కోవిడ్-19 సవాళ్లతో పాటుగా, శుద్ధి చేసిన వ్యవసాయ ఆహార ఎగుమతి అభివృద్ధి అథారిటీ (APEDA) 2021-22 ఆర్థిక సంవత్సరానికి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్ణయించిన ఎగుమతి లక్ష్యం లో 90 శాతం సాధించడం ద్వారా కొత్త విజయగాథను రూపొందించింది.
శుద్ధి చేసిన వ్యవసాయ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో 21.5 బిలియన్ డాలర్ల విలువైన శుద్ధి చేసిన వ్యవసాయ ఆహార ఉత్పత్తులను విజయవంతంగా ఎగుమతి చేసింది. 2021-22 సంవత్సరానికి 23.71 బిలియన్ డాలర్ల వార్షిక ఎగుమతి లక్ష్యాన్ని సాధించడానికి సిద్ధంగా ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్ కంటే తొమ్మిది రోజుల ముందుగానే 400 బిలియన్ డాలర్ల వస్తువుల ఎగుమతుల లక్ష్యాన్ని భారతదేశం సాధించిన తర్వాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైతులు, నేత కార్మికులు, MSMEలు, తయారీదారులు ఎగుమతిదారులను ప్రశంసించిన సమయంలో ఇది జరిగింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవడంలో శుద్ధి చేసిన వ్యవసాయ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ కి 5 శాతం కంటే ఎక్కువ వాటా ఉంది.
ఒక ట్వీట్‌లో, ప్రధాన మంత్రి ఇలా అన్నారు, “భారతదేశం 400 బిలియన్ డాలర్ల వస్తువుల ఎగుమతుల ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది; ఈ లక్ష్యాన్ని మొదటిసారిగా సాధించింది. ఈ విజయం సాధించినందుకు మన రైతులు, చేనేత కార్మికులు, MSMEలు, తయారీదారులు, ఎగుమతిదారులను నేను అభినందిస్తున్నాను. ఇది మన ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణంలో కీలక మైలురాయి.
అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే దేశంగా, శుద్ధి చేసిన వ్యవసాయ ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ ఇప్పటివరకు 91 శాతం బియ్యం ఎగుమతి లక్ష్యంతో 8.67 బిలియన్ డాలర్లు సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-ఫిబ్రవరి నుంచి బియ్యం ఎగుమతులు 8.67 బిలియన్ డాలర్లు దాటాయి, భారతదేశం 8.62 బిలియన్ డాలర్ల విలువైన బియ్యాన్ని ఎగుమతి చేసింది, ఇతర తృణ ధాన్యాల ఎగుమతి 847 మిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యంలో 105 శాతానికి పెరిగింది.
పండ్లు కూరగాయల విభాగంలో, ఫిబ్రవరి వరకు 3048 మిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యానికి స్పందనగా, శుద్ధి చేసిన వ్యవసాయ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ 2506 మిలియన్ డాలర్ల విలువైన పండ్లు, కూరగాయల ఎగుమతి చేసింది, ఇది మొత్తం లక్ష్యంలో 75 శాతం.
తృణధాన్యాలు ఇతర శుద్ధి చేసిన వస్తువులు, 2036 మిలియన్ డాలర్లకు ఎగుమతి అయ్యాయి, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 2102 మిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యంలో 89 శాతం, మాంసం, పాడి ఉత్పత్తుల ఎగుమతి నమోదు అయ్యింది. 3771 మిలియన్ వద్ద, ఇది ఫిబ్రవరి 2022 వరకు నిర్ణయమైన 4205 మిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యంలో 82 శాతం.
ఏప్రిల్-జనవరి 2021-22లో గోధుమలు ఎగుమతి 1742 మిలియన్ డాలర్ల విలువతో భారీ పెరుగుదల నమోదు చేసింది, 2020-21లో సంబంధిత కాలంలో 358 మిలియన్ డాలర్లను తాకినప్పుడు 387 శాతం వృద్ధి చెందింది, అయితే ఇతర తృణధాన్యాలు 66 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఏప్రిల్-జనవరి 2021-22లో 869 మిలియన్ డాలర్లను 2020-21లో సంబంధిత కాలంలో 527 మిలియన్ డాలర్లు మాత్రమే చేరుకుంది.
