పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భోపాల్-చెన్నై మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం

Posted On: 30 MAR 2022 11:49AM by PIB Hyderabad

పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి (జనరల్) డాక్టర్ వి.కే. సింగ్ (రిటైర్డ్)  భోపాల్ -చెన్నై మధ్య నేరుగా ప్రయాణం చేసే ఇండిగో విమానాన్నినిన్న ప్రారంభించారు.

 

 

ప్రారంభ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ, సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్య, భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ & రిహాబిలిటేషన్ మంత్రి శ్రీ విశ్వాస్ సారంగ్, ,  భోపాల్ పార్లమెంటు సభ్యురాలు సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, చెన్నై నార్త్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ వీరస్వామికళానిధిపౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ బన్సాల్, అనేక ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 

ఈ ఎయిర్‌లైన్ 150-సీటర్ ట్విన్ టర్బోఫ్యాన్ ఇంజన్ ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఏ320ని ప్రారంభ విమానంగా నడిపింది. దీనిని ప్రధానంగా దేశీయ మార్గాల్లో ఉపయోగిస్తారు. ఈ కొత్త విమాన ప్రారంభంతో, భోపాల్ నుండి సగటున 10 రోజువారీ విమానాలు నడుస్తాయి. అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి 44 రోజువారీ డిపార్చర్ ఫ్లైట్ లు ఉంటాయి.

ఈ సందర్భంగా శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా మాట్లాడుతూ, '' దేశానికే కేంద్ర బిందువైన భోపాల్, అభివృద్ధి, వ్యాపారం, పురోగతితో పాటు ధార్మిక మనోభావాలతో ముడిపడి ఉన్న చెన్నై కేంద్రంతో అనుసంధానం కావడం అదృష్టం. గతంలో జూలై 2021 నుండి 5 నగరాలతో అనుసంధానించబడిన భోపాల్ ఇప్పుడు 10 నగరాలు బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, ప్రయాగ్‌రాజ్, ఆగ్రా, అహ్మదాబాద్, రాయ్‌పూర్ మరియు చెన్నైతో అనుసంధానించబడి ఉంది - . భోపాల్ నుండి వారపు విమానాల సంఖ్య కూడా 94 నుండి 216కి పెరిగింది, ఇది 150% పెరుగుదల" అని అన్నారు. 

 

 

 

ఖజురహోలో కొత్త ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్ ప్రారంభం అవుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇటీవల ఖజురహో ఢిల్లీతో అనుసంధానం అయిందని, ఇండోర్‌లో, అంతర్జాతీయ కార్గో సదుపాయం ఇప్పటికే ప్రారంభం అయింది. సంవత్సరాంతానికి దేశీయ కార్గో సౌకర్యం ఏర్పాటవుతుంది.  గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఆధారంగా ఇండోర్ ఎయిర్‌పోర్ట్‌ను ఎలా విస్తరించాలనే దానిపై కూడా తాము రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గ్వాలియర్, సత్నా, జబల్‌పూర్, ఇండోర్, భోపాల్‌లలో 5 డ్రోన్ పాఠశాలలను మంత్రిత్వ శాఖ మంజూరు చేసిందని ఆయన తెలిపారు. 

చెన్నై 2వ విమానాశ్రయం పనుల గురించి శ్రీ సింధియా మాట్లాడుతూ “ చెన్నైలో 2వ విమానాశ్రయం నిర్మించడానికి కట్టుబడి ఉన్నాము. దేశాల్లోని మా మెట్రోలకు 2వ విమానాశ్రయం అవసరం.  రూ.38 వేల కోట్లతో ఢిల్లీ కోసం జేవార్‌లో రెండో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నాం. ముంబైలో రెండో విమానాశ్రయాన్ని నవీ ముంబైలో రూ.17,000 కోట్లతో నిర్మిస్తున్నారు. చెన్నై కోసం రాష్ట్ర ప్రభుత్వం 4 స్థలాలను మంత్రిత్వ శాఖకు సూచించింది. ఆ 4 స్థలాల నుండి, మేము 2 స్థలాలను ఎంచుకున్నాము మరియు తుది స్థలం కోసం సమాధానం కోసం వేచి చూస్తున్నాం" అని అన్నారు.

 

 

డాక్టర్ వీకే సింగ్ మాట్లాడుతూ, “ఇటీవలి కాలంలో, మధ్యప్రదేశ్ వివిధ ప్రదేశాలకు మరియు వాటి నుండి వివిధ పథకాల కింద అనేక విమానాలు అందుబాటులోకి వచ్చాయి, ముఖ్యంగా ప్రధాన నగరాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు కలుపుతోంది." అని అన్నారు. 

 

విమానాల షెడ్యూల్: 

 

వరుస సంఖ్య 

బయల్దేరు నగరం 

గమ్యం 

ఎయిర్లైన్ 

ఫ్రీక్వెన్సీ 

బయల్దేరు సమయం (గంటలు)

చేరుకునే సమయం (గంటలు)

ఎయిర్క్రాఫ్ట్ టైప్ 

1

చెన్నై 

భోపాల్ 

ఇండిగో 

3

1725

1935

ఏ320

2

భోపాల్ 

చెన్నై 

ఇండిగో 

3

2005

2240

ఏ320

 

*****


(Release ID: 1811348) Visitor Counter : 164