వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

శ్రీ పీయూష్ గోయల్ పర్యావరణ వ్యవస్థాపకత- క్లైమేట్‌ప్రెనర్‌షిప్ ను ఒక లక్ష్యంగా స్వీకరించాలని పర్యావరణ ప్రచారకర్తలకు పిలుపు.


జీవ ఇంధనాల వినిమయ విషయంలో భారతదేశం మిగతా దేశాలకు మార్గదర్శి- శ్రీ పీయూష్ గోయల్

దేశానికి సుస్థిర భవిష్యత్తును సాధించాలనే ప్రభుత్వ నిబద్ధతకు కేంద్ర బడ్జెట్ 2022 నిదర్శనం.

భారతదేశం ‘అందరికీ అందుబాటులో ఉండే ఎలీడీ బల్బుల ద్వారా ఉన్నత జ్యోతి’ (ఉజాలా మిషన్) పధకం అనుకరణకు తగిన ఉదాహరణ

పర్యావరణ సాంకేతిక అంకుర పరిశ్రమలు మనదేశంలో 2100 కోట్ల డాలర్ల పెట్టుబడిని ఆకర్షించాయి - శ్రీ గోయల్

కర్బన ఉద్గారాల నుండి ఆర్ధికాభివృద్ధిని వేరుచేయాలి - శ్రీ గోయల్

Posted On: 07 MAR 2022 6:40PM by PIB Hyderabad

వాణిజ్యం,  పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం  ప్రజా పంపిణీ,  జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈరోజు పర్యావరణ ప్రచారకర్త్త బృందానికి  మూడు విషయాలను పంచుకున్నారు . ఒకటి -పర్యావరణ వ్యవస్థాపకతను ఒక ఆదర్శ కార్యక్రమంగా స్వీకరించాలని; ఆయన పర్యావరణ ప్రచారకర్తలకు పిలుపునిచ్చారు.  రెండు-21వ శతాబ్దపు ఆవిష్కరణలు పర్యావరణ న్యాయం అందే కొత్త ఉదయానికి నాంది పలికేలా చూడాలని కోరారు. పునరుత్పాదక శక్తి, హైడ్రోజన్  ఎలక్ట్రిక్ వాహనాల కోసం సాంకేతికతలో పరిశ్రమల భాగస్వామ్యం  పెంచి కార్బన్ ఉద్గారాలకు  ఆర్ధికవృద్ధికి  సంబంధం లేకుండా చూడాలని ఆయన కోరారు. మూడోది -మార్పు ఇంటి నుంచే ప్రారంభం కావాలి అన్నారు. భారతదేశ గృహవినిమయానికి  రోజువారీ జీవితంలో స్థిరమైన, సేంద్రీయ, సహజ ఉత్పత్తులకు మారాలని ఆయన కోరారు.

ఎక్స్‌ పో-2020 ఇండియా పెవిలియన్  లో  భామ్లా ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమం-పర్యావరణంపై ప్రత్యేక ప్రభావశీల విభాగం అయిన “ఓన్లీ వన్ ఎర్త్ – ఎ డిస్కషన్ ఆన్ ఎన్విరాన్‌మెంట్”లో ఆయన ప్రసంగించారు.

దుబాయ్ 2022- ప్రదర్శన లో పర్యావరణం-సుస్థిరత ప్రధానాంశాలుగా మారాయని శ్రీ పీయూష్ గోయల్ సంతోషం వ్యక్తం చేశారు. పరిరక్షణ  సుస్థిరత కోసం ఎడతెగని అన్వేషణలో భామ్ల ఫౌండేషన్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఆయన ప్రశంసించారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్ ఎక్స్‌ పో 2020లో ఇండియా పెవిలియన్‌కు గర్వకారణమైన స్థానాన్ని కల్పించినందుకు ఆ దేశ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఎక్స్‌ పోలో ఇండియా ప్రాంగణానికి 12 లక్షల సందర్శకులు  వచ్చారు, ఇది కార్యక్రమంలో  అత్యధిక నమోదుగా ఉంది.

నీరు,శక్తి, సంరక్షణ-  పునర్వినియోగం సూత్రాలపై నిర్మించినందున, సుస్థిరతను కార్యాచరణలోకి తీసుకురావడానికి ఇండియా పెవిలియన్ సరైన ఉదాహరణ అని శ్రీ గోయల్ అభిప్రాయపడ్డారు. జీవవైవిధ్యం, వన్యప్రాణులు, పరిరక్షణ, పర్యావరణ చర్యలు,  పునరుత్పాదక శక్తిలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలు వంటి అంశాలపై విస్తృత చర్చలు నిర్వహించినందుకు ఇండియా పెవిలియన్‌ను మంత్రి అభినందించారు.

