రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
బల్క్ డ్రగ్స్ – ఉత్పత్తి ఆధార ప్రోత్సాహక పథకం PLI లబ్ధిదారులైన కంపెనీ ప్రతినిధులతో డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సంభాషణ
బల్క్ డ్రగ్స్/ఔషధాల టోకు ఉత్పత్తి రంగంలో PLI పథకం కింద ₹ 3,685 కోట్ల పెట్టుబడితో 33 క్లిష్టమైన APIల కోసం 49 ప్రాజెక్ట్ ల ఆమోదం
Posted On:
25 FEB 2022 7:54PM by PIB Hyderabad
కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా బల్క్ డ్రగ్స్ PLI పధకం లబ్దిదారులతో ఈరోజు ప్రత్యక్షంగా సంభాషించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖూబా కూడా పాల్గొన్నారు.
కీలక ఔషదాల ఉత్పత్తి కోసం, ఈ రంగంలో స్వావలంబన సాధించడానికి భారత ప్రభుత్వం మార్చి 2020లో బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. ప్రకటన, పధకం మార్గదర్శకాలు 27 జూలై 2020న జారీ చేశారు ₹ 3,685 కోట్ల పెట్టుబడితో 33 కీలకమైన APIల కోసం మొత్తం 49 ప్రాజెక్ట్ లు ఆమోదించారు.
బల్క్ డ్రగ్స్ కోసం PLI పథకం కింద ఇప్పటివరకు ఆమోదించిన 49 ప్రాజెక్ట్ లలో ₹ 335 కోట్ల పెట్టుబడితో 16,021 మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో 8 ప్రాజెక్ట్ లు ప్రారంభమయ్యాయి. ఇంకా, ₹ 504 కోట్ల పెట్టుబడితో 18,614 మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 12 ప్రాజెక్ట్ లు వాణిజ్య ఉత్పత్తి కోసం అభివృద్ధిదశలో ఉన్నాయి. అవి 31 మార్చి 2022 నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు.
ప్రారంభంలో, ఈ 20 ప్రాజెక్ట్ ల ప్రతినిధులందరూ COVID-19 మహమ్మారి ఉన్నప్పటికీ ప్రాజెక్ట్ లను సాకారం చేయడంలో తమ ప్రయత్నాలను అందించారు. సమస్యలను స్వీకరించడానికి , పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నందుకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతును అభినందించారు.
‘ఆత్మ నిర్భర్ భారత్’కు దారితీసే కీలకమైన ఔషధ రంగంలో స్వయం ప్రతిపత్తి కోసం ప్రధానమంత్రి దార్శనికత సాకారమయ్యే దిశగా ఈ ఘనత సాధించినందుకు పరిశ్రమ ప్రతినిధులను కేంద్ర మంత్రి అభినందించారు. భారతదేశంలో ఫార్మాస్యూటికల్ రంగం, వ్యాపార దృక్పథంతో పాటు సామాజిక వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రంగం అని ఆయన నొక్కి చెప్పారు. కోవిడ్ సమయంలో దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఔషధాల రంగం కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. ఔషధాల నాణ్యత కోసం ఈ రంగం నిబద్ధతను ఆయన గుర్తించారు. తగిన వనరులను కేటాయించడం ద్వారా స్థిరమైన ప్రపంచ పోటీతత్వం కోసం పరిశోధన ఆవిష్కరణల రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పరిశ్రమ ప్రోత్సహించారు.
కేంద్ర సహాయ మంత్రి ఈ పరిశ్రమలను అభినందిస్తూ, మిగిలిన ప్రాజెక్టుల ఏర్పాటు, వాటి వాణిజ్య ఉత్పత్తి వేగవంతం చేయాలని అభ్యర్థించారు.
ప్రారంభంలో స్కీమ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ- IFCI లిమిటెడ్, పథకపు స్థూలదృష్టిని సమర్పించింది. 44,000 MT అర్హత కలిగిన ఉత్పత్తుల సామర్థ్యానికి మించి పరిశ్రమలు 83,000MT కంటే ఎక్కువ వార్షిక సామర్థ్యానికి కట్టుబడి ఉన్నాయని చెప్పారు.
ఈ పథకం కింద అర్హత కలిగిన మిగిలిన 10 ఉత్పత్తుల కోసం మూడవ రౌండ్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ అధికారులు పేర్కొన్నారు, చివరి తేదీ 13 మార్చి 2022 వరకు పథకం కింద ప్రయోజనాలు పొందేందుకు పరిశ్రమలు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థించారు.
సమావేశంలో ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సెంట్రియంట్ ఫార్మాస్యూటికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి ప్రతినిధులు. మేఘమణి LLP, ఎమ్మెన్నార్ ఫార్మా Pvt. లిమిటెడ్, ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిటెడ్, హెటెరో గ్రూప్, సాధన నైట్రో కెమ్ లిమిటెడ్ శ్రీపతి ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఈ సమావేశానికి హాజరయ్యారు వారు కోవిడ్ సమయంలో ప్రభుత్వం ప్రారంభించిన పథకాన్ని ప్రశంసించారు. ఇప్పటికే రూ. 335 కోట్ల పెట్టుబడితో కర్మాగారాలలో ప్రారంభమైన బల్క్ డ్రగ్ CDA, పారా అమినో ఫినాల్, అటోర్వాస్టాటిన్, సల్ఫాడిజైన్, ఆక్స్ కార్‌బజెపైన్, లెవోఫ్లోక్సాసిన్, కార్బిడోపా లెవోడోపా వంటి ఔషధాలు ఉన్నాయి, రంగం మొత్తం 16000 MT కంటే ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది.
*****
(Release ID: 1801319)
Visitor Counter : 220