పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

దేశీయ నిర్వహణ, మరమ్మతు, సమగ్ర పరిశీలన -MRO సేవలకు వస్తు, సేవల పన్ను 18% నుండి 5%కి తగ్గింపు


Posted On: 14 MAR 2022 3:30PM by PIB Hyderabad

కోవిడ్‌కు ముందు ఆర్థిక సంవత్సరం (2019-20)లో సగటు ప్రయాణీకుల సంఖ్య రోజుకు 4 లక్షలు. 6 మార్చి 2022న, భారతదేశంలోని దేశీయ విమానయాన సంస్థలు దాదాపు 3.7 లక్షల మంది ప్రయాణికులను గమ్యాలకు చేర్చాయి. అంటే రోజువారీ విమాన ప్రయాణికుల సంఖ్య కొన్ని నెలల్లో COVID ముందు స్థాయిలను దాటవచ్చు.

భవిష్యత్తులో విమానయాన రంగంలో పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది, వాటిలో కొన్ని:

(i) ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా  కొత్తవి, ఇప్పటికే ఉన్న విమానాశ్రయాల అభివృద్ధిని సుమారు వచ్చే ఐదేళ్లలో రు. 25,000 కోట్ల అంచనా మూలధన వ్యయంతో చేపట్టింది. ఇందులో కొత్త టెర్మినల్స్ నిర్మాణం, ఇప్పటికే ఉన్న టెర్మినల్‌ల విస్తరణ మార్పులు, రన్‌వేలు, అప్రాన్‌లు, విమానాశ్రయ  నావిగేషన్ సేవలు  (ANS) మౌలిక వసతులు, నియంత్రణ  టవర్‌లు,  సాంకేతిక  బ్లాక్‌ల విస్తరణ లేదా బలోపేతం చేయడం వంటివి ఉంటాయి.

(ii) ఢిల్లీ, హైదరాబాద్,  బెంగళూరులోని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విమానాశ్రయాలు 2025 నాటికి దాదాపు రూ.30,000 కోట్ల భారీ విస్తరణ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. అదనంగా, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో  దేశవ్యాప్తంగా కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధికి రూ.36,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

(iii) దేశవ్యాప్తంగా 21 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు భారత ప్రభుత్వం 'సూత్రప్రాయంగా' ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు, మహారాష్ట్రలోని సింధుదుర్గ్  షిర్డీ, పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్, సిక్కింలోని పాక్యోంగ్, కేరళలోని కన్నూర్, ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్, కర్ణాటకలోని కలబురగి,  ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ అనే ఎనిమిది గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు కార్యకలాపాలు ప్రారంభించాయి.

(iv) రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ (RCS)– ఉడే, దేశ్ కా ఆమ్ నాగ్రిక్ (UDAN) కింద, 65 విమానాశ్రయాలను (8 హెలిపోర్ట్‌ లు  2 వాటర్ ఏరోడ్రోమ్‌లతో సహా) కలుపుతూ 403 మార్గాలు 31 జనవరి 2022 నాటికి ప్రారంభిస్తారు.

(v) డొమెస్టిక్, మెయింటెనెన్స్, రిపేర్  ఓవర్‌హాల్ (MRO) సేవల కోసం వస్తువులు  సేవల పన్ను (GST) రేటు 18% నుండి 5%కి తగ్గించారు.

(vi) విమానాల లీజింగ్ కోసం అనుకూలమైన  ఫైనాన్సింగ్ వాతావరణం ప్రారంభమయ్యింది.

(vii) భారతీయ విమానాశ్రయాలలో ఎయిర్ నావిగేషన్ అవస్థాపన వసతుల  మెరుగుదల జరుగుతోంది.

వినానయాన  టర్బైన్ ఇంధనం  (ATF)పై విలువ ఆధారిత పన్ను (VAT) తగ్గింపు కోరిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్ధన పరిగణన లోకి  తీసుకున్నారు. కింది 11 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో  ATFపై VATని 5% కంటే తక్కువ కి తగ్గించాయి:

అండమాన్, నికోబార్ దీవులు, దాదర్,నగర్ హవేలీ,  డామన్- డయ్యూ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ  కాశ్మీర్, లడఖ్, మధ్యప్రదేశ్, త్రిపుర, ఉత్తర ప్రదేశ్  ఉత్తరాఖండ్.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డా. వి.కె. సింగ్ (రిటైర్డ్ జనరల్) ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

****



(Release ID: 1806119) Visitor Counter : 202


Read this release in: English , Urdu , Gujarati , Tamil