శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఢిల్లీలోని పృథ్వీ భవన్‌లో సైన్స్ సెక్రటరీలందరితో సంయుక్త సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


డాక్టర్ జితేంద్ర సింగ్ నేషనల్ సైన్స్ కాన్క్లేవ్ ముసాయిదా ఎజెండా, సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ (ఎస్టీఐపీ) ముసాయిదాతో పాటు ఇతర సమస్యలపై సాధించిన పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు.



గత సమావేశంలో గుర్తించిన 16 చర్యలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్)ని సమీక్షిస్తూ డాక్టర్ సింగ్ వివిధ విభాగాలకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.



ప్రతిపాదిత నేషనల్ సైన్స్ కాన్క్లేవ్‌లో రాష్ట్రాలు, పరిశ్రమల ప్రతినిధులు ఇతర వాటాదారులతో కూడిన నేపథ్య రాష్ట్ర -నిర్దిష్ట చర్చలను చేర్చాలని సూచించబడింది



వివిధ విభాగాల ఏకీకరణ, అతివ్యాప్తి చెందుతున్న కార్యకలాపాలను నివారించడం వలన ప్రతి విభాగం నుంచి మెరుగైన ఉత్పాదకత ఖచ్చితంగా ఉంటుంది



స్టార్టప్‌లు వచ్చేదాకా ఎదురుచూడకుండా వాటి కోసం వేటాడి వెతకాలని డాక్టర్ సింగ్ హాజరైన అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు.



ఫెలోషిప్‌ల పంపిణీలో జాప్యం లేకుండా చూడాలి అధికారులను ఆదేశించారు

Posted On: 28 MAR 2022 5:36PM by PIB Hyderabad

కేంద్ర సైన్స్ & టెక్నాలజీ  సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఎర్త్ సైన్సెస్, పీఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ  స్పేస్ శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఢిల్లీలోని పృథ్వీ భవన్‌లో సైన్స్ డిపార్ట్‌మెంట్ల సెక్రటరీల నెలవారీ సమావేశానికి అధ్యక్షత వహించారు.

 

ఈ సందర్భంగా ఫిబ్రవరి 16న జరిగిన చివరి సమావేశంలో చర్చించిన అనేక ఇతర అంశాలపై సాధించిన పురోగతితో పాటు నేషనల్ సైన్స్ కాన్క్లేవ్ ముసాయిదా ఎజెండా, సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ (ఎస్టీఐపీ) ముసాయిదాను కేంద్ర మంత్రి క్షుణ్ణంగా సమీక్షించారు.  గత సమావేశంలో గుర్తించిన 16 చర్యలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్)ని సమీక్షిస్తూ ఆయన వివిధ విభాగాలకు అనేక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ప్రతిపాదిత నేషనల్ సైన్స్ కాన్క్లేవ్ ముసాయిదాను సమీక్షిస్తూ, రాష్ట్రాలు, పరిశ్రమల ప్రతినిధులు  ఇతర వాటాదారులతో కూడిన కాన్క్లేవ్లో నేపథ్య (థీమాటిక్),  రాష్ట్ర-నిర్దిష్ట చర్చలను చేర్చవచ్చని డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. వివిధ విభాగాలను ఏకీకృతం చేయడం,  అతివ్యాప్తి చెందే కార్యకలాపాలను నివారించడం వల్ల ప్రతి విభాగం మెరుగైన ఉత్పాదకత ఇవ్వడానికి దారితీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫెలోషిప్‌ల చెల్లింపులో జాప్యానికి సంబంధించిన అంశంపై కూడా డాక్టర్ సింగ్ ఆదేశాలు ఇచ్చారు. స్టార్టప్‌ల కోసం ఎదురుచూడకుండా వాటి కోసం వేటాడి గుర్తించాలని అన్ని శాఖల అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు.  వారికి మద్దతు ఇవ్వడానికి తయారు చేసిన కొన్ని మార్గదర్శకాల ఆధారంగా అర్హులైన స్టార్టప్‌లను గుర్తించి వాటిని గుర్తించాలని సూచించారు. స్టార్టప్‌ల విజయగాథలను ప్రదర్శించి, వీలైన చోట వాటిని ప్రోత్సహించాలని కూడా కేంద్ర మంత్రి శాఖల  అధికారులను కోరారు. విజ్ఞాన్ ప్రసార్‌లో అన్ని ఎస్&టీ డిపార్ట్‌మెంట్ల కోసం అంతర్-మంత్రిత్వ సమీకృత మీడియా సెల్‌ను ఏర్పాటు చేసే అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు.  దీనిపై మరింత చర్చ అవసరమని నిర్ణయించారు.

ఎస్టీఐటీ ముసాయిదా ప్రకారం, స్టార్టప్, నవకల్పనలకు సంబంధించిన పదాలను చేర్చడం కోసం ప్రజల సూచనలను ఆహ్వానించాలన్నారు. 2030 నాటికి పరిశోధన ఫలితాల నాణ్యతలో భారతదేశాన్ని టాప్ 5లో ఉంచే మార్గాలను అనుసరించాలని స్పష్టం చేశారు. 2030 నాటికి సైన్స్‌లో 30% మంది మహిళల భాగస్వామ్యాన్ని లక్ష్యంగా చేసుకోవడం వంటి అంశాలపై చర్చించారు. 2030 నాటికి ఎస్టీఐలో అగ్రశ్రేణి 3 గ్లోబల్ లీడర్‌లలో భారతదేశాన్ని చేర్చడం,  2030 నాటికి సాంకేతికతలో భారతదేశం ఆత్మనిర్భర్తను ఎలా సాధించగలదనే దానిపై క్షుణ్ణంగా చర్చించారు.

ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ స్పేస్, సెక్రటరీ, మంత్రిత్వశాఖఎర్త్ సైన్సెస్, సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ బయోటెక్నాలజీ, సెక్రటరీ, టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్  ఇతర సైన్స్ విభాగాల ప్రతినిధులు,  సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 

 

***



(Release ID: 1810877) Visitor Counter : 167


Read this release in: English , Urdu , Hindi