మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 సమయంలో తల్లిదండ్రులు/సంరక్షకులను కోల్పోయిన పిల్లల సంక్షేమం


Posted On: 23 MAR 2022 3:59PM by PIB Hyderabad

COVID-19 మహమ్మారి కారణంగా ఇద్దరు తల్లిదండ్రులను లేదా జీవించి ఉన్న తల్లిదండ్రులలో ఒకరిని  లేదా చట్టపరమైన సంరక్షకులు లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మద్దతుగా గౌరవ ప్రధానమంత్రి ఆ పిల్లల సంక్షేమం  కోసం ‘పి ఎం   కేర్స్’ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకాన్ని ఆన్‌లైన్ పోర్టల్ అంటే pmcaresforchildren.in ద్వారా ఉపయోగించవచ్చు. అటువంటి పిల్లల దరఖాస్తులను సంబంధిత రాష్ట్ర/కేంద్ర పాలిత  ప్రభుత్వాలు పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తాయి. 21.03.2022 నాటికి, మొత్తం 8995 దరఖాస్తులు పోర్టల్‌లో అప్‌లోడ్ అయ్యాయి. 4305మంది   ఇ  గడువు ప్రక్రియ తర్వాత అందిన దరకాస్తులను జిల్లా మేజిస్ట్రేట్‌లు ఆమోదించారు. పిల్లల కోసం ‘PM CARES’ పధకం  పోర్టల్‌లో ఉత్తరప్రదేశ్‌తో సహా  రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంత -వారీ పిల్లల వివరాలు అనుబంధం-Iలో ఉన్నాయి.

మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రాయోజిత పథకం అయిన చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ (CPS) స్కీమ్ - మిషన్ వాత్సల్యని అమలు చేస్తోంది, దీని కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత  ప్రభుత్వాలు సంరక్షణ అవసరమైన, క్లిష్ట పరిస్థితులలో పిల్లలకు సేవలను అందించడానికి మద్దతునిస్తాయి. CPS పథకం కింద ఏర్పాటైన చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌లు (CCIలు) వయస్సు సంబంధ -తగిన విద్య, వృత్తిపరమైన శిక్షణ, వినోదం, ఆరోగ్య సంరక్షణ, స్పాన్సర్‌షిప్ మొదలైన వాటికి మద్దతునిస్తాయి. COVID పట్ల  తగిన ప్రవర్తన , పిల్లల పర్యవేక్షణను ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ సలహాలు, మార్గదర్శకాలను జారీ చేసింది. పిల్లల సంరక్షణ ఇచ్చేవారికి మానసిక ఆరోగ్య మద్దతు కోసం COVID సమయంలో సంరక్షణ సంస్థలు మరియు కోపింగ్ స్ట్రాటజీలు ఇందులో భాగం.

ఇంకా, పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ తదితరాల్లో  కన్వర్జెంట్ విధానం, విద్య, ఆరోగ్యం, 18 సంవత్సరాల వయస్సు నుండి నెలవారీ స్టైఫండ్‌ని నిర్ధారించడానికి గ్యాప్ ఫండింగ్, 23 సంవత్సరాల వయస్సులో రూ. 10.00 లక్షల మొత్తం ద్వారా పిల్లలకు మద్దతునిస్తోంది. . పిల్లల కోసం PM CARES పథకం మార్గదర్శకాల ప్రకారం, మంత్రిత్వ శాఖలు, విభాగాలు అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ (ఆర్థిక వ్యవహారాల విభాగం), విద్యా మంత్రిత్వ శాఖ (పాఠశాల విద్య & అక్షరాస్యత విభాగం మరియు ఉన్నత విద్యా శాఖ), ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు పోస్ట్‌ ల శాఖ, ఈ పథకాన్ని సులభతరం చేస్తున్నాయి.  వారి పథకాలు కార్యక్రమాల క్రింద PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద పిల్లలకు అందాల్సిన సౌకర్యాలు మరియు సేవలను కూడా నిర్ధారిస్తున్నాయి. వీటిని పిల్లలకు వారి అవసరాలకు అనుగుణంగా పంపిణీ చేస్తారు.

ఈ సమాచారాన్ని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ తెలిపారు. ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు.

 

****



(Release ID: 1809017) Visitor Counter : 189


Read this release in: English , Urdu , Manipuri