గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అనేక కార్యక్రమాలు


ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా –TRIFED ద్వారా 75 మంది గిరిజన మహిళా సాధకులకు గౌరవ సత్కారం


నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, న్యూఢిల్లీ, గిరిజన మహిళా జీవితంలోని వివిధ రంగాలలో సాధించిన కృషి గుర్తింపు

Posted On: 09 MAR 2022 4:33PM by PIB Hyderabad

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 సందర్భంగా, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ TRIFED, నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS), నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NTRI) ద్వారా నిర్వహించిన వివిధ కార్యక్రమాల ద్వారా స్త్రీత్వం,  అలుపెరగని స్ఫూర్తిని వేడుకగా జరుపుకుంది.

గత కొన్ని సంవత్సరాలుగా, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో మహిళలు సాధించిన విజయాలు స్మరించుకోవడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు అనుగుణంగా, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో TRIFED, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు  సమక్షంలో ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అనిల్ కుమార్ ఝా, గిరిజన వ్యవహారాల కార్యదర్శి, శ్రీ. రామ్‌సిన్హ్ రథ్వా, TRIFED చైర్మన్, శ్రీమతి ఆర్ జయ. అదనపు కార్యదర్శి , ఎండీ  TRIFED ఐన డాక్టర్ నవల్జిత్ కపూర్, జాయింట్ సెక్రటరీ హాజరైన వారిలో ఉన్నారు.

ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో, దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన మహిళా కళాకారులు వన్ ధన్ లబ్దిదారులను గౌరవించడం, తన చుట్టూ ఉన్న స్త్రీల   జీవనోపాధిని మెరుగుపరచడంలో వారి సహకారాన్ని ప్రదర్శించడం మూలస్తంభాలుగా ప్రభుత్వం భావిస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, TRIFED సంఘాలలో మార్పు తీసుకురావడానికి గణనీయమైన కృషి చేసిన 75 మంది గిరిజన మహిళా సాధకుల కృషిని గుర్తించింది, వారికి మెమెంటోలు మరియు సర్టిఫికేట్‌లను అందించారు.

ఈ సందర్భంగా శ్రీ బిశ్వేశ్వర్ తుడు మాట్లాడుతూ, “అంతర్జాతీయ మహిళా దినోత్సవం మంచి సమాజాన్ని, దేశాన్ని నిర్మించడంలో మహిళలు పోషిస్తున్న కృషి , వారి పాత్ర గుర్తుచేసుకుంటూ వేడుక  జరుపుకునే సందర్భం” అని వ్యాఖ్యానించారు.

శ్రీ. TRIFED ఛైర్మన్ రామ్‌సిన్హ్ రథ్వా, మహిళా సాధకుల కృషిని ప్రశంసించారు. TRIFED మహిళలు తమ అత్యున్నత సామర్థ్యాన్ని సాధించేలా ప్రోత్సహిస్తూనే ఉంటుందని అన్నారు.

గిరిజన వ్యవహారాల కార్యదర్శి శ్రీ అనిల్ కుమార్ ఝా మాట్లాడుతూ వన్ ధన్ యోజన అనేది గిరిజన జనాభాకు ప్రత్యేకించి మహిళల జీవనోపాధిని పెంచడం ద్వారా సాధికారత కల్పించే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ముఖ్యమైన పథకం అని చెప్పారు.

2వ ఈవెంట్‌లో, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మోటా) ఆధ్వర్యంలో స్థాపించబడిన నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) కమిషనర్- NEST, శ్రీ అసిత్ గోపాల్, ఇతర NESTS అధికారుల సమక్షంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది.

