నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ఇన్ లాండ్ వాటర్ వేస్ అభివృద్ధి - అర్థ్ గంగ చొరవ
Posted On:
22 MAR 2022 1:15PM by PIB Hyderabad
సరుకు రవాణాలో ఇన్ లాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ (ఐడబ్ల్యుటి) మోడల్ వాటా 2%. సాధ్యాసాధ్యాల అధ్యయనాలు/సవిస్తర ప్రాజెక్టు రిపోర్టులు (డిపిఆర్) కనుగొన్న అంశాల ఆధారంగా దాదాపు 5149 కిలోమీటర్ల పొడవైన 26 జాతీయ జలమార్గాలు (ఎన్ డబ్ల్యు) షిప్పింగ్ , నావిగేషన్ కోసం అభివృద్ధి చేయడానికి సాధ్యమేనని గుర్తించారు. జలమార్గాల వినియోగం ప్రధానంగా నౌకల లభ్యత, అంతరాయం లేని ఫెయిర్ వే , చౌకైన ఫస్ట్ & లాస్ట్ మైల్ కనెక్టివిటీతో సహా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.ప్రైవేట్ రంగం లో. నౌకల లభ్యత కు వివిధ కారణాల వల్ల చాలా వరకు మార్కెట్ ఆధారితమైన అవరోధాలు ఉన్నాయి. ఫెయిర్వే విషయానికొస్తే, ప్రవాహానికి తగినంత నీరు విడుదల చేయడం ద్వారా చేపట్టిన పరిరక్షణ పనులు బలోపేతం అయినప్పుడు మాత్రమే ఫెయిర్వే అభివృద్ధి కావలసిన స్థాయికి స్థిరంగా ఉంటుంది.
ee పరిస్థితులలో, ఐ డబ్ల్యు టి ట్రాఫిక్లో 2001-02 లో 19.77 ఎం టి పి ఐ ఎ నుండి 2021-22లో (ఫిబ్రవరి వరకు) 96.31 ఎం పి టి ఎ కు సానుకూల వృద్ధి ధోరణులు ఉన్నాయి.
"ఇంటిగ్రేటెడ్ నేషనల్ వాటర్ వేస్ ట్రాన్స్ పోర్టేషన్ గ్రిడ్"పై 2014 రైట్స్ రిపోర్ట్ ప్రకారం, ఇన్ లాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ (ఐ డబ్లూటి) మోడ్ , ఇతర ఉపరితల రవాణా ఇతర ఆధిపత్య విధానాల మధ్య ఖర్చు తేడా ఈ క్రింది విధంగా ఉంది:
మోడ్
|
రైల్వేలు
|
హైవేలు
|
ఐ డబ్లూ టి
|
సరుకు రవాణా (రూ./టి.కి.మీ)
|
1.36
|
2.50
|
1.06
|
2016-17లో 4.89 మిలియన్ టన్నుల నుంచి 202-21 నాటికి 9.21 మెట్రిక్ టన్నులకు పెరిగిన ఎన్ డబ్ల్యూ-1 (గంగానది)పై సరుకు రవాణా 2016-17 నుంచి 88 శాతం, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) 17 శాతంగా నమోదైంది. ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.746 కోట్ల వ్యయంతో అర్ధ్ గంగా కాన్సెప్ట్ కు అనుసంధానం చేసిన కార్యకలాపాలతో సహా మొత్తం రూ.4634 కోట్ల వ్యయంతో ప్రపంచ బ్యాంకు సాయంతో జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్టు (జెఎంవిపి) అమలును చేపట్టింది. అర్థ్ గంగా అనే భావనపై, జూలై 2020 లో జెఎంవిపి-2, గంగానది చుట్టూ రైతులు, వ్యాపారులు , ప్రజల జీవనానికి సామాజిక-ఆర్థిక అభివృద్ధి ,ఆర్థిక ప్రయోజనాలను పెంచడం, లాజిస్టిక్స్ ఖర్చు తగ్గింపు మొదలైన లక్ష్యాలతో రూపు దిద్దుకుంది. అర్థ్- గంగా కార్యక్రమం ప్రారంభ దశలో ఉంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పురోగమిస్తోంది.
జెఎంవిపి-2 (అర్థ్ గంగా) లో 62 కమ్యూనిటీ జెట్టీలు, 10 (5 జతలు) రో-రో టెర్మినల్స్. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఉన్నాయి.
S.NO
|
రాష్ట్రం
|
కమ్యూనిటీ జెట్టీలు
|
రో-రో టెర్మినల్స్.
|
1.
|
బీహార్
|
21
|
6 ప్రదేశాలు
|
2.
|
ఉత్తర ప్రదేశ్
|
15
|
1 ప్రదేశం
|
3.
|
జార్ఖండ్
|
3
|
2 ప్రదేశాలు
|
4.
|
పశ్చిమ బెంగాల్
|
23
|
1 ప్రదేశం
|
అర్థ్ గంగా కింద పనులు డీపీఆర్/టెండరింగ్ దశలో ఉన్నాయి.
మహారాష్ట్ర , దక్షిణాది రాష్ట్రాలకు అర్థ్ గంగా తరహాలో ఏ ప్రాజెక్టు అమలు చేయబడలేదు/ ప్రతిపాదించబడలేదు.
కేంద్ర రేవులు, నౌకా యాన నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం లో ఈ వివరాలు తెలిపారు.
*****
(Release ID: 1808180)
Visitor Counter : 199