ఆర్థిక మంత్రిత్వ శాఖ
మార్చి 8,2022న ప్రారంభించినప్పటి నుంచి 37,000మందికి పైగా యుపిఐ123లో చేరిన వినియోగదారులు
Posted On:
28 MAR 2022 5:58PM by PIB Hyderabad
భారతదేశానికి ఆవల యుపిఐ అందుబాటులో ఉండేలా విస్తరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పలు చర్యలు తీసుకుంది. ఈ అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసన్‌రావ్ కరాద్ లోక్‌సభలో సోమవారం లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు. ఆర్‌బిఐ తీసుకున్న చర్యలు దిగువన ఇవ్వడం జరిగిందిః-
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) పూర్తిగా అనుబంధ సంస్థ అయిన ఎన్‌పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటటెడ్ యుపిఐని అంతర్జాతీయం చేసేందుకు కట్టుబడి ఉంది. వివిధ వాణిజ్య సంస్థలు భీమ్ యుపిఐ లేదా క్యూఆర్‌ను సీమాంతర ఆమోదాన్ని సాధ్యం చేయడం కోసం వివిధ దేశాలలో ఎన్ఐపిఎల్ అనేక చర్యలను చేపట్టింది. అంతర్జాతీయ వాణిజ్య సంస్థలలో తాము చేసే టోకు కొనుగోళ్ళ కోసం భీమ్ యుపిఐ లేదా క్యూఆర్‌ను ఉపయోగించి చెల్లించేందుకు భారతీయ పర్యాటకులకు ఈ భాగస్వామ్యాలు సౌలభ్యాన్ని కలుగ చేస్తాయి.
ప్రస్తుతం భీమ్ యుపిఐ క్యూఆర్ కు సింగపూర్ (మార్చి, 2020), భూటాన్ (జులై, 2021), ఇటీవలే యుఎఇ, నేపాల్ (ఫిబ్రవరి 2022) భాగస్వాముల ఆమోదాన్ని పొందాయి. కాగా, గత రెండు ఏళ్ళగా మహమ్మారి కారణంగా ప్రయాణాలపై విధించిన పరిమితులు ఈ సౌకర్యాన్ని సీమాంతర వినియోగం పై ప్రభావాన్ని చూపాయి.
ఈ అంశంలో, సహకారానికి అవకాశం ఉన్న దేశాలలో యుపిఐ విస్తరణ కోసం ఆర్‌బిఐ చర్చలను, ఒప్పందాలను సులభతరం చేస్తోంది. దిగువన పేర్కొన్న వివిధ నమూనాలలో ఈ చర్చలు, ఒప్పందాలను నిర్వహించే మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఒప్పందం లేక ఎంఒయు ద్వారా సెంట్రల్ బ్యాంక్ నుంచి సెంట్రల్ బ్యాంక్ మధ్య సహకారం
నెట్‌వర్క్‌కు, కేంద్ర బ్యాంకు/ ప్రభుత్వ ఏజెన్సీ, నెట్‌వర్క్ నుంచి నెట్‌వర్క్‌కు ఏర్పాటు మధ్య కేంద్రబ్యాంకు సహకారంతో చర్చలు, ఒప్పందాలు
అంతేకాకుండా, మార్చి 2022లో ప్రారంభించిన యుపిఐ123 పే పనితీరు దిగువన పేర్కొన్న విధంగా ఉందిః
మార్చి 2022*
నమోదుతో ఉపయోగిస్తున్న వినియోగదారులు 37,096
ఖాతాను సరిచూసుకునేవారు 31,473
విజయవంతమైన లావాదేవీలు 21,833
విజయవంతమైన లావాదేవీల విలువ (రూ. లక్షలలో) 79.15
మూలంః ఆర్‌బిఐ
* 21.03.2022 నాటికి
(Release ID: 1810872)
Visitor Counter : 184