సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏడు రోజుల పాటు సాగి హైదరాబాద్ లో ఘనంగా ముగిసిన ఏడో 'రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ '


"మన కళారూపాలను పరిరక్షించి మన సంప్రదాయం మరియు వారసత్వాన్ని ప్రచారం చేసి, కళాకారులు వారి కాళ్లపై వారు నిలబడేలా చూసేందుకు వారికి అవసరమైన ఆర్థిక సహకారం సకాలంలో అందించి, ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించాలి" : ఉపరాష్ట్రపతి, శ్రీ ఎం. వెంకయ్యనాయుడు

“మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడానికి మరియు జాతి నిర్మాణం కోసం మనల్ని మనం పునరంకితం చేసుకోవడానికి ఉత్సవాలు అవకాశం కల్పించాయి ”: తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్

“రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం దేశ విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచింది. ఈ వైవిధ్యం మనమంతా భారతీయులమనే వాస్తవాన్ని మరోసారి బలపరుస్తుంది”: హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ

"భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ 2047 నాటికి ప్రపంచ అగ్రగామిగా నిలుస్తుంది ": తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్‌ఎన్ రవి

“గత 2 సంవత్సరాలుగా కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దెబ్బతిన్న కళాకారులందరికీ భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కళాకారులకు అండగా నిలవాలి"

Posted On: 04 APR 2022 4:07PM by PIB Hyderabad

ముఖ్య అంశాలు:

* సినిమా లోని "సి"ని మిగిలిన మూడు "సి"లు అయిన సంస్కృతి, కళ, వంటకాలకు అదనంగా నాల్గో "సి"గా పరిగణించాలి: కేంద్ర పర్యాటక శాఖ (ఐ/సి) మాజీ మంత్రి, ప్రముఖ నటుడు,          రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం బ్రాండ్ అంబాసిడర్,   పద్మభూషణ్ డాక్టర్ కే. చిరంజీవి 

·         రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం తొలిసారిగా తెలుగు రాష్ట్రాలకు రావడం  తెలుగు సాహిత్యంసంస్కృతి కి గర్వకారణం. రాజమహేంద్రవరం కళలకు నిలయం :  పార్లమెంట్ మాజీ సభ్యులు  ప్రముఖ సినీ నటుడురాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం బ్రాండ్ అంబాసిడర్  డాక్టర్  మంచు మోహన్ బాబు. 

·         "మరింత ప్రాచుర్యం కల్పించేందుకు  అన్ని జిల్లాల్లో రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్‌ను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ": పార్లమెంట్ మాజీ సభ్యులు, ప్రముఖ నటి, రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం బ్రాండ్ అంబాసిడర్ శ్రీమతి. ఎం విజయశాంతి 

                                                                            ---

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహించిన 12వ  రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ (ఆర్ ఎస్ ఎం ) ఏప్రిల్ 3వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా ముగిసాయి. వారం రోజుల పాటు సాగిన ఈ మహోత్సవం  మార్చి 26, 27 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో రెండు రోజుల పాటు జరిగిన కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు  మార్చి 29, 30 తేదీల్లో వరంగల్‌ లో జరిగాయి. ఏప్రిల్ 1న హైదరాబాద్ లో ప్రారంభమైన ఉత్సవాలు 3వ తేదీన ఘనంగా ముగిసాయి. 

భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు తో సహా పలువురు ప్రముఖులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్  తమిళనాడు గవర్నర్  శ్రీ ఆర్ ఎన్  రవి;కేంద్ర సాంస్కృతికపర్యాటక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ  మంత్రిశ్రీ జి కిషన్ రెడ్డికేంద్ర సాంస్కృతిక మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్,  కేంద్ర సాంస్కృతికవిదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

 పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి ఆనంద శంకర్ జయంత్ తో సహా వివిధ కళాకారులు, ప్రముఖ  శాస్త్రీయ సంగీత ప్రదర్శకులు శ్రీ పి. జయ భాస్కర్డా. ఎల్ సుబ్రమణ్యంప్రముఖ సంగీత కళాకారులు శంకర్-ఈషాన్-లాయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2015 నుంచి కేంద్ర సాంస్కృతిక శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ  రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాలను నిర్వహిస్తోంది. కార్యక్రమాల నిర్వహణలో ఏడు మండల సాంస్కృతిక కేంద్రాలు చురుగ్గా పాల్గొని సహకారం అందించాయి. దేశ వారసత్వం లో భాగంగా ఉన్న సంస్కృతి, కళలు, ఆహార సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా  12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం జరిగింది. ఘనమైన భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ఆడిటోరియంలు మరియు గ్యాలరీ కి పరిమితం చేయకుండా ప్రజల్లోకి తీసుకుని వెళ్లే అంశంలో రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం  కీలక పాత్ర పోషిస్తోంది.

