ఆర్థిక మంత్రిత్వ శాఖ

46వ సివిల్ అకౌంట్స్ డే సందర్భంగా ఈ-బిల్లు ప్రాసెసింగ్ వ్యవస్థను ప్రారంభించిన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్


చెల్లింపుల ప్రక్రియ లో విస్తృత పారదర్శకతను తీసుకురావడానికి , వేగవంతం చేయడానికి కేంద్ర బడ్జెట్ 2022-23లో ప్రకటించిన ఈ-బిల్లు వ్యవస్థ ప్రారంభం

Posted On: 02 MAR 2022 5:25PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2022-23 కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ఎలక్ట్రానిక్ బిల్లు (ఈ-బిల్లు) ప్రాసెసింగ్ వ్యవస్థను ఢిల్లీ లోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో ఈ రోజు 46వ సివిల్ అకౌంట్స్ డే సందర్భంగా ప్రారంభించారు.

 

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్థిక మంత్రితో పాటు , ఆర్థిక కార్యదర్శి డాక్టర్ టి.వి.సోమనాథన్; కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సిజిఎ) ఆర్గనైజేషన్ హెడ్ శ్రీమతి సోనాలి సింగ్; అదనపు సిజిఎ (పిఎఫ్ఎంఎస్) శ్రీమతి ధరిత్రి పాండా, ప్రిన్సిపాల్ సిజిఎ (ఎంహెచ్ ఎ) శ్రీమతి భారతి దాస్ ఇంకా సి జి ఎ, ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ-బిల్ ప్రాసెసింగ్ సిస్టమ్ చొరవ గురించి మాట్లాడుతూ, విస్తృత పారదర్శకతను తీసుకురావడానికి ,చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయడానికి ఇది 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఇఒడిబి), డిజిటల్ ఇండియా పర్యావరణ వ్యవస్థ'లో భాగమని అన్నారు. సరఫరాదారులు , కాంట్రాక్టర్లు తమ క్లెయింను ఆన్ లైన్ లో సమర్పించడానికి అనుమతించడం ద్వారా ఇది పారదర్శకత, సమర్థత , కాగితరహిత చెల్లింపు వ్యవస్థను పెంపొందిస్తుందని, ఇది వాస్తవ సమయ ప్రాతిపదికన ట్రాక్ చేయబడుతుందని ఆమె తెలిపారు.

 

సిజిఎ పోషించిన కీలక పాత్రను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ లావాదేవీలను అంతరాయం లేకుండా ఉంచడంలోను,  సజావుగా చెల్లింపులు జరిగేలా చూడటంలోను ఇంకా దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడం లో సిజిఎను ఆర్థిక మంత్రి ప్రశంసించారు. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (పిఎఫ్ఎంఎస్) ద్వారా ట్రెజరీ సింగిల్ అకౌంట్స్ (టిఎస్ ఎ), డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డిబిటి) పిహెచ్ ఎఎల్ లను విజయవంతంగా అమలు చేయడం ఒక ఉదాహరణ అని శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు.

 

ఇంకా వివరిస్తూ, టిఎస్ఎ సిస్టమ్ "జస్ట్ ఇన్ టైమ్" ఫండ్ విడుదల యంత్రాంగాన్ని అభివృద్ధి చేసిందని ,కేంద్ర ప్రభుత్వ 150 స్వయంప్రతిపత్తి సంస్థలలో అమలు జరిగిందని ఆర్థిక మంత్రి చెప్పారు; కాగా, పిఎఫ్ఎంఎస్ పారదర్శకత కోసం , వేగవంతమైన చెల్లింపును సులభతరం చేయడానికి , చివరి లబ్ధిదారునికి ప్రభుత్వం చేరగలిగే సాధనంగా అభివృద్ధి చెందిందని అన్నారు. 

 

సిజిఎ సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వయించు  కోవడం ద్వారా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తోందని, తద్వారా ప్రజా ధనం

చౌర్యాన్ని అరికడుతుందని, ప్రయోజనాలు నేరుగా పౌరులకు చేరేలా చూస్తుందని శ్రీమతి సీతారామన్ అన్నారు.

 

అకౌంట్ వ్యవస్థ సక్రమంగా పని చేసేలా తెరవెనుక కృషి ద్వారాసివిల్ అకౌంట్స్ సంస్థ సాధించిన అనేక నిశ్శబ్ద మైలురాళ్లను ఆర్థిక మంత్రి ప్రశంసించారు.

 

ఈ సందర్భంగా ఆర్థిక కార్యదర్శి, వ్యయ కార్యదర్శి డాక్టర్ టి.వి.సోమనాథన్ మాట్లాడుతూ, పిఎఫ్ఎంఎస్ ఒకవైపు దేశ ఆర్థిక నిర్వాహకులకు కీలకమైన సహాయం అని, మరోవైపు, చాలా ముఖ్యమైన పౌర కేంద్రిత చొరవ గా కొత్త ఇ-బిల్లు వ్యవస్థ నిలుస్తుందని పేర్కొన్నారు. కొత్త ఇ-బిల్ వ్యవస్థ సమయం వేదాను మరింత తగ్గిస్తుందని, డిజిటల్ ఇండియా , ఈవోడిబి దిశగా అకౌంట్స్ కు నమూనాగా పనిచేస్తుందని డాక్టర్ సోమనాథన్ తెలిపారు.

 

అంతకు ముందు, శ్రీమతి సోనాలి సింగ్

స్వాగతం చెబుతూ, సంవత్సరాలుగా సిజిఎ తీసుకున్న వివిధ కార్యక్రమాలను, కొత్తగా  చేపట్టిన  చొరవలను , భవిష్యత్తు కోసం

సి జి ఎ రోడ్ మ్యాప్ ను వివరించారు. దేశం వృద్ధి పథంలో ఉందని, సిజిఎ దేశాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తుందని శ్రీమతి  సింగ్ అన్నారు.

 

శ్రీమతి ధరిత్రి పాండా, అదనపు సిజిఎ (పిఎఫ్ఎంఎస్), ఇ-బిల్ వ్యవస్థ ముఖ్యమైన ప్రయోజనాల గురించి వివరించారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు , విభాగాల తొమ్మిది పే అండ్ అకౌంట్ ఆఫీస్ (పిఎవో) అకౌంట్స్ లో పైలట్ ప్రాతిపదికన ఈ-బిల్లు వ్యవస్థను అమలు చేస్తామని శ్రీమతి పాండా తెలిపారు.

 

సిజిఎ తరఫున ప్రిన్సిపాల్ సిజిఎ (ఎంహెచ్ ఎ) శ్రీమతి భారతి దాస్ ధన్యవాదాలు తెలిపారు.

 

-బిల్ ప్రాసెసింగ్ సిస్టమ్ పై మరిన్ని వివరాల కోసం లింక్ చూడండి: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1802343

****



(Release ID: 1802454) Visitor Counter : 131


Read this release in: Marathi , English , Urdu , Hindi