ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశం లో కోవిడ్-19 మహమ్మారి మరియు ప్రజల కు టీకామందు ను ఇప్పించేకార్యక్రమం యొక్క స్థితి ని సమీక్షించడాని కి ఏర్పాటైన ఉన్నత స్థాయి సమావేశాని కిఅధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి


వైరస్ ను ఎదుర్కోవడం లో పౌరుల చురుకైన భాగస్వామ్యం తో పాటు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలసమన్వయ భరిత ప్రయాసల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

టీకా మందు ను ఇచ్చే వారు మరియు ఆరోగ్య సంరక్షణ శ్రమికుల అలుపెరుగని ప్రయాసలను అభినందించిన ప్రధాన మంత్రి

కోవిడ్ కు సంబంధించిన ప్రొటోకాల్ ను అనుసరించడం ముఖ్యం అని నొక్కిచెప్పినప్రధాన మంత్రి

Posted On: 09 MAR 2022 10:46PM by PIB Hyderabad

దేశం లో కోవిడ్-19 మహమ్మారి స్థితి, మరీ ముఖ్యం గా ఒమిక్రాన్ వేవ్ తల ఎత్తిన నేపథ్యం లో టీకామందు ను ఇప్పించే కార్యక్రమం తాలూకు స్థాయి ని సమీక్షించడం కోసం ఏర్పాటైన ఒక ఉన్నత స్థాయి సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అధ్యక్షత వహించారు.

 

ఈ సమావేశ క్రమం లో, భారతదేశం లో కోవిడ్-19 యొక్క స్థితి తో పాటు ప్రపంచ ముఖచిత్రాన్ని గురించిన ఒక సమగ్రమైన సమర్పణ ను ఇవ్వడం జరిగింది. ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమాన్ని అమలు పరచడంలో భారతదేశం యొక్క నిరంతర ప్రయాసల ను, కరోనా తాలూకు కొత్త వేరియంట్ తలెత్తిన వేళ లో ఆసుపత్రుల లో రోగులు తక్కువ సంఖ్యలో చేరుతుండడం, కేసుల గంభీరత మరియు మరణాల రేటు లో క్షీణత ల పరం గా టీకా మందు సమర్ధం గా పని చేస్తుండడం గురించి వంటి అంశాల విశ్లేషణ ఈ సమావేశం లో ప్రముఖం గా చోటు చేసుకొన్నాయి. కేంద్ర ప్రభుత్వ నాయకత్వం లో తీసుకొన్న సక్రియాత్మక మరియు సహకారాత్మక ప్రయాస లు సంక్రమణ వ్యాప్తి ని ప్రభావవంతమైన రీతి లో సంబాళించడం లో తోడ్పడ్డాయన్న విషయం ప్రస్తావన కు వచ్చింది. భారతదేశం మహమ్మారి పట్ల భారతదేశం ప్రతిస్పందించిన తీరు మరియు ప్రజల కు టీకామందు ను ఇప్పించే ప్రయాస లు అనేవి ప్రపంచ స్థాయి లో డబ్ల్యుహెచ్ఒ, ఐక్య రాజ్య సమితి, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలతో పాటు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఎండ్ ఇన్స్ టిట్యూట్ ఫార్ కాంపిటిటివ్ నెస్ యొక్క కథనాల లో ప్రశంసల కు నోచుకొన్న సంగతి ని సమీక్ష సమావేశం లో పేర్కొనడమైంది.

 

ప్రజల కు టీకామందు ను ఇస్తున్నటువంటి వారు, ఆరోగ్య సంరక్షణ శ్రమికులు, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అలుపెరుగని ప్రయత్నాల ను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. కోవిడ్ కు సంబంధించిన నియమాల ను పాటించడాని కి ఇవ్వవలసిన ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. వ్యక్తులు అందరూ ముందుకు వచ్చి నిర్ధారిత గడువు కల్లాల టీకామందు ను వేయించుకోవాలని, వారికి టీకామందును ఇచ్చే వర్గాలు వాటి నిరంతర సమర్థన ను అందించాలని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేస్తూ, ఈ క్రమం లో కోవిడ్ ను దృష్టి లో పెట్టుకొని తగిన జాగ్రత్తల ను అనుసరించాలన్నారు.

 

ఈ సమావేశం లో హోం మంత్రి, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి, నీతి ఆయోగ్ లో ఆరోగ్య విషయాల సభ్యుడు లతో పాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

 

 

***


(Release ID: 1804787) Visitor Counter : 185