సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

జి.డి.పి. గణనీయమైన సహకారం అందిస్తున్న ఎం.ఎస్.ఎం.ఈ. లను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్న - శ్రీ నారాయణ్ రాణే

నాడు పోస్టు చేయడమైనది: 29 MAR 2022 3:42PM by PIB Hyderabad

జి.డి.పి. వృద్ధికి గణనీయమైన సహకారాన్ని అందజేస్తున్న ఎం..ఎస్.ఎం.ఈ. లను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, కేంద్ర ఎం..ఎస్.ఎం.ఈ. శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే పేర్కొన్నారు.  ఎం.ఎస్.ఎం.ఈ. పోటీతత్వం మరియు వృద్ధిపై సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎం.ఎస్.ఎం.ఈ.లు) మరియు భారత వ్యవస్థాపకత అభివృద్ధి సంస్థ (ఈ.డి.ఐ.ఐ) నిర్వహించిన రెండు రోజుల మెగా సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ,  దేశ జి.డి.పి. లో ఎమ్మెస్.ఎస్.ఎం.ఈ. ల ప్రాముఖ్యత గురించి ప్రముఖంగా పేర్కొన్నారు.  చాలా కాలంగా, ఎం.ఎస్.ఎం.ఈ. లు కనీస వనరులతో పనిచేస్తున్నాయని, అయినప్పటికీ దేశ జి.డి.పి.కి గణనీయమైన సహకారం అందిస్తున్నాయని ఆయన అన్నారు.  అందువల్ల, ఈ విధంగా వృద్ధిని పెంపొందిస్తున్న రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, మంత్రి సూచించారు.   ఇందులో భాగంగా ఈ రంగాన్ని ఖచ్చితంగా బలోపేతం చేయడం కోసం గణనీయమైన సమిష్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎం.ఎస్.ఎం.ఈ. లకు అనేక నూతన అవకాశాలు కల్పిస్తూ, ప్రభుత్వం వివిధ పథకాలు రూపొందించి అమలు చేస్తోందని ఆయన తెలియజేశారు.  ఎం.ఎస్.ఎం.ఈ. రంగానికి ఆర్థిక సంస్థల నుండి ఎటువంటి అవరోధం లేకుండా రుణ సదుపాయం;  అభివృద్ధి, ఆధునికీకరణకు సాంకేతిక మద్దతు;  ఎగుమతి మార్కెట్ల సౌలభ్యం;  మౌలిక సదుపాయాలు;  శిక్షణ, సామర్థ్య నిర్మాణ సౌకర్యం;  కార్మికుల సంక్షేమం వంటి అంశాలు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం హామీ ఇస్తోందని,  ఆయన ఈ సందర్భంగా వివరించారు.

ఎం.ఎస్.ఎం.ఈ. శాఖ సహాయ మంత్రి (ఎం.ఓ.ఎస్), శ్రీ భాను ప్రతాప్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యవస్థాపకత, అంకుర సంస్థలు, ఆవిష్కరణలు, ఎం.ఎస్.ఎం.ఈ. లపై దృష్టి సారిస్తున్న భారతదేశం, ఆసక్తికరమైన ఆర్థిక నిర్ణయాలు, వ్యూహాల కారణంగా చెప్పుకోదగినంత  తక్కువ సమయంలో మంచి స్థానంలో ఉందని, పేర్కొన్నారు.  గుర్తించదగిన ఆర్థిక వృద్ధి,  ముఖ్యంగా తీవ్రమైన మహమ్మారి పరిస్థితుల అనంతరం, ఎం.ఎస్.ఎం.ఈ. అభివృద్ధికి, పునరుద్ధరణకు నిదర్శనమని, ఆయన అన్నారు.  ఎం.ఎస్.ఎం.ఈ. రంగంలో వృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని భావించడం, ప్రకటించడం సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రజా జీవన విధానంలో అనేక విధాలుగా వ్యక్తమవుతున్న ప్రగతిశీల మార్పులే దీనికి ప్రధాన కారణమని, ఆయన పేర్కొన్నారు. 

