రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎల్ఐ పథకంలో పాల్గొనే వారితో స‌మావేశ‌మైన శ్రీ మన్సుఖ్ మాండవియా

Posted On: 09 MAR 2022 6:29PM by PIB Hyderabad

కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా 08 మార్చి 2022న పీఎల్ఐ స్కీమ్‌లో పాల్గొనే వారితో స‌మావేశ‌మై ముచ్చ‌టించారు. ఈ పీఎల్ఐ ప‌థ‌కాల‌ క్రింద ఆమోదించబడిన వివిధ ప్రాజెక్ట్‌ల ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించిన పీఎల్ఐ స్కీమ్‌లలో ఆరుగురు పరిశ్రమ భాగస్వాముల‌తో  స‌మావేశ‌మై వివరాలను సమర్పించారు. ప‌నేసియా మెడిక‌ల్ టెక్నాల‌జీస్ ప్ర‌యివేట్ లిమిటెడ్‌ సంస్థ,  ట్రివిట్రాన్ హెల్త్‌కేర్ ప్రైయివేటు లిమిటెడ్‌, ఫిలిఫ్స్ గ్లోబ‌ల్ బిజినెస్ స‌ర్వీసెస్ ఎల్ఎల్‌పీ, మైక్రోటెడ‌క్ న్యూ టెక్నాల‌జీస్  ప్ర‌యివేట్ లిమిటెడ్, సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ ప్ర‌యివేట్ లిమిటెడ్‌, డెక్ మౌంట్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ‌ల నుంచి ప్ర‌తినిధులు ఔష‌ధాల శాఖ ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రశంసించారు. ఈ ఆరు ప్రాజెక్ట్‌ల ప్రతినిధులు కోవిడ్‌-19 మహమ్మారి ఉన్నప్పటికీ ప్రాజెక్ట్‌లను అమ‌లు చేయడంలో మరియు ముందుకు న‌డిపించేలా తమ ప్రయత్నాలను గురించి వివ‌రించారు. సమస్యలను హ్యాండ్‌హోల్డింగ్ మరియు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నందుకు ప్రభుత్వం ఇచ్చిన మద్దతును అభినందించారు. పీఐఎల్ పథకం కింద ఆమోదించబడిన,  ప్రారంభించబడిన వైద్య పరికరాలలో లీనియర్ యాక్సిలరేటర్ (ఎల్ఐఎన్ఏసీ), రొటేషనల్ కోబాల్ట్ మెషిన్, ఎక్స్ రే పరికరాలు, సీ-ఆర్మ్, ఎంఆర్ఐ కాయిల్స్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు మరియు స్టెంట్‌లు ఉన్నాయి. ఫార్మాస్యూటికల్స్ శాఖ  దేశీయ తయారీని ప్రోత్సహించడానికి మరియు వైద్య పరికరాల రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి మార్చి 2020లో “వైద్య పరికరాల దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ఉత్పత్తి అనుసంధాన‌త ప్రోత్సాహ‌క‌(పీఎల్ఐ) పథకం” ప్రారంభించింది. ఈ పథకం కింద 2027-28 వరకు ఐదు (5) సంవత్సరాల కాలానికి, భారతదేశంలో తయారు చేయబడిన మరియు స్కీమ్ యొక్క లక్ష్య విభాగాల క్రింద కవర్ చేయబడిన వైద్య పరికరాల యొక్క పెరుగుతున్న అమ్మకాలలో 5% చొప్పున ఎంపిక చేసిన కంపెనీలకు ఆర్థిక ప్రోత్సాహకం అందించబడుతుంది. పథకం యొక్క మొత్తం ఆర్థిక వ్యయం రూ.3,420 కోట్లు. ఈ ప‌థ‌కం కింద‌ మొత్తం 21 మంది దరఖాస్తుదారులు 49 ఉత్పత్తులు ఇందులో ఆమోదించబడ్డాయి, వీటి ప్రోత్సాహక మొత్తాన్ని రూ. 2541 కోట్లు. ఈ ఘనత సాధించిన పరిశ్రమ ప్రతినిధులను కేంద్ర మంత్రి త‌న స‌మావేశంలో భాగంగా అభినందించారు. భారతదేశంలోని వైద్య పరికరాల రంగం దేశీయ మరియు ప్రపంచ మార్కెట్లలో వృద్ధికి భారీ సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. దేశీయ సరఫరా గొలుసును బలోపేతం చేయడంలో భారతదేశంలో వైద్య పరికరాల తయారీ గణనీయమైన ముందడుగు వేస్తుందని ఆయన పేర్కొన్నారు. స్థానికీకరణ ప్రభావాన్ని పెంపొందించడానికి మరియు విభాగాల దేశీయ తయారీని మరింతగా పెంపొందించ‌డానికి గట్టి ప్రయత్నం చేయాలని పరిశ్రమ వ‌ర్గాలు మంత్రిని కోరాయి. వైద్య పరికరాల రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ కోసం ప్రధాన మంత్రి దృష్టికి కీలకమైన వైద్య పరికరాలు మరియు వాటి భాగాల స్థానికీకరణతో రూపుదిద్దుకుంటుంది. ఈ రంగాన‌ దిగుమతి-ఎగుమతి వాణిజ్య అంతరాన్ని తగ్గించేందుకు మెడ్‌టెక్ పరిశ్రమను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. పథకాల పురోగతిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేసినందుకు పాల్గొనేవారిని అభినందించారు. ప్ర‌జాసంక్షేమం మరియు పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. వైద్య పరికరాల రంగం ఒక ఆవిష్కరణ ఆధారిత పరిశ్రమ అని మంత్రి ప్రస్తావించారు. తయారీలో స్థిరమైన ప్రపంచ పోటీతత్వం మరియు స్వావలంబన కోసం ఆర్ అండ్ డీలో పెట్టుబడి పెట్టాలని  ప్రోత్సహించారు.  ఈ రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం కోసం మెడ్‌టెక్ పరిశ్రమ నుండి గౌరవ మంత్రి సూచనలను ఆహ్వానించారు. ఈ సమావేశానికి ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శితో పాటు శాఖలోని ఇతర మ‌ఖ్య అధికారులు/ఇత‌ర అధికారులు హాజరయ్యారు. ఈ పీఎల్ఐ  పథకం దేశీయ వైద్య పరికరాల రంగంలోని పరిశ్రమల‌కు ప్రభుత్వ సహకారం యొక్క ముఖ్యమైన చొరవ అని డీఓపీ శాఖ కార్యదర్శి వ్యాఖ్యానించారు. ఆమోదించబడిన ప్రాజెక్ట్‌లను సకాలంలో అమ‌లు చేయడానికి డిపార్ట్‌మెంట్ యొక్క ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సెల్ ద్వారా పీఎల్ఐ ప‌థకం లబ్ధిదారులకు అన్ని ర‌కాల‌ మద్దతును అందిస్తామని హామీ ఇచ్చారు. 2025 నాటికి 50 బిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల‌కు  పెరగడానికి ఇప్పుడిప్ప‌డే ఉద‌యిస్తున్న ఈ రంగానికి సులభతరమైన త‌గిన మద్దతును అందిస్తామని వైద్య ప‌రిక‌రాలు కార్య‌ద‌ర్శి ప‌రిశ్ర‌మ వ‌ర్గాల వారికి హామీ ఇచ్చారు.
                                                                               

*****


(Release ID: 1804757) Visitor Counter : 163


Read this release in: English , Urdu , Hindi