భారతదేశానికి,  భారతీయులకు సుస్థిరత సహజాతమని శ్రీ గోయల్ గమనించారు. మకర సంక్రాంతి, పొంగల్,  బిహు వంటి అనేక పండుగలను ఉదహరిస్తూ, అటువంటి భారతీయ పండుగలు, ఆచారాలు, మాతృభూమి అందించే పుష్కలమైన కానుకలుగా భావించి  జరుపుకుంటామని అన్నారు.

మహాత్మా గాంధీని ఉటంకిస్తూ, "ప్రతి మనిషి అవసరాలను తీర్చడానికి భూమి తగినంతగా అందిస్తుంది, కానీ ప్రతి మనిషి  దురాశను తీర్చదు" అని మంత్రి అన్నారు. పారిస్ ఒప్పందంపై సంతకం చేసినందున, మోడీ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీపై చర్చకు దారిచూపిందని ఆయన అన్నారు. పారిస్ ఒప్పందం కింద పేర్కొన్న లక్ష్యాలను సాధించే క్రమంలో పురోగమనం సాగించే  భారత్‌ మాత్రమే ఏకైక  జి20 దేశమని ఆయన అన్నారు.

పునరుత్పాదక ఇంధనరంగంలో భారతదేశం సాధించిన అనేక మైలురాళ్ల జాబితా ప్రస్తావిస్తూ, ప్రపంచంలోనే 4వ అతిపెద్దదిగా ప్రచారం  పొందిన,  భారతదేశ స్థాపిత నాన్-ఫాసిల్ ఎనర్జీ కెపాసిటీ గత 7.5 ఏళ్లలో దాదాపు 300% పెరిగి మరింతగా 150 గిగావాట్ కంటే ఎత్తున,  పైన నిలిచిందని మంత్రి తెలిపారు. నేడు ప్రపంచంలోనే అతి తక్కువ సోలార్  ధరలు (రూ. 2.14 kW/H) భారతదేశంలోనే సాధ్యామౌతున్నాయని ఆయన తెలిపారు.

గత కొన్నేళ్లుగా సుస్థిరమైన  గ్రీన్ ఎనర్జీ రంగంలో భారతదేశం తీసుకున్న అనేక కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, ప్రకాశించే దీపాలను LED లైట్లుగా (UJALA) మార్చడానికి భారతదేశం ప్రపంచం అనుకరించడానికి అసలైన ఉదాహరణ అని శ్రీ గోయల్ అన్నారు.

శ్రీ గోయల్ గ్లాస్గోలోని COP26(The UN Climate Change Conference in Glasgow ) లో ప్రధాన మంత్రి అందించిన 5 అమృత మూలకాలు లేదా పంచామృతాలను ప్రస్తావించారు.  ఈ లక్ష్యాలు, స్థిరమైన శక్తి పట్ల భారతదేశ నిబద్ధతను బలోపేతం చేశాయని అన్నారు. ఈ లక్ష్యాలు 2030 నాటికి 500 గిగావాట్ నాన్-ఫాసిల్ ఎనర్జీ సామర్థ్యాన్ని చేరుకోవడం, 2030 నాటికి పునరుత్పాదక శక్తి నుండి మన శక్తి అవసరాలలో 2030 నాటికి 50% తీర్చడం, వందకోట్ల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, ఆర్థిక వ్యవస్థపై   కార్బన్ తీవ్రతను 2030 నాటికి 45% తగ్గించడం 2070 నాటికి నికర జీరో లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం ప్రయత్నం చేస్తుంది.

అభివృద్ధి కోసం భారతదేశ  దార్శనికత 5P లపై ఆధారపడి ఉందని మంత్రి చెప్పారు – పీపుల్(ప్రజలు), ప్లానెట్(భూమి), ప్రోస్పరిటీ(శ్రేయస్సు), పీస్(శాంతి), పార్టనర్ షిప్ (భాగస్వామ్యం). మనం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హరిత ఆర్థిక వ్యవస్థ కూడా అని మంత్రి తెలిపారు.

