శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహమ్మారి మనకు సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ ధర్మాలను నేర్పింది: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


జాతీయ సైన్స్ డే సందర్భంగా సోమవారం న్యూఢిల్లీలోని జామియా హమ్దర్డ్ విశ్వవిద్యాలయంలో కీలక ప్రసంగం చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్

ఆరోగ్య సంరక్షణ రంగంలో గరిష్ట ఫలితాన్ని సాధించడానికి అన్ని ఆరోగ్య సంరక్షణ విధానాలు , వ్యూహాలను పటిష్టం చేయాలని కేంద్ర మంత్రి పిలుపు

జామియా హమ్దర్డ్ "రీసెర్చ్ ప్రమోషన్ స్కీంస్"కు పూర్తి ప్రభుత్వ మద్దతు: డాక్టర్ జితేంద్ర సింగ్ హామీ

Posted On: 01 MAR 2022 5:31PM by PIB Hyderabad

మహమ్మారి మనకు సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ ధర్మాలను నేర్పిందని , మహమ్మారి అంతరించిన తరువాత కూడా, మానవాళి ప్రయోజనాలకు అనుగుణంగా వివిధ వ్యాధులకు తగిన చికిత్స , నివారణ కోసం సమీకృత ఔషధ విధానాన్ని సంస్థాగతం చేయవలసిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ అండ్ టెక్నాలజీ; స్టేట్ మినిస్టర్ (ఇండిపెండెంట్ ఛార్జ్) ఎర్త్ సైన్సెస్; ఎంఒఎస్ పిఎంఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు శక్తి మరియు అంతరిక్షం, డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 

న్యూఢిల్లీ లోని జామియా హమ్దర్డ్ విశ్వవిద్యాలయంలో కేంద్ర సైన్స్ ,టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిధులతో ఏర్పాటు చేసిన  ప్రపంచంలోనే అత్యాధునిక ట్రాన్స్ మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ సదుపాయాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోవీడ్   సమయంలో ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, యోగా, నేచురోపతి , ఇతర ప్రాచీన ప్రత్యామ్నాయాల నుండి తీసుకున్న రోగనిరోధక పెంపు పద్ధతుల కోసం పాశ్చాత్య దేశాలు కూడా భారతదేశం వైపు చూడటం ప్రారంభించాయని ఆయన చెప్పారు.అయితే, కోవిడ్ దశ ముగిసిన తరువాత కూడా, ఒకే వైద్య విధానం లేదా ఔషధం తో నయం

చేయలేని వివిధ వ్యాధులు,  రుగ్మతలను  విజయవంతంగా నియంత్రించడానికి, నయం చేయడానికి వివిధ వైద్య నిర్వహణ విధానాల ఏకీకృతం, సంఘటితం కీలకమని ఆయన అన్నారు.

 

2014లో నరేంద్ర మోడీ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశీయ వైద్య విధానాల సద్గుణాలను కేంద్ర వేదిక పైకి తీసుకువచ్చారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఐక్యరాజ్య సమితిలో ఏకగ్రీవ తీర్మానాన్ని తీసుకు వచ్చింది కూడా ప్ర ధాన మంత్రి శ్రీ మోదీ అని, దీని ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఇంటికి యోగా చేరుకుందని ఆయన అన్నారు. దేశీయ  వైద్య విధాన ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకొని ప్రధాన మంత్రి ఆయుష్ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. అలాగే, శ్రీనగర్ లో యునానీ మెడిసిన్ లో ఎండి ని కూడా మోడీ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు.

 

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిధులతో హమ్ దర్డ్ విశ్వవిద్యాలయంలో నెలకొల్పిన ప్రపంచంలోని అత్యాధునిక ట్రాన్స్ మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ సదుపాయాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. అధ్యాపకులు , రీసెర్చ్ స్కాలర్ లకు  పరిశోధన గ్రాంట్లు , ఫెలోషిప్ ల రూపంలో జామియా హమ్దార్డ్ కు సైన్స్ టెక్నాలజీ శాఖ (డి ఎస్ టి) మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

జామియా హమ్దార్డ్ డిఎస్ టి- పి యు ఆర్ ఎస్ ఇ (ప్రమోషన్ యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ అండ్ ఎక్సలెన్స్), డిఎస్ టి- ఎఫ్ ఐ ఎస్ టి (విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్ అండ్ టి మౌలిక సదుపాయాల మెరుగుదల నిధి), డిఎస్ టి-సిఎస్ ఆర్ ఐ (కాగ్నిటివ్ సైన్స్ రీసెర్చ్ ఇనిషియేటివ్) మొదలైన వాటిని జామియా హమ్ దర్ద్ అందుకుంటోంది.

 

ఈ సంవత్సరపు  సైన్స్ డే ఇతివత్తం "సుస్థిర భవిష్యత్ కోసం విజ్ఞాన శాస్త్రం సాంకేతిక పరిజ్ఞానంలో సమగ్ర దృక్పథం‘ గురించి

 ప్రస్తావిస్తూ, ఆరోగ్య సంరక్షణ రంగంలో

గరిష్ట ఫ లితాలను సాధించడానికి అన్ని ఆరోగ్య సంరక్షణ విధానాలను, వ్యూహాలను పటిష్టం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

 

