పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పర్యాటక మంత్రిత్వ శాఖ మెడికల్ అండ్ వెల్నెస్ టూరిజం కోసం జాతీయ వ్యూహం మరియు రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది: శ్రీ జి. కిషన్ రెడ్డి

Posted On: 14 MAR 2022 4:37PM by PIB Hyderabad

భారతదేశాన్ని మెడిక‌ల్ అండ్ వెల్నెస్ టూరిజానికి గ‌మ్య‌స్థానంల‌గా  ప్రోత్స‌హించేందుకు గాను కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ రంగాల‌ మధ్య బలమైన ఫ్రేమ్‌వర్క్ మరియు సినర్జీని రూపొందించడానికి, పర్యాటక మంత్రిత్వ శాఖ 'మెడికల్ అండ్ వెల్నెస్ టూరిజం' కోసం జాతీయ వ్యూహం మరియు రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. మెడికల్ టూరిజం యొక్క ప్రమోషన్ కారణాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అంకితమైన సంస్థాగత ఫ్రేమ్‌వర్క్‌ను అందించడానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ గౌరవనీయ మంత్రి (పర్యాటకం) ఛైర్మన్‌గా నేషనల్ మెడికల్ అండ్ వెల్నెస్ టూరిజం బోర్డును ఏర్పాటు చేసింది. కొనసాగుతున్న కార్యకలాపాలలో భాగంగా, పర్యాటక మంత్రిత్వ శాఖ, దేశంలోని వివిధ పర్యాటక గమ్యస్థానాలు,  ఉత్పత్తులను ప్రోత్సహించడానికి 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' బ్రాండ్-లైన్ కింద, ముఖ్యమైన మరియు సంభావ్య విదేశీ మార్కెట్‌లలో గ్లోబల్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు ఆన్‌లైన్ మీడియా ప్రచారాలను విడుదల చేస్తుంది. మెడికల్ టూరిజం థీమ్‌ల‌తో సహా వివిధ థీమ్‌లపై కేంద్ర మంత్రిత్వ శాఖ యొక్క సోషల్ మీడియా ఖాతాల ద్వారా డిజిటల్ ప్రమోషన్‌లు క్రమం తప్పకుండా చేపట్టబడతాయి. 'మెడికల్ వీసా' ప్రవేశపెట్టబడింది, ఇది వైద్య చికిత్స కోసం భారతదేశానికి వచ్చే విదేశీ ప్రయాణికులకు నిర్దిష్ట  ఆరోగ్య ప్రయోజనం కోసం ఇవ్వబడుతుంది. 156 దేశాలకు ‘ఈ- మెడికల్ వీసా’ మరియు ‘ఈ-మెడికల్ అటెండెంట్ వీసా’ కూడా ప్రవేశపెట్టబడ్డాయి. ఈ
మెడికల్/ టూరిజం ఫెయిర్‌లు, మెడికల్ కాన్ఫరెన్స్‌లు, వెల్‌నెస్ కాన్ఫరెన్స్‌లు, వెల్‌నెస్ ఫెయిర్లు, అనుబంధ రోడ్ షోలలో పాల్గొనేందుకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ & హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్‌)చే గుర్తింపు పొందిన మెడికల్ టూరిజం సర్వీస్ ప్రొవైడర్లకు మార్కెట్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ స్కీమ్ కింద పర్యాటక మంత్రిత్వ శాఖ త‌గిన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈరోజు లోక్‌సభలో పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్‌రెడ్డి ఒక ప్ర‌శ్న‌కు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
                                                                                   

*******


(Release ID: 1806228) Visitor Counter : 148


Read this release in: English , Urdu , Hindi , Punjabi