మాంసం, పాడి పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు 2020-21కి సంబంధించిన పది నెలల కాలంలో 3005 మిలియన్ డాలర్లతో పోలిస్తే ఏప్రిల్-జనవరి 2021-22లో 3408 మిలియన్ డాలర్లు అంటే 13 శాతం పెరిగాయి. పండ్లు కూరగాయల ఎగుమతులు 16 శాతం పెరిగి ఏప్రిల్-జనవరి 2021-22లో 1207 మిలియన్ డాలర్లకు చేరాయి, ఏప్రిల్-జనవరి 2020-21లో 1037 మిలియన్లు, శుద్ధి చేసిన పండ్లు కూరగాయల ఎగుమతులు మునుపటి సంవత్సరం సంబంధిత కాలంలో. 2021-22 మొదటి పది నెలల్లో 1143 మిలియన్ డాలర్లకు బదులుగా 11 శాతం పెరిగి 1269 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
సంవత్సరంలో ప్రత్యేకమైన ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం కోసం, APEDA మహారాష్ట్రలోని రైతుల నుంచి సేకరించిన దహను, ఘోల్వాడ్ చికూ, జల్గావ్ అరటిపండు, మరఠ్వాడా కేసర్‌లను మొదటిసారిగా ఎగుమతి చేసిన భౌగోళిక గుర్తింపు (GI) ధృవీకరణ పొందిన ఈవెంట్‌లను ప్రారంభించింది. APEDA గౌహతి విమానాశ్రయం నుంచి దుబాయ్ వరకు విటమిన్ సి, ఐరన్ సంవృద్దిగా ఉండే లెటేకు (బర్మీస్ గ్రేప్) పండ్లు మొదటి సరుకును అందించింది, అలాగే త్రిపుర నుంచి గౌహతి ద్వారా ఇంగ్లాండు, జర్మనీకి తాజా పనసపండును అందించింది.
కింగ్ చిల్లీ అని కూడా పిలుచుకునే తాజా 'రాజా మిర్చీ' మొదటి సరుకు నాగాలాండ్ నుంచి లండన్‌కు ఎగుమతి అయ్యింది. తేనె మొదటిసారిగా అస్సాం నుంచి దుబాయ్‌కి ఎగుమతి చేశారు. భౌగోళిక గుర్తింపు-GI పొందిన మొదటి సరుకు కేరళ నుంచి సింగపూర్‌కు నేంద్రన్ అరటిపండును ట్యాగ్ చేసింది. జాక్‌ఫ్రూట్ పాషన్ ఫ్రూట్ నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు న్యూజిలాండ్‌కు ఎగుమతి అయ్యాయి. వజకులం పైనాపిల్‌ను దుబాయ్ షార్జాకు ట్యాగ్ చేసిన GI మొదటి సరుకు GI మరయూర్, ఇడుక్కి, కేరళ నుంచి దుబాయ్‌కి మరయూర్ బెల్లం ట్యాగ్ చేయడం కూడా APEDA ద్వారా సులభతరం అయింది.
APEDA మొదటిసారిగా లఖింపూర్, ఉత్తరప్రదేశ్ నుంచి ఇరాన్‌కు అరటిపండును ఎగుమతి చేయడానికి గుజరాత్ నుంచి ఐదు సాంప్రదాయ రకాల బియ్యం - గుజరాత్ 17 రకం బియ్యం (జీరాసర్/జీరా సాంబా), శ్రుతి కోలం రైస్, అంబేమోహర్ రైస్, కలి మూచ్ రైస్ ఇంద్రాయని బియ్యం ఇంగ్లాండుకు ఎగుమతి అయ్యింది.
APEDA ఉత్తరాఖండ్ నుంచి మొదటిసారిగా వియత్నాంకు హిమాలయన్ తృణ ధాన్యాలు (సేంద్రీయ బార్న్యార్డ్, ఫింగర్ మిల్లెట్స్, అమరంథస్) ఎగుమతులకు మద్దతు ఇచ్చింది ఒడిశాలోని కటక్ నుంచి సేకరించిన పఫ్డ్ రైస్ రవాణాను వైజాగ్ ఓడరేవు ద్వారా మలేషియాకు ఎగుమతి చేశారు.
"వ్యవసాయ ఎగుమతి విధానం, 2018 లక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో క్లస్టర్ల విధానం ఆధారంగా ఎగుమతిదారులకు సహాయాన్ని అందజేస్తూ ఉన్నాము" అని APEDA ఛైర్మన్ డాక్టర్ M. అంగముత్తు తెలిపారు.
