బొగ్గు మంత్రిత్వ శాఖ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ “ఐకానిక్ వీక్” వేడుకల్లో భాగంగా జరిగిన పెయింటింగ్ పోటీలు మరియు స్వాతంత్య్ర పోరాటం పై షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ నిర్వహించిన బొగ్గు మంత్రిత్వ శాఖ
Posted On:
09 MAR 2022 6:18PM by PIB Hyderabad
75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని, భారతదేశం అమృత్ కాల్‌లోకి ప్రవేశించిన సందర్భంగా, బొగ్గు మంత్రిత్వ శాఖ 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఐకానిక్ వీక్ వేడుకల్లో భాగంగా 7వ తేదీ నుండి 11 మార్చి, 2022 వరకు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఈవెంట్లు మరియు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఐకానిక్ వీక్ వేడుకలు ఈ రోజు మూడో రోజుకు చేరుకున్న సందర్భంగా బొగ్గు మంత్రిత్వ శాఖలోని అధికారుల కోసం ‘భారత స్వాతంత్ర్య పోరాటం’ పై ప్రత్యేకంగా షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించారు.
మంత్రిత్వ శాఖకు చెందిన ఉద్యోగులు/ అధికారుల పిల్లల్లో స్కూలు విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ‘స్వాతంత్ర్య ఉద్యమం లేదా భారతదేశం భవిష్యత్తు @ 75’ అనే అంశాలను థీమ్ గా ఇచ్చారు.
ఇక రోజులో రెండో భాగమైన మధ్యాహ్నం నుంచి ‘నికర శూన్య ఉద్గారాలు’ అనే అంశం పై పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్ జేఆర్. భట్ సెక్రటరీ (బొగ్గు) మరియు ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో మాట్లాడారు. వర్చువల్ మోడ్‌లో ఈ ప్రసంగం జరిగింది.
AKAM పేరిట నిర్వహిస్తున్న ఈ ఐకానిక్ వీక్ వేడుకలు మార్చ్ 11, 2022 వరకు కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించి పలు కార్యక్రమాలు మరియు కార్యాచరణలు ముందుగానే రూపొందించి సిద్ధం చేశారు.
ప్రగతిశీల భారతదేశం మరియు దాని గర్వకారణమైన చరిత్రకు గుర్తుగా భారత ప్రభుత్వం 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్య "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" జరుపుకుంటోంది. AKAM యొక్క అధికారిక ప్రయాణం 12 మార్చి, 2021న ప్రారంభమైంది, ఇది మన 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవానికి 75 వారాల కౌంట్‌డౌన్‌ను ప్రారంభించింది. ఇది 15 ఆగస్టు 2023న ముగుస్తుంది.
****
(Release ID: 1804646)
Visitor Counter : 190