వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వాణిజ్యం మరియు పెట్టుబడులపై 5వ మంత్రివర్గ చర్చలు చేపట్టనున్న భారతదేశం, కెనడా


Posted On: 09 MAR 2022 6:33PM by PIB Hyderabad

కెనడా ప్రభుత్వానికి చెందిన అంతర్జాతీయ వాణిజ్యం, ఎగుమతుల ప్రమోషన్, చిన్న వ్యాపారం మరియు ఆర్థిక అభివృద్ధి మంత్రి గౌరవనీయులైన మేరీ ఎన్జీ ఈ నెల 10 – 13 మధ్య న్యూఢిల్లీకి రానున్నారు. భారతదేశం – కెనడాకు సంబంధించిన వాణిజ్యం మరియు పెట్టుబడుల పై మంత్రివర్గ సంభాషణ (MDTI) నిర్వహించడానికి ఆమె ఇక్కడకు విచ్చేస్తున్నారు.
 
ఈ సమావేశానికి జౌళి శాఖ మంత్రి, వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి మరియు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అధ్యక్షత వహిస్తారు. MDTI సమావేశంలో భారతదేశం-కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) సహా ద్వైపాక్షిక సంబంధాలు మరియు ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి వివిధ ద్వైపాక్షిక వాణిజ్యం మరియు పెట్టుబడి సమస్యలపై చర్చించనున్నారు.
 
COVID-19 మహమ్మారి ఫలితంగా పతనం తర్వాత 2021లో ద్వైపాక్షిక వాణిజ్యంలో బలమైన పునరుద్ధరణ కనిపించింది. వస్తువుల ద్వైపాక్షిక వాణిజ్యం US$ 6.29 బిలియన్లకు చేరుకుంది. మునుపటి సంవత్సరంతో పోలిస్తే 12% వృద్ధి రేటును నమోదు చేసింది. వస్తువులు మరియు సేవలతో సహా మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యం US$11 బిలియన్లను దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2021-జనవరి 2022లో, కెనడాకు భారతీయ ఎగుమతులు సుమారు US$ 3 బిలియన్లకు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 25% వృద్ధిని నమోదు చేసింది.
 
కెనడాకు ప్రధాన భారతదేశం నుంచి జరిగే ప్రధాన ఎగుమతుల్లో మందులు మరియు ఔషధ ఉత్పత్తులు, ఇనుము & ఉక్కు ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు, పత్తి బట్టలు & రెడీమేడ్ వస్త్రాలు (RMG) మరియు రసాయనాలు మొదలైనవి ఉన్నాయి, అయితే భారతదేశానికి కెనడియన్ ఎగుమతులలో పప్పులు, ఎరువులు, బొగ్గు మరియు ముడి పెట్రోలియం మొదలైనవి ఉన్నాయి.

****



(Release ID: 1804648) Visitor Counter : 160


Read this release in: English , Urdu , Hindi