సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
కాపు రిజర్వేషన్ బిల్లు
Posted On:
23 MAR 2022 3:37PM by PIB Hyderabad
నిర్ణీత ప్రక్రియను అనుసరించి రాష్ట్ర ఒబిసి జాబితాలో సవరణలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. ఆంధ్రప్రదేశ్ కాపు (విద్యా సంస్థల్లో సీట్లు , రాష్ట్ర పరిధిలోని సేవల్లో నియామకాలు లేదా పోస్టుల రిజర్వేషన్) బిల్లు, 2017ను భారత రాష్ట్రపతి ఆమోదం కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రిజర్వ్ చేశారు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం "ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పౌరులకు (విద్యా సంస్థల్లో సీట్లు మరియు రాష్ట్ర ప్రభుత్వ నియామకాలు లేదా ఉద్యోగాలలో రిజర్వేషన్లు) చట్టం 2019" ద్వారా కాపు సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్లు కల్పించింది.అందువల్ల, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
50% కంటే ఎక్కువ రిజర్వేషన్ కోసం మరాఠా రిజర్వేషన్ బిల్లు, 2018ని భారత రాష్ట్రపతి ఆమోదాన్ని పొందడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అందలేదు.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి సుస్రీ ప్రతిమా భౌమిక్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు.
*****
(Release ID: 1808827)
Visitor Counter : 257