APEDA గత రెండు సంవత్సరాలలో వ్యవసాయ-ఎగుమతులను పెంచడానికి తీసుకున్న కొన్ని కార్యక్రమాలు క్రింది విధంగా ఉన్నాయి:
రాష్ట్రాల సహకారంతో వ్యవసాయ ఎగుమతి విధానం అమలు
- 28 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు, నోడల్ ఏజెన్సీ, నోడల్ అధికారులను నియమించాయి. 26 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాలలో రాష్ట్ర స్థాయి పరిశీలన కమిటీలు ఏర్పాటు అయ్యాయి.
- ఇరవై రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్., కేరళ, నాగాలాండ్, తమిళనాడు, అస్సాం, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మిజోరం, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ గోవా 2 కేంద్రపాలిత ప్రాంతాలు (లడఖ్/ అండమాన్, నికోబార్ దీవులు) రాష్ట్ర నిర్దిష్ట వ్యవసాయ ఎగుమతి కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేశాయి.
- క్లస్టర్ అభివృద్ధి కార్యకలాపాలు
- ఆన్లైన్ ద్వారా క్లస్టర్ అభివృద్ధి రెండవ రౌండ్‌లో ముప్పై రెండు సమావేశాలు నిర్వహించారు. అవసరమైన ప్రధాన జోక్యాలు గుర్తించారు. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలు అనుసంధానం చేశారు.
- రాష్ట్ర వ్యాప్తంగా అనేక క్లస్టర్ జిల్లాల్లో ముప్పై ఎనిమిది క్లస్టర్ స్థాయి కమిటీలు నోటిఫై అయ్యాయి.
- అనంతపురం (అరటి), తేని (అరటి), నాగ్‌పూర్ (నారింజ), నాసిక్ (ద్రాక్ష), చికబల్లాపుర (గులాబీ ఉల్లిపాయ) సమూహాల నుంచి ఉద్యానవన ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి.
- క్లస్టర్ అభివృద్ధి కోసం మంత్రిత్వ శాఖలతో బలోపేతం - వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం జాతీయ ఉద్యానవన బోర్డు (CDP-NHB), ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ (PMFME) విదేశీ వానుజ్య డైరెక్టరేట్ జనరల్ గుర్తించిన క్లస్టర్‌లతో సినర్జీని కలిగి ఉండటానికి ప్రయత్నాలు జరిగాయి.
ఎగుమతి ప్రమోషన్ ఫోరమ్‌ల సృష్టి (EPFలు)
- సంభావ్య ఉత్పత్తుల ఎగుమతికి ఊతం ఇవ్వడానికి అలాగే సరఫరా గొలుసులోని అడ్డంకులను తొలగించడానికి, APEDA ఛైర్మన్, APEDA అధ్యక్షతన ద్రాక్ష, ఉల్లిపాయలు, మామిడి, అరటి, బియ్యం, పాల ఉత్పత్తులు, దానిమ్మ, పూల పెంపకం న్యూట్రి తృణధాన్యాల కోసం ప్రభుత్వాలు, రాష్ట్ర వ్యవసాయ శాఖ వాణిజ్య శాఖ ప్రతినిధులతో ఎగుమతి ప్రోత్సాహక మండళ్ళను (EPFలు) నేషనల్ రెఫరల్ ప్రయోగశాలలు టాప్ 10 ప్రముఖ ఎగుమతిదారుల ప్రమేయంతో సృష్టించింది.
- సేంద్రీయ ఉత్పత్తి కోసం జాతీయ కార్యక్రమం కింద అక్రిడిటేషన్/అనుకూలత/అమలు
- యూరోపియన్ యూనియన్‌లో సర్టిఫికేషన్ కోసం ఒక అధీకృత సంస్థకు విదేశీ అనుమతులు మంజూరు చేశారు.
- యూరోపియన్ యూనియన్‌లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (NPOP) ప్రకారం ధృవీకరణ కోసం సర్టిఫికేషన్ బాడీ అక్రిడిటేషన్ తప్పనిసరి.
- తైవాన్‌తో పరస్పర గుర్తింపు ప్రక్రియ ముగిసింది. NPOP కింద ఇది మొదటి వ్యవస్థ.
- గుర్తింపు పొందిన అధీకృత సంస్థలను 32కి పెంచారు.
- ఏప్రిల్-ఫిబ్రవరి 2022లో ఆర్గానిక్ ఉత్పత్తుల ఎగుమతి 700 మిలియన్ డాలర్లు. భారతదేశం ప్రధానంగా అమెరికా , యూరప్, కెనడా, స్విట్జర్లాండ్, గ్రేట్ బ్రిటన్‌లకు ఎగుమతి చేస్తుంది.
