కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

2020-21 ఆర్థిక సంవత్సరం వరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల ద్వారా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లలో 3.82 లక్షలకు పైగా కంపెనీలు ర‌ద్దు చేయ‌బ‌డిన‌వి

Posted On: 15 MAR 2022 4:35PM by PIB Hyderabad

 

 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల ద్వారా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లలో 3,82,875 పైగా కంపెనీలు ర‌ద్దు చేయ‌బ‌డిన‌వి. కంపెనీల చ‌ట్టం 248(1) చ‌ట్టం కింద వీటిని ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది.  ఈ విషయాన్ని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ రావు ఇంద్రజిత్ సింగ్ ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన‌ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఇంకా దీనిపై వివర‌ణ‌నిస్తూ కంపెనీల చట్టం, 2013 (చట్టం)లో “షెల్ కంపెనీ”  (డొల్ల కంపెనీ)అనే పదానికి ఎలాంటి నిర్వచనం లేదని మంత్రి పేర్కొన్నారు. ఇది సాధారణంగా యాక్టివ్ వ్యాపార కార్య‌క‌లాపాలు లేక‌పోవ‌డం లేదా ముఖ్యమైన ఆస్తులు లేని కంపెనీని సూచిస్తుంది, కొన్ని సందర్భాల్లో ఇది పన్ను ఎగవేత, మనీలాండరింగ్, యాజమాన్యాన్ని మరుగుపరచడం, బినామీ ఆస్తులు మొదలైన చట్టవిరుద్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. "షెల్ కంపెనీల" సమస్యను పరిశీలించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనుమానిత షెల్ కంపెనీల గుర్తింపు కోసం కొన్ని రెడ్ ఫ్లాగ్ సూచికలను హెచ్చ‌రిక‌లుగా ఉపయోగించాలని సిఫార్సు చేసింది. కంపెనీల చట్టంలోని సెక్షన్ 248 (1)లోని నిబంధనలను అమలు చేయడం ద్వారా కంపెనీలను గుర్తించడం మరియు ర‌ద్దు చేయడం కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్‌లను చేపట్టిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దీనిని గురించి మంత్రి  మరిన్ని వివరాలను అందజేస్తూ కంపెనీల రిజిస్టర్‌లోని న్యాయ ప్రక్రియను అనుసరించి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) గ‌ణ‌న ఆర్థిక సంవత్సరానికి ముందు రెండు సంవ‌త్స‌రాల పాటు స‌ద‌రు కంపెనీలు ఎలాంటి వ్యాపారం లేదా ఇత‌రత్రా కార్యకలాపాలను నిర్వహించడం లేదని విశ్వసించడానికి సహేతుక‌మైన‌ కారణం ల‌భించిన‌పుడు కంపెనీలను ఆర్ఓసీ ర‌ద్దు చేసిన‌ట్టుగా మంత్రి పేర్కొన్నారు.  చట్టంలోని సెక్షన్ 455 ప్రకారం ర‌ద్ద‌యిన ఎలాంటి కంపెనీ కూడా ర‌ద్దును ఉటంకిస్తూ త‌మ కంపెనీని తాత్కాలికంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌ని (నిద్రాణ కంపెనీగా) కంపెనీగా ప‌రిగ‌ణించాలంటూ ఎలాంటి దరఖాస్తును నిర్ణీత వ్య‌వ‌ధిలో  చేయలేదని ఆర్ఓసీ ధ్రువీకరించింది.
                                                                                         

****



(Release ID: 1806566) Visitor Counter : 176


Read this release in: English , Urdu , Bengali