వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పి.ఎం. కిసాన్‌సమ్మాన్ నిధి యోజన
పి.ఎం. కిసాన్ పథకం తృతీయ వార్షికోత్సవాలు
Posted On:
24 FEB 2022 6:40PM by PIB Hyderabad
పిఎం- కిసాన్ పథకం కేంద్ర ప్రభుత్వ పథకం. దీనిని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించారు. భూమి కలిగిన రైతుల ఆర్థిక అవసరాలకు ఆసరాగా ఉండేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చారు. సంవత్సరానికి 6 వేల రూపాయయల వంతున రైతులకు ఈ పథకం కింద ప్రయోజనం చేకూరుతుంది. దీనిని మూడు సమాన వాయిదాలలో రైతుల బ్యాంకు ఖాతాలలో ప్రత్యక్ష నగదు బదిలీ కింద ప్రతి నాలుగు నెలలకు ఒక సారి జమచేస్తారు. ఈ పథాకన్ని తొలుత చిన్న , సన్నకారు రైతులకు అంటే 2 హెక్టార్ల వరకు భూమి కలిగిన రైతులకు వర్తింప చేశారు. ఆత ర్వాత దీని పరిధిని 01.06.2019 నుంచి భూమి కలిగిన రైతులందరికీ వర్తింపచేశారు.
ఈ పథకం ప్రారంభించిన తరువాత పలు సాంకేతిక, ప్రాసెస్ ఆధునీకరణలు చోటుచేసుకున్నాయి. దీనివల్ల ఎక్కువమంది లబ్ధిదారులు వీలైనంత సమర్ధంగా ఈ పథకం వల్ల ప్రయోజనం పొందడానికి వీలు కలుగుతుంది.
2022 ఫిబ్రవరి నాటికి ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద 11.78 కోట్ల మంది భూమి కలిగిన రైతులకు సుమారు 1.82 లక్షల కోట్ల రూపాయలను పలు వాయిదాలలో దేశవ్యాప్తంగా గల అర్హులైన లబ్ధిదారులకు విడుదల చేయడం జరిగింది. ఇందులో 1.29 లక్షల కోట్ల రూపాయలను ప్రస్తుత కోవిడ్ 19 మహమ్మారి సమయంలో విడుదల చేయడం జరిగింది.
స్వీయ నమోదు ప్రక్రియ: లబ్ధిదారుల స్వీయ నమోదు ప్రక్రియను సులభతరం చేశారు. మొబైల్ యాప్ , పిఎం కిసాన్ పోర్టల్, కామన్ సర్వీసు సెంటర్లకు వెళ్లి పేరు సులభంగా నమోదు చేసుకునే వీలు కల్పించారు. లబ్ధిదారులకు గరిష్ఠ ప్రయోజనం కలిగించేందుకు ఈ ఏర్పాట్లు చేశారు.
రికవరీ సైతం సులభతరంః అర్హత లేని లబ్ధిదారుల విషయంలో వారి ఖాతాలో జమ అయిన మొత్తాన్ని వెనక్కు తీసుకునే ప్రక్రియ కూడా పారదర్శకంగా, సులభతరంగా ఉండేట్టు చూశారు. ఇందుకు డిమాండ్ డ్రాఫ్ట్ కానీ లేదా వ్యక్తిగతంగా చెక్కు సమర్పించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర నోడల్ అధికారి ఖాతానుంచి కేంద్ర ప్రభుత్వ ఖాతాలోకి ఆటో ట్రాన్స్ ఫర్ అయ్యేలా చూశారు. దీనితో ఈ పథకం సమర్ధంగా పనిచేయడమే కాక తక్కువ సమయంలో పనులు పూర్తి చేసేదిగా ఉంది..
ఫిర్యాదుల పరిష్కారం, హెల్ప్ డెస్క్ః
లబ్ధిదారులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి సమగ్ర వివాద పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర స్థాయినలో పి.ఎం. కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ను ఏర్పాటుతోపాటు పలు చర్యలు తీసుకున్నారు. దీనిద్వారా ఈ పథకం కింద భాగస్వామక్య పక్షాలను సమన్వయం చేసుకుని , ఈ ప్రక్రియను గాడిలో పెడతారు. కేంద్ర స్థాయిలో ఒక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ లేదా ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు గల సమస్యలు పరిష్కరించేందుకు ఇది పనిచేస్తుంది. దీనిఇద్వారా 11.34 లక్షల ఫిర్యాదులు రైతులు నుంచి స్వీకరించారు ఇందులో 10.92 లక్షల ఫిర్యాదులను ఆయా రాష్ట్రాల అధికార యంత్రాంగం పరిష్కరించింది.
భౌతిక పరిశీలన పద్ధతి : ఈ పథకం లబ్ధిదారుల కచ్చితత్వం, అర్హతలను పరిశీలించేందుకు ప్రతి సంవత్సరం లబ్ధదారులలో 5 శాతంమంది వివరాలను భౌతికంగా పరిశీలించాలని ఈ పథకం నిబంధనలు తెలియజేస్తున్నాయి. భౌతిక వెరిఫికేషన్ నమూనా సహాయంతో , భౌతిక పరిశీలనకు ఎంపిక చేసే లబ్ధిదారుల జాబితాను ఆటోమేటిక్ విధానంలో ఎంపిక చేస్తున్నారు. ఇందుకు వ్యక్తిగత జోక్యం ఏదీ ఉండదు.10 శాతం లబ్ధిదారుల వాలిడేషన్‌కు సంబంధించి 2021 మే 14న చివరి త్రైమాసిక వాయిదా చెల్లింపు అనంతరం ప్రత్యేక మాడ్యూల్ ను ప్రవేశపెట్టారు.
ఆదాయ పన్ను పరిశీలన:
ఈ పథకం కింద లబ్ధిదారుల సమాచారాన్ని ఆదాయపన్ను సమాచారంతో సరిచూస్తారు. ఆడిట్‌తో కూడిన అధీకృత సమాచారంతో దీనిని పరిశీలిస్తారు.
ఆధార్ సమాచారంతో పరిశీలన : ఈ పథకం మొత్తం పారదర్శకంగా ఉండేందుకు ఆధార్ సమాచారంతో సరిచూడడాన్ని తప్పనిసరి చేశారు. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి 11.20 కోట్ల మంది లబ్ధిదారుల సమాచారాన్ని ఆధార్ తో అనుసంధానం చేశారు.
***
(Release ID: 1800978)
Visitor Counter : 274