వివిధ శాస్త్రాలు , వైద్య డొమైన్ లను సమీకృతం చేయడం ద్వారా మాత్రమే న్యూ ఇండియా ఆరోగ్య సంరక్షణలో ఆత్మనిర్భర్ గా మారుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. హెల్త్ కార్డు కలిగిన రోగి తన వ్యాధికి సంబంధించిన అన్ని వైద్య సలహాలను  పొందడానికి వీలుగా అన్ని ఔషధ వ్యవస్థలను ఒకే గొడుగు కింద ఇంటిగ్రేట్ చేయడానికి ప్రయత్నాలు చేయాలని ఆయన అన్నారు.డిజిటల్ హెల్త్ మిషన్ తో సహా

ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రయత్నాలను కూడా ఆయన వివరించారు

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, యునానీ, ఆయుర్వేద వైద్యానికి చెందిన హకీమ్ లు, అనేక రకాల వ్యాధులకు, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకు భరించ కలిగే ఖర్చు లో  సమర్థవంతమైన చికిత్సలను అందించారని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

ఈ రెండు విధానాల  ఔషధాల వ్యవస్థ ఇప్పటికీ చికిత్సా జోక్యాన్ని కోరుతున్న రోగులలో  విశేష నమ్మకం కలిగి ఉందని, భారత ప్రభుత్వం ఆయుష్ శాఖ ద్వారా వనరులు నియంత్రిత ఆమోదాలతో కూడిన మద్దతు అందిస్తూ ఈ వ్యవస్థలను బలోపేతం చేసిందని ఆయన అన్నారు. హకీమ్ సాహిబ్ స్థాపించిన హమ్ దర్డ్ లేబొరేటరీలు మంచి తయారీ విధానాలను అనుసరించి యునానీ ఫార్ములేషన్లను పెద్ద సంఖ్యలో

అందిస్తున్నాయని, కొన్ని హమ్దర్డ్ మందులు గురించి. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం

లేదనీ, భారతదేశంలోని దాదాపు ప్రతి కుటుంబం వాటిని ఉపయోగిస్తోందని

ప్రపంచ ఉనికిని కూడా కలిగి ఉందని ఆయన చెప్పారు.

 

1989 లో ప్రారంభమైనప్పటి నుండి, జామియా హమ్దర్డ్ పురోగతి అద్భుతంగా

ఉందని , దాని ఫార్మసీ పాఠశాల వరుసగా చివరి మూడు ర్యాంకింగ్స్ కోసం విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్స్ ప్రకారం దేశంలో అగ్ర శ్రేణి సంస్థగా నిలిచిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  సంస్థ నాయకత్వం, అధ్యాపకులు ,విద్యార్థులు సంస్థ అభ్యున్నతికి చేసిన కృషిని మంత్రి అభినందించారు. జామియా హమ్దర్డ్ గురించి ప్రస్తావిస్తూ, అనేక "రీసెర్చ్ ప్రమోషన్ స్కీంలు" ప్రారంభించారు, జామియా హమ్దర్డ్ అనేక "రీసెర్చ్ ప్రమోషన్ స్కీం‘‘ లను

ప్రారంభించినట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావిస్తూ, జామియా హమ్దర్డ్ కు మాత్రమే కాకుండా దేశానికి కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చే ఉన్నత నాణ్యత గల పరిశోధనను ప్రచురించాలని అధ్యాపక సభ్యులను కోరారు.

 

ఫార్మాస్యూటికల్, లైఫ్ సైన్సెస్, మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్ , ఇంకా అనుబంధ ఆరోగ్య విద్య రంగంలో నేర్చుకునే ప్రతిష్టాత్మక సీట్లలో జామియా హమ్దర్డ్ ( డీమ్డ్ టు బి యూనివర్సిటీ) ఒకటి. యుజిసి చట్టం 1956 లోని సెక్షన్ 3 కింద భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ దీనికి 1989లో 'డీమ్డ్ టు బి యూనివర్సిటీ' హోదాను మంజూరు చేసింది. అప్పుడు వెయ్యి కంటే తక్కువ మంది విద్యార్థులతో ప్రారంభమైంది. ప్రస్తుతం, జామియా హమ్దార్డ్ లో సుమారు 10,000 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు, ఇందులో సుమారు 600 మంది పిహెచ్ డి విద్యార్థులు ఉన్నారు. ఇది వరుసగా మూడు సైకిల్స్ లో 'ఎ' గ్రేడ్ లో నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్ ఎఎసి) ద్వారా గుర్తింపు పొందడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి అన్నారు. దీనికి ‘ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్' హోదా కోసం భారత ప్రభుత్వ సాధికార కమిటీ కూడా సిఫారసు చేసింది.

 

విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు హకీమ్ అబ్దుల్ హమీద్ జీ 20 వ శతాబ్దానికి చెందిన భారతీయ వైద్య వ్యవస్థ (యునానీ) కు చెందిన ప్రఖ్యాత వైద్యుడు.  75 సంవత్సరాల తన యునానీ ప్రాక్టీసు లో యునానీ పట్ల విశ్వాసం ఉన్న మూడు మిలియన్లకు పైగా ప్రజలకు తన స్పర్శ తో స్వస్థత అందించిన రికార్డు ఆయనకు ఉంది. విద్య, ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆయన చేసిన అపారమైన కృషికి గాను, అనేక జాతీయ ,అంతర్జాతీయ అవార్డులు , గౌరవాలతో పాటు భారత్ ప్రభుత్వ పద్మశ్రీ , పద్మ భూషణ్ వంటి దేశంలోని ముఖ్యమైన పౌర అవార్డులను కూడా ఆయన అందుకున్నారు. 

 

<><><><><>


(Release ID: 1802351) Visitor Counter : 170


Read this release in: English , Urdu , Hindi , Tamil