చేసే స్పెష‌లిస్టు డాక్ట‌ర్ల‌కు ఆ ప్రాంతాల‌లోని ప్ర‌జారోగ్య కేంద్రాల‌లో ప‌ని చేయ‌డం ఆక‌ర్ష‌ణీయంగా ఉండేందుకు హార్డ్ ఏరియా అల‌వెన్సు (క‌ఠిన ప్రాంతాల భ‌త్యం), నివాస గృహాలు.
గ్రామీణ & మారుమూల ప్రాంతాల‌లో సిజేరియ‌న్ ఆప‌రేష‌న్ల‌ను నిర్వ‌హించ‌డానికి స్పెష‌లిస్టుల అందుబాటును పెంచేందుకు గైన‌కాలజిస్టులు/ ఎమ‌ర్జెన్సీ ఆబ్స్టెట్రిక్ కేర్ (ఇఎంఒసి)లో శిక్ష‌ణ పొందిన‌వారికి, పీడియాట్రీషియ‌న్లు & అనెస్థిటిస్టులు/  లైఫ్ సేవింగ్ అనెస్థీషియా స్కిల్స్ (ఎల్ఎస్ఎఎస్‌)లో శిక్ష‌ణ పొందిన వైద్యుల‌కు గౌర‌వ వేత‌నం. 
వైద్యుల‌కు ప్ర‌త్యేక ప్రోత్సాహ‌కాలు, ఎఎన్‌సి చెక‌ప్‌లు క్ర‌మంత‌ప్ప‌కుండా జ‌రిగేలా చూసి, వాటిని న‌మోదు చేసేందుకు ఎఎన్ఎంల‌కు ప్రోత్సాహ‌కాలు, అడాల‌సెంట్ రిప్రొడ‌క్టివ్ & సెక్యువ‌ల్ హెల్త్ యాక్టివిటీస్‌కు ప్రోత్సాహ‌కాలు.
స్పెష‌లిస్టుల‌ను ఆక‌ర్షించేందుకు మీరు చెప్పండి, మేం చెల్లిస్తాం (“You Quote We Pay”) వంటి వ్యూహాల‌లో స‌ర‌ళ‌త స‌హా చ‌ర్చించ‌ద‌గిన జీతాలు అందించేందుకు రాష్ట్రాల‌కు అనుమ‌తి. 
క్లిష్ట‌మైన ప్రాంతాలలో సేవ‌లందిస్తున్న సిబ్బందికి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్ర‌వేశంలో ప్రాధాన్య‌త క‌ల్పించ‌డం వంటి విత్తేత‌ర ప్రోత్సాహ‌కాల‌నే కాక, గ్రామీణ ప్రాంతాల‌లో వారికి గృహ వ‌స‌తి ఏర్పాటును కూడా ఎన్‌హెచ్ఎం కింద ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది.
స్పెష‌లిస్టుల కొర‌త‌ను అధిగ‌మించేందుకు, ఎన్‌హెచ్ఎం కింద వైద్యులు బ‌హుళ నైపుణ్యాల‌ను ప్ర‌ద‌ర్శించేందుకు తోడ్పాటు. ఆరోగ్య ప‌రిణామాల‌లో మ‌రింత మెరుగైన  ఫ‌లితాల‌ను సాధించేందుకు ఎన్‌హెచ్ఆర్ఎం కింద ఉనికిలో ఉన్న హెచ్ఆర్‌లో నైపుణ్యాల ఆధునికీక‌ర‌ణ (స్కిల్ అప్‌గ్ర‌డేష‌న్‌). 
ఎన్ఎంసి చ‌ట్టం, 2019లోని సెక్ష‌న్ (51) ప్ర‌కారం, రాష్ట్రంలోని గ్రామీణ‌/  మారుమూల / క‌ఠిన ప్రాంతాల‌లో ప‌ని చేస్తున్న వారుపిజి మెడిక‌ల్ కోర్సుల‌లో ప్ర‌వేశించేందుకు నీట్ (పిజి)లో వారికి సంవ‌త్స‌రానికి 10%  నుంచి గ‌రిష్టంగా 30% వ‌ర‌కు ప్రోత్సాహ‌కాల మార్కుల‌ను అందించేందుకు భార‌త జాతీయ మెడిక‌ల్ క‌మిష‌న్ నిబధ‌న‌ల‌ను విధించింది. అంతేకాకుండా, గ్రామీణ‌/ క‌ఠిన ప్రాంతాల‌లో ప‌ని చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఇన్‌-స‌ర్వీస్ మెడిక‌ల్ డాక్ట‌ర్ల‌కు మెడిక‌ల్ డిప్లొమా సీట్ల‌లో 50% రిజ‌ర్వేష‌న్లు. 
రాజ్య‌స‌భ‌లో మంగ‌ళ‌వారం అడిగిన ప్ర‌శ్న‌కు ఇచ్చిన లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ స‌హాయ మంత్రి డాక్ట‌ర్ భార్తీ ప్ర‌వీణ్ ప‌వార్ వెల్ల‌డించారు. 


(రిలీజ్ ఐడి: 1813996) సందర్శకుల సూచీ సంఖ్య : : 162
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , Bengali