భారత వ్యవస్థాపకత అభివృద్ధి సంస్థ (ఈ.డి.ఐ.ఐ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునీల్ శుక్లా, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్దిష్ట సమూహాల అభివృద్ధి; శిక్షణ, సామర్థ్య నిర్మాణం;  పరిశోధన, విధాన పరమైన న్యాయవాదం వంటి అనేక ముఖ్యమైన అంశాలపై కార్యక్రమాలు, ప్రాజెక్టు ల విషయంలో ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖతో, ఈ.డి.ఐ.ఐ. సన్నిహితంగా వ్యవహరిస్తోందని తెలియజేశారు.    తగిన అర్ధవంతమైన వ్యూహాలతో ఎం.ఎస్.ఎం.ఈ. రంగానికి సంబంధించిన విధానాలను మరింతగా పెంపొందించి, విస్తరించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని కూడా ఆయన ప్రకటించారు. 

రెండు రోజుల సదస్సులో, ఎం.ఎస్.ఎం.ఈ. రంగంలో మెరుగుదలలు, సవాళ్లు, వృద్ధి అవకాశాలపై మేధోమథన సదస్సులు, ప్యానెల్ చర్చలు జరుగుతాయి.  అదేవిధంగా, భారతదేశం, సింగపూర్, పెరూ, లావో పి.డి.ఆర్, రువాండా, మయన్మార్, రష్యా, ఉజ్బెకిస్తాన్, స్పెయిన్, ఇరాన్‌ లకు చెందిన ఉపన్యాసకులు, నిపుణులు శిఖరాగ్ర సమావేశంలో తమ అనుభవాలను పంచుకుంటారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, విధాన రూపకర్తలు, పరిశ్రమల అధిపతులు, ఆలోచనాపరులు, వ్యాపార మండళ్ళు, పరిశ్రమ సంఘాలు, అంకుర సంస్థలు, సామాజిక ప్రభావ సంస్థలు, ఎం.ఎస్.ఎం.ఈ. లతో పాటు స్వయం సహాయ బృందాలు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. 

"కోవిడ్-19 మహమ్మారి నెలకొన్న పరిస్థితుల్లో ఎం.ఎస్.ఎం.ఈ. రంగంలో సవాళ్లు, అవకాశాలు";  "ఎం.ఎస్.ఎం.ఈ. వృద్ధిలో ఇంక్యూబేషన్  / వేగంగా అభివృద్ధి చెందడం"; "ఎం.ఎస్.ఎం.ఈ. పోటీతత్వం లో అనుకూల విధానాలు, ఆర్థికేతర వ్యాపార అభివృద్ధి సేవల పాత్ర"; "స్థిరత్వాన్ని సాధించడానికి ఏ.ఎస్.ఎం.ఈ. కన్సార్టియం లో ఎలా పని చేయవచ్చు", వంటి విషయాలపై ఈ సదస్సు సందర్భంగా నిపుణులు చర్చిస్తారు. 'ఎం.ఎస్‌.ఎం.ఈ.రంగ అభివృద్ధి నేపథ్యంలో ప్రజలు, భూగోళం, లాభం' అనే అంశంపై ప్రత్యేక ప్యానెల్ చర్చ జరగనుంది.  ఈ చర్చలు ప్రధానంగా ఎం.ఎస్.ఎం.ఈ. ల పోటీతత్వం; భారతీయ ఎం.సేమ్.ఈ. ల అంతర్జాతీయీకరణ; సాంకేతికత మరియు ఆవిష్కరణలు;  ఎం.ఎస్.ఎం.ఈ. ల డిజిటల్ పరివర్తన;  వ్యవస్థాపకత పర్యావరణ వ్యవస్థ మరియు ఎం.ఎస్.ఎం.ఈ. రంగంలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలు; స్త్రీ, పురుషులు, వెనుకబడిన వర్గాల వ్యవస్థాపకత; అనే అంశాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తాయి.

 

*****


(రిలీజ్ ఐడి: 1811323) సందర్శకుల సూచీ సంఖ్య : : 169
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Marathi , Malayalam