ప్రతిష్టాత్మకమైన "ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్"  లక్ష్యాన్ని సాధించడానికి మరియు అదే సమయంలో కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు  సమర్థవంతమైన వేదిక ను  అందించడంతో పాటు ఒక రాష్ట్రానికి చెందిన జానపద మరియు గిరిజన కళలునృత్యంసంగీతంవంటకాలు మరియు సంస్కృతిని  ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శించడంలో ఈ ఉత్సవం ప్రధానమైన వేదికగా రూపుదిద్దుకుంది. ప్రదర్శనల ద్వారా కళాకారులు, చేతివృత్తుల కళాకారులకు జీవనోపాధి కల్పించాలన్న లక్ష్యంతో కార్యక్రమాలను రూపొందించడం జరిగింది.  ఢిల్లీవారణాసిబెంగళూరుతవాంగ్గుజరాత్కర్ణాటకతెహ్రీమధ్యప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ వంటి వివిధ రాష్ట్రాలు మరియు నగరాల్లో 2015 నవంబర్  నుంచి ఇప్పటి వరకు 11 రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాలు  జరిగాయి.

తొలిసారిగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన  రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాలకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. 12వ  రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాలలో 10 పద్మ అవార్డు గ్రహీతలు, బ్రాండ్ అంబాసిడర్‌లు పాల్గొనడమే కాకుండా ప్రదర్శనలు కూడా ఇచ్చారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఉత్సవాలలో సన్మానించడం జరిగింది. 

రంగస్థల ప్రదర్శనలు

 జానపద మరియు గిరిజన కళలునృత్యంసంగీతంవంటకాలు, సంస్కృతి,  చేతివృత్తుల  కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి  జీవనోపాధి పొందేలా చూసేందుకు  రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం ఒక  సమర్థవంతమైన వేదికగా నిలిచింది. సుమారు 1000 మంది కళాకారులుపాక కళాకారులు మరియు కళాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు.  భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించారు.

   సరికొత్త   దృక్పథంతో సాగిన   12వ  రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం   మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. కోవిడ్-19   కళాకారులుముఖ్యంగా జానపద కళాకారుల జీవనోపాధిపై  తీవ్ర ప్రభావాన్ని చూపింది. కోవిడ్ -19 మహమ్మారి నుంచి   బయట పడుతున్న నేపథ్యంలో   12వ  రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం జరిగింది . ఈ కార్యక్రమం ద్వారా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులకు  అవసరమైన సహాయ సహకారాలను అందించగలిగింది. శోభా యాత్రలు నిర్వహించడం మరియు వేదికపై స్థానిక ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన  కళాకారులకు సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చెందుతున్న కార్యక్రమాలకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మద్దతు సమీకరించడంలో 12వ  రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం విజయం సాధించింది. 

ఇటీవల మరణించిన  భారతరత్న అవార్డు గ్రహీత శ్రీమతి లతా మంగేష్కర్ కి,   100వ జన్మదినోత్సవం సందర్భంగా దిగ్గజ తెలుగు సంగీత దర్శకుడు  పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు, 2020లో మరణించిన పద్మవిభూషణ్   ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం,  2021లోమరణించిన  పద్మశ్రీ  సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి   ప్రముఖ కళాకారులకు  ఘనంగా నివాళులు అర్పించే అవకాశాన్ని 12వ  రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం కల్పించింది.  

మహోత్సవంలో కింది సంప్రదాయాలలో  540 మంది జానపద కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు:

1.    లడఖ్ నుంచి  షాండోల్

2.    మహారాష్ట్రకు చెందిన లావాణి

3.    మధ్యప్రదేశ్‌కు చెందిన రాయ్‌

4.    తెలంగాణకు చెందిన లంబాడీ

5.    జార్ఖండ్‌కు చెందిన కర్షా

6.    జమ్మూ కాశ్మీర్ నుంచి  రౌఫ్

7.    ఉత్తరప్రదేశ్‌కు చెందిన నోర్టా

8.    బీహార్‌కు చెందిన జాట్-జతిన్

9.    నాగాలాండ్‌కు చెందిన సంగతం నాగ

10. రాజస్థాన్ నుండి ఘరాసియా నృత్యం

11. మధ్యప్రదేశ్‌కు చెందిన బధాయి

12. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మయూర్ నృత్యం

13. ఉత్తరాఖండ్ నుంచి  జాగోర్

14. త్రిపురకు చెందిన సంగ్రాయ్ మోగ్

15. మిజోరం   నుంచి    చెరో

16. మణిపూర్ నుంచి లై హరోబా

17. అస్సాంకు చెందిన బర్దోషిఖాలా

18. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన గుంటి

19. గుజరాత్  నుంచి డాంగి రోమ్

20. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పైదండ

21. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సిర్మోరి నాటి

22. మేఘాలయ   నుంచి    కా షాద్ మస్తీ

23. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పంతీ

24. ఒడిసాకు చెందిన సంబల్‌పురి

25. గుజరాత్‌కు చెందిన సిద్ధి ధమాల్

26. పశ్చిమ బెంగాల్‌కు చెందిన చౌ

కళల ప్రదర్శన శాలలు మరియు ప్రదర్శనలు

 భారతదేశం వివిధ ప్రాంతాలకు చెందిన   కళల ప్రదర్శన శాలలు మరియు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వీటితో  పాటు, తెలుగు స్వాతంత్ర్య సమరయోధులు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామ రాజు పై     హైదరాబాద్‌లోని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ  ప్రాంతీయ ఔట్‌రీచ్ బ్యూరో ప్రదర్శనలు   ఏర్పాటు చేశాయి.   మాడేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో చిత్రలేఖన ప్రదర్శన జరిగింది.

 

***


(Release ID: 1813496) Visitor Counter : 180


Read this release in: English , Urdu , Hindi