భౌగోళిక సూచన- GI గల ఉత్పత్తుల ప్రచారం
- GI ఉత్పత్తుల ఎగుమతులు ప్రోత్సహించడానికి, ప్రధానమంత్రి నొక్కిచెప్పినట్లుగా, అరబ్, అమెరికా రాయబార కార్యాలయాలతో రెండు V-BSM/ వ్యాపార వ్యయ నిర్వహణ వేదికలు నిర్వహించారు.
- ఆంధ్రప్రదేశ్‌లోని బంగన్‌పల్లి మామిడి, పశ్చిమ బెంగాల్‌లోని గోవింద్‌భోగ్ రైస్, మణిపూర్‌లో బ్లాక్ రైస్, అస్సాం అల్లం మొదలైన GI నమోదిత ఉత్పత్తులను చర్చించడం ప్రచారం చేయడం కోసం APEDA అధికారులు అనేక జిల్లా స్థాయి సమావేశాలలో పాల్గొన్నారు.
- APEDA పోర్టల్‌లో GI ఉత్పత్తుల కోసం ప్రత్యేకమైన కొత్త విభాగం సృష్టించారు. GI నమోదు అయిన వ్యవసాయ ఉత్పత్తులు 112 వరకు గుర్తించారు.
- GI ఉత్పత్తుల కోసం ట్రేసబిలిటీ సిస్టమ్/ గుర్తించదగిన వ్యవస్థ అభివృద్ధి ప్రారంభించారు.
అవగాహన ఒప్పందం (MOU)
- మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని APEDA ICAR కి చెందినా సెంట్రల్ సిట్రస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ICAR-CCRI) ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.
- APEDA 17 డిసెంబర్, 2021న మధ్యప్రదేశ్ నుంచి రైతుల ఆదాయాన్ని ఎగుమతులను పెంచడానికి జవహర్ లాల్ నెహ్రూ కృషి విశ్వ విద్యాలయ, జబల్‌పూర్‌తో అవగాహన ఒప్పందం మీద సంతకం చేసింది.
- షేర్-ఇ-కశ్మీర్ వ్యవసాయ సాంకేతిక విశ్వ విద్యాలయం APEDA మధ్య 5 అక్టోబర్ 2021న శ్రీనగర్‌లో ఈ ప్రాంతం నుంచి ఎగుమతులను పెంపొందించడానికి పరస్పర సహకారంపై అవగాహన ఒప్పందం కుదిరింది.
శుద్ధి చేసిన వ్యవసాయ ఆహార ఉత్పత్తుల ఎగుమతి పెరగడానికి APEDA ద్వారా వివిధ దేశాలలో వ్యాపార వృద్ధి కై ఇతర వ్యాపార సంస్థలను ఆకర్షించే ప్రదర్శనలు నిర్వహించడం, భారత రాయబార కార్యాలయాల క్రియాశీల ప్రమేయం ద్వారా ఉత్పత్తి నిర్దిష్ట సాధారణ మార్కెటింగ్ ప్రచారాల ద్వారా కొత్త సంభావ్య మార్కెట్‌లను అన్వేషించడం వంటి వివిధ కార్యక్రమాల వల్ల కూడా ఎక్కువగా జరిగింది.
APEDA ఎగుమతి పరీక్ష అవశేషాల పర్యవేక్షణ ప్రణాళికల కోసం గుర్తింపు పొందిన ప్రయోగశాలల ఆధునికీకరణ బలోపేతం చేయడంలో కూడా సహకరిస్తుంది. APEDA వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని పెంచడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యత మెరుగుదల, మార్కెట్ అభివృద్ధి ఆర్థిక సహాయ పథకాల క్రింద కూడా సహాయం అందిస్తుంది.
APEDA అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలలో ఎగుమతిదారుల భాగస్వామ్యాన్ని నిర్వహిస్తుంది, ఇది ఎగుమతిదారులకు తమ ఆహార ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌లో మార్కెట్ చేయడానికి వేదికను అందిస్తుంది. APEDA వ్యవసాయ-ఎగుమతులు ప్రోత్సహించడానికి AAHAR, ఆర్గానిక్ వరల్డ్ కాంగ్రెస్, బయోఫ్యాచ్ ఇండియా మొదలైన జాతీయ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది.
ఎగుమతి చేయవలసిన ఉత్పత్తుల నాణ్యత ధృవీకరణను నిర్ధారించడానికి, APEDA భారతదేశం అంతటా 220 ల్యాబ్‌లను ఎగుమతిదారులకు విస్తృత శ్రేణి ఉత్పత్తులకు పరీక్ష సేవలను అందించడానికి గుర్తించింది.
*******