భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్-II కింద 16 హైవేలు & 9 ఎక్స్‌ప్రెస్‌వేలలో 1576 ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లను మంజూరు చేసిన భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ


హైవేకి ఇరువైపులా ప్రతి 25 కి.మీలకు కనీసం ఒక ఛార్జింగ్ స్టేషన్ మరియు హైవేకి ఇరువైపులా ప్రతి 100 కి.మీల వద్ద లాంగ్ రేంజ్/హెవీ డ్యూటీ ఈవీల కోసం కనీసం ఒక ఛార్జింగ్ స్టేషన్.ఏర్పాటు

Posted On: 22 MAR 2022 2:15PM by PIB Hyderabad
 భారతదేశంలో (ఫేమ్ ఇండియా) స్కీమ్‌లో (హైబ్రిడ్ &) ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వేగవంతమైన అడాప్షన్ మరియు తయారీ దశ-I కింద భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ రూ.43 కోట్లు ఖర్చు కాగల సుమారు 520 ఛార్జింగ్ స్టేషన్లు/ మౌలిక సదుపాయాలను మంజూరు చేసింది.

ఇంకా, ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్-II కింద ఛార్జింగ్ మౌలిక సదుపాయాల స్థాపన కోసం 5 సంవత్సరాల [2019-20 నుండి 2023-24] కాలానికి రూ.1000 కోట్లు బడ్జెట్ కేటాయించారు.   

ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్-II కింద 25 రాష్ట్రాలు/యూటీలలోని 68 నగరాల్లో 2877 ఛార్జింగ్ స్టేషన్‌లను కూడా మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. ఇంకా, ఎంహెచ్ఐ ఈ దశలో 16 హైవేలు, 9 ఎక్స్‌ప్రెస్‌వేలలో 1576 ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లను మంజూరు చేసింది. ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్-II కింద నగరాల్లో మంజూరు చేయబడిన మరియు ఇన్‌స్టాల్ చేయబడిన ఛార్జింగ్ స్టేషన్ల వివరాలు అనుబంధం-I లో పేర్కొన్నారు. ఎక్స్‌ప్రెస్‌వేలు/హైవేలలో మంజూరు చేయబడిన ఛార్జింగ్ స్టేషన్‌ల వివరాలు అనుబంధం-IIలో పేర్కొన్నారు. 

విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం, హైవేకి ఇరువైపులా ప్రతి 25 కి.మీల వద్ద కనీసం ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండాలి మరియు రెండు వైపులా ప్రతి 100 కి.మీల వద్ద లాంగ్ రేంజ్/హెవీ డ్యూటీ ఈవీల కోసం కనీసం ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండాలి. నగరం కోసం 3 కిమీ x 3 కిమీ గ్రిడ్‌లో కనీసం ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయబడుతుంది. 

ఫేమ్ ఇండియా పథకం దశ-I కింద ఈవీల కోసం క్రింది సౌర ఆధారిత ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు మంజూరు అయ్యాయి:

 

 ఛార్జింగ్ స్టేషన్ వివరాలు 

సంస్థ 

మంజూరయినది 

ఏర్పాటైనది 

 

జైపూర్ ఆర్ఈఐఎల్ ద్వారా ఎన్సిఆర్ లో ఈవీల కోసం సౌర ఆధారిత ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు 

ఆర్ఈఐఎల్, జైపూర్ 

3

3

ఢిల్లీ-జైపూర్-ఆగ్రా హైవే వెంట సోలార్ గ్రిడ్ హైబ్రిడ్ మరియు గ్రిడ్ పవర్డ్ ఛార్జింగ్ స్టేషన్

ఆర్ఈఐఎల్

25

25

ఢిల్లీ-చండీగఢ్ హైవే వెంట సౌర ఆధారిత ఛార్జర్‌లు (20 చోట్ల).

 బిహెచ్ఈఎల్ 

20

20

 

***

 



(Release ID: 1808179) Visitor Counter : 153