EMRS మహిళా పాఠశాల నాయకులు- ఈఎమ్‌ఆర్‌ఎస్ కల్సి కి చెందిన శ్రీమతి సుధా పైనులి,   గతేడాది రాష్ట్రపతి అవార్డు పొందిన ఉత్తరాఖండ్‌లోని తమ అనుభవాలను పంచుకున్నారు. శ్రీమతి విభా జోషి, EMRS లుమ్లా, అరుణాచల్ ప్రదేశ్; శ్రీమతి ఉషా శుక్లా, EMRS కర్పవాండ్, ఛత్తీస్‌గఢ్ శ్రీమతి  గీతాంజలి భూషణ్, EMRS నిచార్, హిమాచల్ ప్రదేశ్ కూడా వారి ప్రయాణాల అనుభవాలను వారి సహకారం EMRS విద్యార్థులకు ఎలా సహాయపడింది వివరించారు. ట్రైబల్ హెల్త్ సెల్ సలహాదారు శ్రీమతి వినీతా శ్రీవాస్తవ్ మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను పంచుకున్నారు మరియు కుటుంబ శ్రేయస్సు కోసం స్త్రీ ఆరోగ్యం ఎంత ముఖ్యమో నొక్కి చెప్పారు.

నారీ శక్తి స్ఫూర్తిని కొనసాగిస్తూ, నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, న్యూ ఢిల్లీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం-ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా “గిరిజన మహిళా సాధకులను జరుపుకోవడం”పై జాతీయ వెబ్‌నార్‌ను నిర్వహించింది, ఇందులో అస్సాం, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు వంటి వివిధ రాష్ట్రాల గిరిజన సాధకులు, తమ కథలను వివరించారు.

ఈ సందర్భంగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ నవల్‌జిత్ కపూర్ మాట్లాడుతూ ఎమ్‌ఆర్‌ఎస్, వందన్ కేంద్రం వంటి మంత్రిత్వ శాఖ వివిధ పథకాలు, స్కాలర్‌షిప్‌లు, విద్య, జీవనోపాధి రంగాలలో మహిళలకు ఎలా సాధికారత కల్పిస్తున్నాయో వివరించారు. TRIFED ద్వారా మహిళా గిరిజన కళాకారుల ఉత్పత్తులను ప్రోత్సహించడం, వారి నృత్యాలు, సంస్కృతి, సంప్రదాయాలను డాక్యుమెంట్ చేయడం ద్వారా మంత్రిత్వ శాఖ సాధికారత కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు.

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్.జయ, వాహన చక్రాల మాదిరిగా పురుషులు మరియు మహిళలు ఒకరినొకరు ఎలా సహకరించు కుంటారనే దాని గురించి మాట్లాడారు. తమ అలుపెరగని కృషితో వేలాది మంది మహిళల జీవితాల్లో స్ఫూర్తిని నింపి, వారిపై ప్రభావం చూపిన గిరిజన మహిళా సాధకులను ఆమె అభినందించారు.

డాక్టర్ నుపుర్ తివారీ, గిరిజన మహిళా సాధకులైన శ్రీమతి జమున టుడు (పద్మశ్రీ అవార్డు గ్రహీత జార్ఖండ్), శ్రీమతి భువనేశ్వరినేతమ్ (ఛత్తీస్‌గఢ్), శ్రీమతి షీలా పావెల్ (తమిళనాడు), శ్రీమతి బిధులతా హుయికా (ఒడిశా), శ్రీమతి సుషీ ద్హ్రూ సాధించిన విజయాలను ప్రస్తావించారు. (ఛత్తీస్‌గఢ్), Ms. రవీనా బరిహా (ఛత్తీస్‌గఢ్), చెట్ల సంరక్షణ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, విద్యలో మరియు ప్రభుత్వ ఇతర కార్యక్రమాలలో లింగమార్పిడి హక్కులను బలోపేతం చేయడంలో పనిచేశారు. గిరిజన వర్గాల జీవితాల్లో మార్పులను తీసుకురావడానికి పూర్తి కృషి అంకితభావంతో పోరాడిన ఈ మహిళా సాధకులు తమ అనుభవాలను పంచుకున్నారు.

*******



(Release ID: 1804647) Visitor Counter : 220


Read this release in: English , Urdu , Hindi , Tamil