కేంద్ర బడ్జెట్ 2022 సుస్థిర భవిష్యత్తును సాధించాలనే ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. సావరిన్ గ్రీన్ బాండ్లు,  సోలార్ పధకం కోసం అదనపు కేటాయింపులు వంటి హరిత పారిశ్రామికీకరణకు భారతదేశ నిబద్ధతను బలోపేతం చేసే కొన్ని ప్రధాన బడ్జెట్ నిబంధనలను ఆయన వివరించారు.

భారతదేశం ప్రపంచంలోనే హైడ్రోజన్ ఆధారిత  ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి నొక్కిచెప్పారు  నేషనల్ హైడ్రోజన్ మిషన్ కింద, 2030 నాటికి హైడ్రోజన్ ధరను కిలోకు రూ. 350 నుండి రూ. 160కి తగ్గించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది,. 'ఫ్యూయల్ ఆఫ్ ది ఫ్యూచర్' గా హైడ్రోజన్‌ ను అభివర్ణిస్తూ,  వాహనాలు త్వరలో హైడ్రోజన్ ఇంధనంగా నడుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జీవ ఇంధనాల రంగంలో భారతదేశం  దృక్పధం  గురించి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ, వ్యవసాయ ఉత్పత్తి దారుగా ఉన్న భారతదేశం చెరకు,  ఇతర ఆహార ధాన్యాలను ఇథనాల్‌గా మార్చడంపై దృష్టి సారిస్తోందని, వీటిని మన ఇంధన సామర్ధ్యానికి  కలపడం వల్ల ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని అన్నారు. జీవ ఇంధనాల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే సత్తా భారత్‌కు ఉందని ఆయన అన్నారు.

‘వ్యర్థాలను శక్తిగా మార్చడం’  ‘వ్యర్థాన్ని సంపదగా మార్చడం’పై ప్రభుత్వం దృష్టిని మంత్రి నొక్కిచెప్పారు.

మధ్యప్రదేశ్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన భారతదేశపు అతిపెద్ద బయో-సిఎన్‌జి ప్లాంట్‌ను ప్రస్తావిస్తూ  ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పశుసంపద ఉన్న భారతదేశం,  శక్తి  ఉత్పత్తి చేయడానికి పశువుల వ్యర్థాలను ఉపయోగిస్తోందని శ్రీ గోయల్ అన్నారు.

ప్రధాన మంత్రిని ఆలోచనను ఉటంకిస్తూ, శ్రీ గోయల్- 'ప్రపంచం అన్ని రకాల సహజ వనరుల క్షీణతను చూస్తోంది. అటువంటి దృష్టాంతంలో, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అవసరం ఎంతైనా ఉంది. తగ్గించు, పునర్వినియోగం, రీసైకిల్ అనే మంత్రాల సాధనలో భారతదేశం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. భారతదేశం ఇప్పుడు స్వచ్ఛ భారత్ 2.0 (అర్బన్) కింద 70% వ్యర్థాలను శక్తి నిర్వహణ  చేస్తుంది.

2022 నాటికి భారతదేశం ఒకేసారి వినియోగించే  ప్లాస్టిక్ రహితంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సుస్థిరత రంగంలో నిమగ్నమై, భారీ సంఖ్యలో ఉన్న అంకురా పరిశ్రమల గురించి ప్రస్తావిస్తూ, 2014 నుండి, భారతదేశం 21 కోట్ల  డాలర్ల పెట్టుబడి ఈ రంగంలో వెచ్చించిందని ఆయన అన్నారు.

శ్రీ గోయల్ అవార్డు విజేతలను అభినందించారు, వారిలో  UPL డైరెక్టర్ శ్రీ విక్రమ్ ష్రాఫ్ (ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ కార్పొరేట్ అవార్డ్), ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రీజినల్ ప్రెసిడెంట్ శ్రీ రోహిత్ కొచర్ (పాండమిక్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ అవార్డ్), చైర్మన్ మేనేజింగ్ వర్కర్ శ్రీ రాజ్ శెట్టి, రమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్(ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ కార్పొరేట్ అవార్డు) కూడా ఉన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే సుస్థిర జీవనం ఇకపై మనకు సాధ్యం కాదనే ఆలోచనతో మంత్రి తన సందేశాన్ని ముగించారు. నేడు, మనమందరం ఏకతాటిపైకి వచ్చి ‘పర్యావరణం కోసం జీవనశైలి’ని ఒక ప్రచారంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మానవాళిని కాపాడేందుకు భూమాతను కాపాడుకుందాం అని అన్నారు.

***** 



(Release ID: 1804042) Visitor Counter : 202


Read this release in: English , Urdu , Hindi , Tamil